ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు.ఫేస్‌బుక్ పేరు మార్చి ‘మెటా’ అంటూ ప‍్రచారం చేస‍్తున్నా ఆయన తప్పిదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా జుకర్ బెర్గ్ వేలకోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ అందుబాటులోకి తెచ్చిన ప్రైవసీ పాలసీ వల్ల ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలు 10 బిలియన్ల డాలర‍్లకు పైగా నష‍్టపోయాయి. ఆ జాబితాలో ఫేస్‌బుక్ కూడా చేరింది.
ది వెర్జ్ కథనం ప్రకారం..యాపిల్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో యాప్ ట్రాకింగ్ ట్రాన్స్‌పరెన్సీ(ఏటీటీ) పేరుతో కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ వల్ల థర్డ్ యాప్స్ యాపిల్ ప్రొడక్ట్‌లను వినియోగించే యూజర్ల డేటాను ట్రాక్ చేయలేవు. అలా చేయాలంటే యూజర్ల పర్మీషన్ తీసుకోవాలని యాపిల్ సంస్థ కండీషన్ పెట్టింది. ఆ నిబంధనల్ని అమలు చేస్తోంది. అంతే యాపిల్ నిబంధనలపై ఫేస్‌బుక్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
I’m pretty certain #Facebook is fighting #Apple to retain access to personal data. #PID #privacy. #fullpagead #wsj pic.twitter.com/029WwaGSs0
— Dave Stangis (@DaveStangis) December 16, 2020
డేటా యాపిల్‌ది.. సొమ్ము చేసుకునేది ఫేస్‌బుక్
ఫేస్‌బుక్ పిక్సెల్ టూల్ సాయంతో యాపిల్ ఫ్లాట్ ఫామ్‌లలో యూజర్ల డేటాను సేకరించి..ఆ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ఫేస్‌బుక్ ఆయా సంస్థలకు చెందిన ప్రకటనలు ఇచ్చేది. ఆ ప్రకటనలే ఫేస్‌బుక్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి. కానీ తాజాగా యాపిల్ అప్‌డేట్ చేసిన ఐఎస్‌ఎస్14 లలో ఫేస్‌బుక్ యూజర్ల డేటాను ట్రాక్ చేసుకోలేకపోతుంది. దీంతో యాడ్స్‌పై ఆదాయం లేక జుకర్ బెర్గ్ భారీ నష్టాల్ని చవిచూస్తున్నట్లు కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. యాడ్స్ లేని కారణంగా లూట్మే, ఫేస్‌బుక్, స్నాప్ చాట్, య్యూట్యూబ్, ట్విట‍్టర్‌ల ఆదాయం తగ్గినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. సోషల్ మీడియా యాప్‌లు 12 శాతం ఆదాయాన్ని కోల్పోయినట్లు కథనంలో పేర్కొంది.
నేను అప్పుడే చెప్పా
గతేడాది కొత్త ప్రైవసీ పాలసీని అందుబాటులోకి తెస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఆ ప్రకటనపై జుకర్ బెర్గ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆ పాలసీపై మరోసారి స్పందించారు. కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బెర్గ్ మాట్లాడుతూ..యాపిల్ తెచ్చిన పాలసీ వల్ల ఫేస్‌బుక్‌తో పాటు చిరు వ్యాపారులు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. యాపిల్ పాలసీతో యాడ్స్‌పై వచ్చే ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని గుర్తించినట్లు చెప్పారు. యాపిల్ ఐఓఎస్ పాలసీ ఫీచర్లు క్లిష్ట సమయాల్లో ప్రకటన ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడే చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. ఫేస్‌బుక్ సీఎఫ్‌ఓ డేవిడ్ వెహ్నర్ మాట్లాడుతూ..యాపిల్ ఏటీటీ అంశం సవాళ్లతో కూడుకుందని, అది వారి అంచనాలకు కాస్త విఘాతం కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి: 'ఐ కాంట్ బ్రీత్':ఫేస్‌బుక్ కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో?
Comments
Please login to add a commentAdd a comment