అజ్ఞాతంలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే? | bandaru satyanarayana murthy disappointed over cabinet reshuffle | Sakshi
Sakshi News home page

అజ్ఞాతంలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే?

Published Sun, Apr 2 2017 3:24 PM | Last Updated on Sat, Jun 2 2018 7:14 PM

అజ్ఞాతంలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే? - Sakshi

అజ్ఞాతంలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే?

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో అధికార టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. సీనియర్లను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెట్టడంతో టీడీపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని కేబినెట్ లోకి తీసుకోవడంతో అలకబూనారు.

మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. తమ నాయకుడికి మంత్రి పదవి రాలేదన్న విషయం తెలుసుకున్న మద్దతుదారులు సత్యనారాయణమూర్తి స్వగ్రామం వెన్నెలపాలెంకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement