త్వరలోనే విశాఖ రైల్వే జోన్ | coming soon visakha railway zone | Sakshi
Sakshi News home page

త్వరలోనే విశాఖ రైల్వే జోన్

Published Sat, Jul 25 2015 10:14 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

coming soon visakha railway zone

విజయవాడ: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వేశాఖ లాంఛనాలన్నీ పూర్తి చేస్తోందని, త్వరలోనే ప్రకటన విడుదలవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జోన్ వచ్చిన తరువాత కొత్త రైళ్లు సాధించేందుకు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం నుంచి ప్రారంభించడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం, తిరుపతిల నుంచి బోగీలను తెచ్చి విజయవాడలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు కలిపి ఇక్కడ నుంచి నడపాలనే ప్రతిపాదన సరికాదని, బోగీలు రావడం ఆలస్యమైతే రైలు బయలుదేరడం ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement