హైదరాబాద్ : రైల్వే బడ్జెట్పై మళ్లీ నిరాశే. నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి రైల్వేబడ్జెట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అంతంత మాత్రం ప్రాధాన్యమే దక్కింది. మన ఎంపీలు ఎన్ని విజ్క్షప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా ఉంది రైళ్ల కేటాయింపు. రైల్వే మంత్రి సదానంద గౌడ...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రెండు హైస్పీడ్, ఒకటి ప్రీమియం, ఒకటి ఏసీ, రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లును కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 20 వేల 600 కోట్లకు పైగా పెండింగ్ ప్రాజెక్టులున్నాయని తెలిపిన మంత్రి వీటి అమలుకు మాత్రం కమిటీతో సరిపెట్టారు.
' ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా ఉంది'
Published Tue, Jul 8 2014 3:21 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement