
సాక్షి, విజయవాడ: విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంజి సర్కిల్ వద్దగల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దీక్షిత గౌరి టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో మృతురాలు రాసిన సూసైడ్ నోట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో.. వినోద్ జైన్‌ను తనను ఎలా ఇబ్బంది పెట్టాడో బాలిక సూసైడ్ నోట్‌లో రాసింది. ఈ ఘటనపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 37వ డివిజన్ కార్పొరేటర్‌గా టీడీపీ తరపున పోటీ చేసిన వినోద్ జైన్ చంద్రబాబు సహా పలువురు కీలక నేతలతో సత్ససంబంధాలు కలిగి ఉన్నారు.