బాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..! | tdp leaders fighting in vizag over petrol university foundation | Sakshi
Sakshi News home page

బాబు సమక్షంలో తమ్ముళ్ల వాగ్వాదం..

Published Thu, Oct 20 2016 3:58 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

బాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..! - Sakshi

బాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..!

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు బాహాబాహీకీ దిగారు. ఈ ఘర్షణకు  విశాఖ జిల్లా సబ్బవరం వేదికైంది.
 
విశాఖ జిల్లాలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన భాగంలో సబ్బవరంలో పెట్రోల్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో గండి బాబ్జి, బండారు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గండి బాబ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బాబ్జి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement