ఫేస్బుక్, ట్విట్టర్లో చేరిన రైల్వేశాఖ | Ahead of Budget, Indian Railways joins Facebook, Twitter | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్, ట్విట్టర్లో చేరిన రైల్వేశాఖ

Published Tue, Jul 8 2014 11:37 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్బుక్, ట్విట్టర్లో చేరిన రైల్వేశాఖ - Sakshi

ఫేస్బుక్, ట్విట్టర్లో చేరిన రైల్వేశాఖ

ప్రధాని నరేంద్రమోడీ బాటలో.. మరికొన్ని గంటల్లో రైల్వేబడ్జెట్ ప్రవేశపెడతామనగా.. రైల్వేశాఖ కూడా ఆన్లైన్లోకి వచ్చేసింది. ఫేస్బుక్, ట్విట్టర్లలో అధికారికంగా అకౌంట్లు తెరిచింది. దేశవాసులకు తమశాఖకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోడానికి ఈ ఏర్పాటుచేసుకుంది. వాస్తవానికి గత కొన్నాళ్లుగా అన్ని శాఖలూ చురుగ్గా ఫేస్బుక్, ట్విట్టర్లలోకి వస్తుండగా, రైల్వేశాఖ మాత్రం వెనకబడింది. రైలు ప్రయాణికుల్లో అత్యధికులకు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. జూన్ నెలలో టికెట్ల ధరలు పెంచినప్పుడు ప్రయాణికులు ఫేస్బుక్, ట్విట్టర్లలో కామెంట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఇక రైల్వే శాఖకు ప్రత్యేకంగా ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలు ఉండాలని రైల్వే మంత్రి సదానంద గౌడ భావించారు. అనుకున్నదే తడవుగా సోమవారం రాత్రే ఈ పేజీలను ప్రారంభించారు. దీనివల్ల తమ శాఖ ప్రజల వద్దకు వెళ్లడం మరింత సులువు అవుతుందని ఆయన అన్నారు. ఈ రెండు సోషల్ మీడియాలతో పాటు యూట్యూబ్లోకి కూడా రైల్వే శాఖ ప్రవేశించింది. మంగళవారం నుంచి అన్ని సోషల్ మీడియాలలోను రైల్వేలకు సంబంధించిన సమాచారాన్ని చూడొచ్చని గౌడ తెలిపారు. రైల్వే బడ్జెట్ వినాలనుకునేవారు 022-4501555 నెంబరుకు ఫోన్ చేయొచ్చని, దాంతోపాటు ఇప్పటివరకు ఉన్న రైల్వే విచారణ నెంబరు 139ను కూడా ఉచితం చేశామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement