సాక్షి, విశాఖపట్న/గుంటూరు: ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో.. గుంటూరు జైలుకు తరలించే టైంలో.. ఆఖరికి ఇవాళ పీఎస్ బయట టీడీపీ శ్రేణులు చేసిన ఓవరాక్షన్ మామూలుగా లేదు. అంతేకాదు పోలీసులు ఆయన్ని ఏదో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నట్లు పచ్చ మీడియా వరుస కథనాలతో నానా రభస చేస్తోంది.
సోమవారం రాత్రి వెన్నెలపాలెంలో ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో.. అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు శతవిధాల యత్నించాయి. ఆపై ఆయన్ని గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఆపై ఈ(మంగళవారం) ఉదయం నుంచే ఆయన్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.
మంత్రి రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరులో బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు. విచారణ కోసం స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు మంత్రి రోజాను ఉద్దేశించి జుగుప్సాకరంగా మాట్లాడిన బండారును అరెస్టు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం డీజీపీని కోరారు.
ఇదీ చదవండి: బండారు వ్యాఖ్యలపై రోజా రియాక్షన్ ఇది
ఇక ఆయన్ని నగరంపాలెం పీఎస్ తరలించారనే సమాచారంతో పీఎస్ వద్దకు చేరుకుని ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నా.. పట్టించుకోకుండా అతి చేష్టలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
మరోవైపు బందోబస్తులో ఉన్న పోలీసులపై టీడీపీ నేతలు చిందులు తొక్కుతున్నారు. ‘‘మా గవర్నమెంట్ వచ్చాక ఏం చేస్తామో చూడు.. నీ అంతు చూస్తా’’ అంటూ వెస్ట్ డీఎస్పీ ఉమా మహేశ్వర రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు బెదిరించిన దృశ్యాలు కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment