టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ | No conflicts between TDP and BJP, says Rayapati Sambasiva rao | Sakshi
Sakshi News home page

టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ

Published Sun, Jan 10 2016 12:22 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ - Sakshi

టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ

గుంటూరు : భవిష్యత్లో సీపీఐ నేతలతో కలసి పనిచేయాలనుకుంటున్నట్లు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఆదివారం గుంటూరులో సీపీఐ నేతలకు ఎంపీ రాయపాటి అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడారు. టీడీపీ - బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

కేంద్రం ప్యాకేజీలు ప్రకటిస్తుందని కానీ... నిధులు మాత్రం విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనకబడిన ప్రాంతాలకు సాయం అందించాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా రాయపాటి డిమాండ్ చేశారు. రైల్వే జోన్ విజయవాడలో ఏర్పాటు చేయాలనేదే తమ డిమాండ్ అని రాయపాటి సాంబశివరావు గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధిని కోరుతున్నట్లు రాయపాటి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement