
విశ్వాసం కల్పించే బడ్జెట్: మోడీ
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి పట్ల విశ్వాసం కల్పించేవిధంగా రైల్వే బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. పారదర్శకత, సంస్థాగత సామర్థ్యం పెంచేవిధంగా రైల్వే బడ్జెట్ రూపొందించారని అన్నారు. తక్కువ సమయంలో దిశానిర్దేశం చేసే బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారని తెలిపారు.
టెక్నాలజీని సామర్థవంతంగా వినియోగించుకునేలా రైల్వే బడ్జెట్ ఉండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో రైల్వే శాఖ కీలక భూమిక పోషిస్తోందని చెప్పారు. రైల్వే వ్యవస్థపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.