సాక్షి, విశాఖపట్నం/గుంటూరు: ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం హల్ చల్ చేశారు. అరుపులతో హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.
యూనివర్శిటీలలో వీసీల బలవంతపు రాజీనామాలపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరమన్నారు. తాను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని, అధ్యాపకుడిగా పనిచేశానని తెలిపారు.
‘‘ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, యూనివర్శిటీలు అంటే ఒక మేధాశక్తిని తయారుచేసే కర్మాగారాలు, సీఎంలు మారుతుంటారు, కానీ యూనివర్శిటీలో వీసీని అపాయింట్‌చేస్తే అతని కాలపరిమితి పూర్తయ్యే వరకూ ఎవరూ కదిలించరు. యూజీసీ నిబంధనల మేరకు పనిచేస్తారు, కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్ధితులు చాలా బాధాకారం.
...గతంలో టీడీపీ అపాయింట్ చేసిన వీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది. విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు. ఎవరిపైన అయినా ఆరోపణలు, అభియోగాలు వస్తే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన కమిటీ వేసి తప్పులు జరిగి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవాలి, అంతేకానీ ఇలా భయపెట్టి రిజైన్ చేయడం సమంజసం కాదు.
...గవర్నర్ వీసీని అపాయింట్ చేస్తారు. ఇంత దారుణంగా టీడీపీ వ్యవహరించడం సరికాదు. అధికారం ఉంది కదా అని ఇలా వ్యవహరించడం తప్పు. ఇలా ఎప్పుడైనా జరిగిందా?
...ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ అపాయింట్ చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా పనిచేయించుకుని సాగనంపింది, అక్కడే కాదు మిగిలిన యూనివర్శిటీలు, ఉన్నత విద్యామండలిలో కూడా ఇలాగే జరిగింది. విద్యా వ్యవస్ధను నాశనం చేయద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నా, ఇకనైనా ఒక పద్దతి ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన తప్పులు ఇకనైనా సరిదిద్దుకోవాలి.
...వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూడా బురదచల్లుతున్నారు. మేం ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడపాలని మేం కోరుకుంటున్నాం. మేం ఎక్కడా క్యాడర్‌ను ఉసిగొల్పలేదు’’ అని మేరుగు నాగార్జున పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment