
ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు
న్యూఢిల్లీ: ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలును ప్రవేశపెడతామని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఇపుడున్న రైళ్లకు కూడా హైస్పీడుకు పెంచుతామన్నారు. దీనివల్ల ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ముందుగా ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు వస్తుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్గాల్లో వీటిని ప్రవేశపెడతామని తెలిపారు.
ఇప్పటికే ఉన్న, కొత్తగా రాబోతున్న ఓడరేవులకు అనుసంధానంగా మరిన్ని రైలు మార్గాలను ఏర్పాటుచేస్తామన్నారు. ఇందుకోసం అవసరమైతే పీపీపీ పద్ధతిలో నిధులు సేకరిస్తామని చెప్పారు. బొగ్గు ఎక్కువగా లభించే ప్రాంతాలను కూడా రైల్వే పరిధిలోకి తెస్తామన్నారు. దీనివల్ల విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు త్వరగా అందుతుందని చెప్పారు.