'కమిటీ వేశారు... వివరాలు చెప్పలేదు' | Mekapati Rajamohan Reddy says railway budget is hopeless | Sakshi
Sakshi News home page

'కమిటీ వేశారు... వివరాలు చెప్పలేదు'

Published Tue, Jul 8 2014 3:24 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

'కమిటీ వేశారు... వివరాలు చెప్పలేదు'

'కమిటీ వేశారు... వివరాలు చెప్పలేదు'

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న వాగ్దానాలేవి రైల్వే బడ్జెట్‌లో లేకపోవడం దురదృష్టకరమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్టణంకు మెట్రో రైలు ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీ వేశారని, ఆ కమిటీ వివరాలు తెలపలేదని అన్నారు.

ఏపీలో ఆదాయం ఎక్కువగా ఉన్నా ప్రాజెక్టుల విషయంలో శీతకన్ను వేశారని విమర్శించారు. రైల్వే బడ్జెట్ తమను నిరాశ పరిచిందని తెలిపారు. ఎవరు అధికారంలో ఉంటే వారిదే బడ్జెట్ అన్నట్టు ఉందని మేకపాటి వ్యాఖ్యానించారు.

రైల్వే మంత్రి ఒక రాష్ట్రానికే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారని ఖమ్మం ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement