తెలుగు రాష్ట్రాలకు 5 కొత్త రైళ్లు | 7 New trains for 2 Telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు 5 కొత్త రైళ్లు

Published Tue, Jul 8 2014 5:53 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

తెలుగు రాష్ట్రాలకు 5 కొత్త రైళ్లు

తెలుగు రాష్ట్రాలకు 5 కొత్త రైళ్లు

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు  2014-15 రైల్వే బడ్జెట్లో 5 కొత్త రైళ్లను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. రెండు రైళ్ల వేగం పెంచినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో  29 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 20 వేల 680 కోట్ల రూపాయల కేటాయించారు. పోర్టుల కనెక్టివిటీకి  4వేల కోట్ల రూపాయలు కేటాయించగా,  ఆంధ్రప్రదేశ్ రేవులకు మాత్రం మొండిచేయి చూపారు.  5 జన సాధారణ్ రైళ్లు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కటీ  దక్కలేదు.

రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కొత్త రైళ్లు:

1.విజయవాడ - న్యూఢిల్లీ డైలీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్
2.సికింద్రాబాద్ - నిజాముద్దీన్ మధ్య ప్రీమియం ఏసీ రైలు
3.ముంబై - కాజీపేట వీక్లీ ఎక్స్‌ప్రెస్ వయా బల్లార్షా
4.విశాఖ - చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్  
5.పారాదీప్- విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్

వేగం పెంచిన రైళ్లు

1.నాగపూర్-సికింద్రాబాద్ సెమీ బుల్లెట్ రైలు
2.చెన్నై - హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement