
బెంగాల్ కు భంగపాటు: మమత
కోల్కతా: రైల్వే బడ్జెట్ లో తమ రాష్ట్రానికి మొండిచేయి చూపారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం చేతిలో బెంగాల్ కు భంగపాటు ఎదురైందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇటువంటి అవమానం బెంగాల్ ప్రజలకు ఇంతకుముందెఎన్నడూ జరగలేదని ఈ మాజీ రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉండగా సొంత రాష్ట్రానికి ఎక్కువ రైళ్లు వేసుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.