
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి బండారు గుడ్‌బై
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రి పదవుల కేటాయింపుపై టీడీపీలో రగడ మొదలయింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గ కూర్పుపై విశాఖ జిల్లా టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బండారు స్వగ్రామం వెన్నెలపాలెంలో ఆయన అనుచరులు సమావేశమయ్యారు. బండారుకు మంత్రి పదవికి ఇవ్వనందుకు నిరసనగా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రాజీనామాకు సిద్దపడ్డారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్న బండారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పారు.