కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని (సీపెట్) గురువారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రారంభించారు. గురువారం ఉదయం 11.00 గంటలకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడతో కలసి సీపెట్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.