సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రభావం స్థిరాస్తి రంగం మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. గత నెలలో హైదరాబాద్‌లో రూ.3,741 కోట్ల విలువ చేసే 6,268 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 8 శాతం, గతేడాది నవంబర్‌తో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ప్రాపర్టీ విలువలలో అక్టోబర్‌తో పోలిస్తే 18 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది.
► ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్యకాలంలో నగరంలో 64,658 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.34,205 కోట్లు. గతేడాది ఇదే కాలంలో రూ.30,429 కోట్ల విలువ చేసే 62,208 యూనిట్ల రిజిస్ట్రేషన్లయ్యాయి. అంటే ఏడాది కాలంలో 12 శాతం వృద్ధి నమోదైందన్నమాట. 2021 జనవరి–నవంబర్‌లో చూస్తే రూ.33,531 కోట్ల విలువ చేసే 75,451 ప్రాపరీ్టల రిజి్రస్టేషన్స్ జరిగాయి.
► గత నెలలో జరిగిన ప్రాపర్టీ రిజి్రస్టేషన్లలో అత్యధిక వాటా మధ్యతరగతి గృహాలదే. రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల వాటా 61 శాతంగా ఉండగా.. రూ.50–75 లక్షలు ధర ఉన్నవి 17 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 9 శాతం, రూ.కోటి పైన ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 13 శాతంగా ఉంది.
రంగారెడ్డి, మేడ్చల్‌లోనే..
రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోనే రిజిస్ట్రేషన్ల హవా కొనసాగుతుంది. గత నెలలోని రిజిస్ట్రేషన్లలో ఒక్కో జిల్లా వాటా 43 శాతం కాగా.. హైదరాబాద్‌లో 14 శాతంగా ఉంది. గత నెల రిజి్రస్టేషన్లలో 1,000–2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 71 శాతంగా ఉండగా.. 1,000 చ.అ. లోపు ఉన్న గృహాలు 15 శాతం, 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ప్రాపరీ్టల వాటా 14 శాతంగా ఉన్నాయి.
► గత నెలలోని టాప్–5 రిజి్రస్టేషన్లలో బేగంపేటలో రూ.10.61 కోట్ల మార్కెట్ విలువ చేసే ఓ ప్రాపర్టీ తొలి స్థానంలో నిలిచింది. బంజారాహిల్స్‌లో రూ.7.78 కోట్లు, రూ.7.47 కోట్ల విలువ చేసే రెండు గృహాలు, ఇదే ప్రాంతంలో రూ.5.60 కోట్లు, రూ.5.37 కోట్ల విలువ చేసే మరో రెండు ఇళ్లు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ ఐదు ప్రాపరీ్టల విస్తీర్ణం 3 వేల చ.అ.లుగా ఉన్నాయి.
6,268 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు
Published Sat, Dec 16 2023 6:13 AM | Last Updated on Sat, Dec 16 2023 6:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment