సీఎం జగన్, మంత్రి రోజాలను దూషించిన కేసులో బండారుకు బెయిల్‌ | Bail to Bandaru Satyanarayana murthy | Sakshi
Sakshi News home page

సీఎం జగన్, మంత్రి రోజాలను దూషించిన కేసులో బండారుకు బెయిల్‌

Published Wed, Oct 4 2023 3:45 AM | Last Updated on Wed, Oct 4 2023 3:45 AM

Bail to Bandaru Satyanarayana murthy - Sakshi

గుంటూరు లీగల్‌/గుంటూరు ఈస్ట్‌/సాక్షి, అమరా­వతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పైన, మంత్రి రోజా పైన అనుచిత వ్యాఖ్యలు చేసి,  దూషించిన కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మంగళవారం గుంటూరు మొబైల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో విశాఖపట్నం సమీపంలోని వెన్నలపాలెంలో సోమవారం రాత్రి అరెస్టు చేసిన బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు మంగళవారం ఉదయం గుంటూరు నగరంపాలెం స్టేషన్‌కు తీసు­కొ­చ్చారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలు ఇద్దరిని పోలీ­సులు అదుపు­లోకి తీసుకున్నారు.

సత్య­నారా­య­ణ­మూర్తిని కలి­సేం­దుకు విశాఖపట్నానికి చెందిన న్యాయ­వాదులు పి.ఎస్‌.నాయుడు, బి.వి.­రమణ, గుంటూరు న్యాయవాది ముప్పాళ్ల రవిశంకర్, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, సత్య­నారాయణ­మూర్తి కుమారుడు అప్పల­నాయుడు స్టేషన్‌ వద్దకు చేరు­కున్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ పోలీసులు వైఎస్సా­ర్‌­సీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నా­రని విమర్శించారు. ఒక ఎస్‌ఐ తన తండ్రిపై ఫిర్యాదు చేయడం ఏమి­టని ప్రశ్నించారు. సత్యనారాయణమూర్తిని పోలీ­సులు బందోబస్తు మధ్య మధ్యాహ్నం జీజీహెచ్‌కు తరలించారు. ఆయ­నకు వైద్యులు వైద్యపరీక్షలు నిర్వ­హించారు.

తనకు అనారోగ్యంగా ఉన్నందున ఆస్ప­త్రిలోనే ఉంచాలని సత్యనారాయణమూర్తి కోరా­­రు. వైద్య­పరీ­క్షల అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జీజీ­హెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏకుల కిరణ్‌కు­మార్‌ నిర్ధారించారు. తరు­వాత సత్యనారా­య­ణ­మూ­ర్తిని పోలీసులు కోర్టుకు తరలించారు. ప్రాసిక్యూ­షన్‌ తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. సెక్షన్లు బెయిల్‌ ఇవ్వదగినవి అయినప్పటికీ నేర తీవ్రతను, వ్యక్తి చరిత్రను పరిగణలోకి తీసు­కోవాల్సిన అవస­రం ఉందని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయాధి­కారి జి.స్రవంతి.. బండారు సత్య­నారా­య­ణ­మూర్తిని రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 

చట్టప్రకారమే వ్యవహరించాం.. 
సీఎం జగన్, మంత్రి రోజాలపై అసభ్య, అభ్యంతర­కర వ్యాఖ్యలు చేసిన కేసుల్లో టీడీపీ సీనియర్‌ నేత బం­డారు సత్య­నారా­య­ణమూర్తిని అరెస్ట్‌ చేసే విష­యంలో చట్టప్ర­కారమే వ్యవహరించామని పోలీ­సులు హైకోర్టుకు నివేదించారు. తన సోదరుడు సత్య­నారా­యణ­మూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ బండారు సింహాద్రిరావు హై­కోర్టులో సోమ­వా­రం హౌస్‌మోషన్‌ రూపంలో హెబి­యస్‌ కార్పస్‌ పిటి­షన్‌ దాఖలు చేసిన విషయం తెలి­సిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్‌ చీకటి మాన­వేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్‌­రావు ధర్మా­సనం విచారణ జరిపింది.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయ­వాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వాదనలు విని­పిస్తూ.. సత్యనారాయ­ణమూర్తిపై గుంటూరు అర­ండ­ల్‌పేట, నగరంపాలెం స్టేషన్లలో కేసులు నమో­దై­నట్లు చెప్పారు. నరగంపాలెం స్టేషన్‌­లో నమోదైన కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద సత్య­నారా­య­ణమూర్తికి నోటీసులు ఇవ్వలేద­న్నారు. అరండల్‌­పేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నోటీసు జారీ­చేస్తే.. దాన్ని తీసుకోవడానికి సత్య­నారాయణ­మూర్తి నిరాకరించారని, దీంతో చట్ట నిబంధనల మేరకు ఆయన్ని అరెస్ట్‌ చేశామని వివ­రించారు.

ఒక­వైపు నోటీసు తీసుకోవడానికి నిరా­­కరించి, మరో­వైపు హైకోర్టులో నోటీసు తీసుకు­న్నట్లు చెబుతు­న్నా­రని, ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనని తెలి­పారు. 41ఏ నోటీసును తీసుకున్నట్లు పెట్టిన సంతకం సత్యనారాయణ­మూర్తిది కాదన్నారు. అరెస్ట్‌ తరు­వాత సత్య­నారా­యణ­మూర్తిని గుంటూరు కోర్టులో హాజరు­పరి­చి­నట్లు చెప్పారు. పిటిషనర్‌ న్యాయ­వాది వి.వి.సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. 41ఏ నోటీసు ఇచ్చి దానిపై పోలీసులు సంతకం కూడా తీసుకున్నారని తెలి­పారు.

41ఏ నోటీసు ఇచ్చి విచారణకు రావాలని చెప్పి, ఆ వెంటనే అరెస్ట్‌ చేశారన్నారు. ఈ వాద­నలను పరి­గణనలోకి తీసు­కున్న ధర్మాసనం.. సత్యనారాయ­ణ­మూర్తి అరెస్ట్‌ విష­యంలో చట్టనిబంధనలను పాటి­ం­చలేదని తేలి­తే దర్యాప్తు అధికారిపై చర్యలుంటా­యని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణ ఈ నెల 5కి వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement