టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Published Sun, Oct 9 2016 6:49 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎన్నడూలేనంత అవినీతి, అక్రమాలు: ఎంపీ రాయపాటి
వినుకొండ టౌన్ : తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై అక్షింతలు వేస్తున్నారంటూ నవ్వుతూనే.. మరోసారి పార్టీ నాయకుల అవినీతి, ఆగడాలపై వ్యాఖ్యలు చేశారు.
ఎన్నడూ లేనంత అక్రమాలు, అవినీతి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చిట్టా చంద్రబాబు వద్ద ఉందని, జిల్లాలో దాదాపు అందరూ మైనస్ గ్రేడ్‌లలోనే ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరి అవినీతి చిట్టా చంద్రబాబు తెప్పించుకున్నారన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ కావటం కష్టమని, అన్ని వసతులున్న గుంటూరుకు జోన్‌గా మార్పు చేయటం సులభమని పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన ‘గమ్మునుండు..’ అంటున్నాడన్నారు. విశాఖకు ఏ విధంగా రైల్వే జోన్ వస్తుందని, వారి పోరాటం వృథా అవుతుందని చాలా సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు.
Advertisement
Advertisement