సాక్షి, విశాఖపట్నం: మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను సినీ నటుడు సుమన్ తప్పుబట్టారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు.
‘‘రోజాను వ్యక్తిగతంగా ఎదుర్కోనలేకే ఆరోపణలు చేస్తున్నారు. ధైర్యం ఉంటే మంత్రి రోజాను రాజకీయంగా ఎదుర్కోవాలి. ఎన్నో కష్టాలు పడి మంత్రి రోజా ఈ స్థాయికి వచ్చింది బండారు ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. వారి గురించి కూడా ఇదే విధంగా మాట్లాడితే బండారు ఊరుకుంటారా’’ అంటూ మండిపడ్డారు.
చదవండి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు, మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా సైతం బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment