రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్సభలో రైల్వే బడ్జెట్ 2014-15 ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'అన్ని వర్గాలు, ప్రాంతాలకు రైల్వేలు సేవలు అందిస్తున్నాయి. కోల్కతాలో వీధుల మీద నడిచేవారి నుంచి నెల రోజులే అయ్యింది. నాకు అనేక సూచనలు వచ్చాయి. ఎంపీలు, ప్రభుత్వంలో సహచరులు, రాష్ట్రాలు, అన్ని వర్గాలప్రజలు ఈ విషయంలో సలహాలు ఇచ్చారు. రైల్వేలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ తమదైన పరిష్కారాలు సూచించారు. వారి ఆశలు నెరవేర్చేందుకు నా బాధ్యతలను నెరవేర్చే ప్రయత్నిస్తాను. ఆర్య చాణక్యుడిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ... ''ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితమ్ నాత్మప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు ప్రియంహితమ్.. అంటే, ప్రజల సుఖమే తన సుఖము, ప్రజాహితమే తన హితము. తనకు, ప్రజకు వేరు హితము లేదు'' అని చెప్పారు. 23 మిలియన్ల ప్రయాణికులను మన రైల్వే గమ్యాలకు చేరుస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 7,400 గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. కేవలం 30 శాతం సరుకులనే రైల్వేలు రవాణా చేస్తున్నాయి. రక్షణకు సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా రవాణా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ చాలామంది రైళ్లలో అడుగుపెట్టలేకపోతున్నారని, చాలా ప్రాంతాలు రైళ్ల కనెక్టివిటీ కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు.