ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రి పదవుల కేటాయింపుపై టీడీపీలో రగడ మొదలయింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గ కూర్పుపై విశాఖ జిల్లా టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.