మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ | Vasireddy Padma Complaint To DGP On TDP Leader Bandaru Satyanarayana Over His Remarks - Sakshi
Sakshi News home page

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ

Published Sat, Sep 30 2023 2:59 PM | Last Updated on Sat, Sep 30 2023 4:06 PM

Vasireddy Padma Complaint To Dgp On Tdp Leader Bandaru Satyanarayana - Sakshi

సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై జుగుప్సాకరంగా మాట్లాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.. డీజీపీని కోరారు. మంత్రి రోజాపై సభ్య సమాజం తలదించుకునే  వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

శనివారం ఆమె  డీజీపీకి లేఖ రాస్తూ బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్‌లు పెట్టి బండ బూతులు మాట్లాడుతున్నారని వీటిని ఎంత మాత్రం సహించరాదని కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

మంత్రి రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై  పలువురు మహిళా నేతలు న్యాయవాదులు మహిళా కమిషన్‌కు  ఫిర్యాదు చేశారని పద్మ తెలిపారు. బండారు వంటి మహిళా వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలని అతని వ్యాఖ్యలపై అందరూ సీరియస్‌గా స్పందించాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

మంత్రులుగా ఉన్న మహిళల పట్ల కూడా క్రూరంగా వ్యవహరిస్తున్న బండారు సత్యనారాయణ వంటి మాజీ మంత్రుల బండారాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకు వెళ్తూ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. మహిళా కమిషన్ సభ్యులు కె.జయశ్రీ, గజ్జల లక్ష్మి, గెడ్డం ఉమ, బూసి వినీత, రోఖయా బేగం మంత్రి రోజాకు సంఘీభావంగా మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement