సాక్షి,హైదరాబాద్: రాజకీయాల్లో ఫిరాయింపులు సర్వసాధారణమే. ఒక పార్టీలో నెగ్గి.. మరో పార్టీ కండువా కప్పేసుకోవడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జరుగుతుంటుంది. అలా.. పోటీ చేసిన ఫిరాయింపుదారులకు తెలంగాణ ఓటర్లు ఈ ఎన్నికల్లో గట్టి షాకే ఇచ్చారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ మీద పోటీ చేసి నెగ్గి.. మరో పార్టీలోకి వెళ్లి.. ఇప్పుడు మారిన పార్టీ మీద పోటీ చేసిన అభ్యర్థులు బొక్కబోర్లాపడ్డారు. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు.. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వాళ్లకు బీఆర్‌ఎస్ అధిష్టానం మళ్లీ 2023 ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చింది. కానీ, ఆ ఫిరాయింపుదారుల్ని ఓటర్లు నిర్మోహమాటంగా తిరస్కరించారు.
మెచ్చా నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేటలో గతంలో మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ) తరఫున గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి ఆయన బీఆర్‌ఎస్ తరఫునే పోటీకి దిగారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణకు ఓటర్లు పట్టం కట్టారు. ఫిరాయింపుదారి నాగేశ్వరరావుపై ఆది నారాయణ ఏకంగా 28,358 ఓట్లతో గెలుపొందారు.
కోరుకంటి చందర్
రామగుండం నియోజకవర్గంలో 2018లో కోరుకంటి చందర్(ఫార్వర్డ్ బ్లాక్) నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చందర్ పోటీ చేయగా.. రామగుండం ప్రజలు ఆయన్ని ఓడించారు. ఫిరాయింపుదారి కోరుకంటి చందర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ 40 వేల ఓట్ల బంపర్ మెజార్టీతో గెలుపొందారు.
పైలెట్ రోహిత్ రెడ్డి
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గంలో గెలుపొందిన పైలెట్ రోహిత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి తార్వత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన రోహిత్‌రెడ్డిని ఆ నియోజకవర్గం ప్రజలు ఓటర్లు తిరస్కరించారు.
గండ్ర వెంకట రమణారెడ్డి
గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గండ్ర వెంకట రమణారెడ్డి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేశారు. ఈసారి ఫిరాయించిన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి గండ్ర ఓటమిపాలయ్యారు.
చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ నియోజకర్గలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల విరేశం చేతిలో చిరుమర్తి లింగయ్య ఓటమిపాలయ్యారు. ఆయితే లింగయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఫిరాయించిన బీఆర్‌ఎస్ నుంచి ఈసారి పోటీ చేశారు. నకిరేకల్ నియోజకవర్గ ఓటర్లు లింగయ్యను తిరస్కరించారు.
వనమా వెంకటేశ్వర్ రావు
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో వనమా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్‌ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన ఫిరాయించిన బీఆర్‌ఎస్ పార్టీ నుంచే మళ్లీ పోటి చేయగా ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి వనమా కొత్తగూడెంలో ఓడిపోయారు.
సండ్ర వెంకటవీరయ్య
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన సండ్ర అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2023లో ఫిరాయించిన బీఆర్‌ఎస్ నుంచి మళ్లీ పోటీ చేయగా.. సత్తుపల్లి ఓటర్లు తిర్కరించారు.
రేగా కాంతారావు
గత ఎన్నికల్లో పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫిరాయించిన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంతారావు మళ్లీ బరిలో దిగారు. అయితే ఈసారి పినపాక సెగ్మెంట్ ఓటర్లు కాంతారావును తిరస్కరించారు.
హరిప్రియ నాయక్
కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో విజయం సాధించారు హరిప్రియా నాయక్. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి.. బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పికపాక నుంచి పోటీ చేసిన హరిప్రియ ఓటమిపాలయ్యారు.
ఉపేందర్ రెడ్డి
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశారు. ఆయన్ని పాలేరు నియోజకవర్గ ఓటర్లు తిర్కరించారు.
సురేందర్
ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేందర్ గెలుపొందారు. ఆయన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎల్లారెడ్డి నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన్ని ఎల్లారెడ్డి ఓటర్లు సురేందర్‌రెడ్డిని తిరస్కరించారు.
హర్షవర్ధన్‌రెడ్డి
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయితే ఈసారి ఆయన ఫిరాయించిన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ ఓటర్లు హర్షవర్ధన్‌రెడ్డి తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment