
2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి సదానంద గౌడ మంగళవారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు:
* సేప్టీ, సెక్యూరిటీ, స్పీడ్ కు ప్రాధాన్యత
* కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం
* దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు అత్యంత కీలకం
* భారతీయ రైల్వే ముందు ఎన్నో సవాళ్లు
* రోజుకు 2కోట్ల 30లక్షలమందిని గమ్యానికి చేరుస్తోంది
* భద్రత, సౌకర్యాలపై రాజీ పడేది లేదు
* హైస్పీడ్ నెట్వర్క్ను నెలకొల్పుతాం
* గత సంవత్సరం 99 కొత్త లైన్లకు అనుమతిస్తే ఒక్కటే పూర్తి
* 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
* ప్రతిపాదిత ప్రాజెక్టుల పూర్తికి 5 లక్షల కోట్లు అవసరం
* రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరం
* కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి చాలా విజ్ఞాపనలు వచ్చాయి
* ఆదాయంలో ప్రతి రూపాయికి 94 పైసలు ఖర్చు పెడుతున్నాం
* 12,500 రైళ్లలో సురక్షిత ప్రయాణం అందిస్తున్నాం
* ఏడాదిలోగా రైల్వే వ్యవస్థను గాడిలో పెడతాం
* సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామి కావటమే లక్ష్యం
* రైల్వే సామాజిక బాధ్యత మరవలేదు
* 30ఏళ్ల నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి
* భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మలాంటిది
* ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి
* రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
* ప్రాజెక్టుల ఆమోదం పైనే తప్ప పూర్తిపైన దృష్టి కొరవడింది
* సరుకు రవాణాలో కొంత తగ్గుదల
*58 కొత్త రైళ్లు, 11 రైళ్ల పొడిగింపు
*5 జన సాధారణ్ రైళ్లు, మరో ఐదు ప్రీమియం రైళ్లు
*ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు
*8 ప్యాసింజర్ రైళ్లు, రెండు డెము సర్వీసులు
*ఏపీ, తెలంగాణకు దక్కని జనసాధారణ్
*సికింద్రాబాద్ - నిజాముద్దిన్ మధ్య ప్రీమియం ఏసీ రైలు
*విజయవాడ - న్యూఢిల్లీ డైలీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్
*ముంబై - కాజీ పేట వీక్లీ ఎక్స్‌ప్రెస్ వయా బల్లార్షా
*పారాదీప్ - విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్
*విశాఖ - చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్
*తొమ్మిది రూట్లలో రైళ్ల స్పీడు పెంపు
*ముంబై - అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ ట్రైన్
*ఇక ఆన్‌లైన్‌లో కూడా ఫ్లాట్‌ఫాం టికెట్
*రైళ్లలో అందుబాటులో రెడీ టూ ఈట్ ఫుడ్
*ఏపీ, తెలంగాణకు కమిటీతో సరిపెట్టిన సదానంద గౌడ
*రెండు రాష్ట్రాల్లో 29 పెండింగ్ ప్రాజెక్టులు, విలువ రూ.20608 కోట్లు
*లక్షా 20వేల మంది లాగిన్ సామర్థ్యం తట్టుకునే విధంగా ఐఆర్సీటీసీ
*ఐఆర్సీటీసీ వెబ్సెట్లో నిమిషానికి 7200 టికెట్లు జారీ చేసే సామర్థ్యం
*అన్ని మేజర్ స్టేషన్లలో వైఫై సౌకర్యం ఏర్పాటు
*గమ్యం చేరుకోబోయే ముందు ప్రయాణీకులకు అలర్ట్ వేకప్ కాల్స్
*రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు, ఇంజినీరింగ్ స్టూడెంట్లకు ఇంటర్న్‌షిప్
*మహిళా కోచ్‌ల్లో భద్రతా ఏర్పాట్లు, కొత్తగా 4వేల మహిళా కానిస్టేబుళ్లు
*రైల్వే భద్రతకు దేశవ్యాప్తంగా 17000మంది ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు
*రోడ్ అండర్, రోడ్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుకు రూ.1785 కోట్లు
*కాపలా లేని 11563 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రక్షణ ఏర్పాట్లు
*హైస్పీడ్ రైల్ కారిడార్‌కు రూ.వంద కోట్లు
*ఈశాన్య రైల్వే కారిడార్ అభివృద్ధికి రూ.5116కోట్లు
*పోర్టుల కనెక్టివిటీకి రూ. 4వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రేవులకు మొండిచేయి
*30ఏళ్లుగా 676 ప్రాజెక్టుల ప్రతిపాదన, పెండింగ్‌లోనే 359 ప్రాజెక్టులు
*మొబైల్ ఫోన్ ద్వారా టికెట్ బుకింగ్ ఏర్పాటు
*మేజర్ స్టేషన్లలో మరిన్ని కాయిన్ ఆపరేట్ టికెట్ మెషీన్లు
*ఇక పార్కింగ్‌కు ప్లాట్‌ఫాంకు కాంబో టికెట్లు
*ఆన్‌లైన్‌లోనే కోరుకున్న సీటు, కోచ్, బెర్తు రిజర్వు చేసుకునే అవకాశం
*దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక కనెక్టివిటీ రైళ్లు
*దేవీ, జ్యోతిర్లింగ, జైన్, క్రిస్టియన్, ముస్లిం, సిక్ సర్క్యూట్‌ల ఏర్పాటు
*కర్ణాటక, మహారాష్ట్రల్లోని పర్యాటక ప్రాంతాలను కవర్ చేసే ప్రత్యేక రైలు
*బెంగళూరు, చెన్నై, అయోధ్య, వారణాసి, హరిద్వార్‌లలో పర్యాటక రైలు
*స్వామి వివేకానంద బోధనలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక రైలు
*అన్ని స్టేషన్లలో భోజన సౌకర్యం, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రయాణీకుల ఫీడ్‌బ్యాక్
*ఎలాంటి భోజనం కావాలో ఎస్ఎంఎస్ ద్వారా కోరుకునే సౌకర్యం
*50 మేజర్ స్టేషన్లలో కాంట్రాక్టు పారిశుద్ధ్య నిర్వహణ
*సిసి టీవీల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలన
*ఏ ప్లాట్‌ఫాంకైనా వెళ్లేలా వృద్ధులకు బ్యాటరీ ఆపరేటేడ్ కార్ల సౌకర్యం
*వచ్చే ఐదేళ్లలో అన్ని రైల్వే కార్యాలయాల్లో పేపర్ లెస్ నిర్వహణ
*ఏ1, ఏ క్యాటగిరీ స్టేషన్లతో పాటు కొన్ని రైళ్లలో వైఫే సౌకర్యం
*రైల్వే వెబ్‌సైట్లలో ఏ రైలు ఎక్కడున్నది తెలుసుకునే వీలు
*ముందొచ్చే స్టేషన్ పేరును ప్రయాణీకులకు తెలిపే ఏర్పాటు
*రైల్వేల ఆస్తులు, భూములను జీఐఎస్ మ్యాపింగ్ గుర్తింపు
*రైల్వేల మౌలిక సదుపాయాలకు విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
*నిధుల పెంపునకు పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా ప్రయత్నాలు