శ్రీకాకుళం: టీడీపీ మహానాడును కేవలం చంద్రబాబు నాయుడు, లోకేశ్ భజన కోసమే ఏర్పాటు చేశారని వైఎస్‌ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఆంధ్రా యూనివర్శిటీని దెయ్యాల కొంప అని టీడీపీ ఎమ్మెల్సీ అన్నట్లు... ఏయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానాడు ఓ దెయ్యాల సమావేశం అని ఆయన ఎద్దేవా చేశారు.
అక్కడ జరిగిందిన మహానాడు కాదని, మాయనాడు అని తమ్మినేని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని విధంగా మహానాడు సాగిందని ఆయన అన్నారు. అంతేకాకుండా అభివృద్ధిలో ఏపీ బ్రహ్మాండంగా దూసుకుపోతుందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.