విజయవాడ: బాలిక ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత వినోద్ జైన్ పాపను ఇబ్బందులకు గురి చేసాడని, అతని వేధింపుల వల్లే పాప ఎంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. బాలిక మూడు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంత వేదనకు గురైందో అర్ధం చేసుకోవచ్చని, పాప తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ )
నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామి ఇచ్చారు. వినోద్ జైన్.. కేశినేని నాని ముఖ్య అనుచరుడని, వినోద్ తరపున ప్రచారం చేసిన చంద్రబాబు , ఇప్పుడు ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాపకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రి మార్చురీకి చేరుకున్న మంత్రి వెల్లంపల్లి పోస్టుమార్టం ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. అనంతరం బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment