
7 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచి ప్రారంభమై ఒక నెల పాటు జరిగే అవకాశముంది. ఇవి ఆగస్ట్ 6 వరకు కొనసాగొచ్చని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచి ప్రారంభమై ఒక నెల పాటు జరిగే అవకాశముంది. ఇవి ఆగస్ట్ 6 వరకు కొనసాగొచ్చని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బుధవారం జరిగే కేబినెట్ భేటీలో షెడ్యూలు ఖరారు అంశం పరిశీలనకు రావొచ్చన్నాయి. తొలి వారం సమావేశాల్లో ప్రీ-బడ్జెట్ ఎకనామిక్ సర్వే, రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌లను ప్రవేశపెట్టే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తెచ్చిన ఓట్సాన్ అకౌంట్ గడువు జూలై నెలాఖరుతో ముగియనుండడంతో ఆలోపు ఈ బడ్జెట్లను ఆమోదించాల్సి ఉంది.