్చపద్మజారెడ్డి, మహబూబ్‌నగర్ నాగూరావు నామాజీ, కొడంగల్ నర్సింహులు, దేవరకద్ర
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ... అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విష యం విదితమే. తాజాగా మరో మూడు స్థానాల నుంచి పోటీకి దిగనున్న అభ్య ర్థులను ఎంపిక చేసింది. రెండో జాబితాలో భాగంగా మహబూబ్‌నగర్ స్థానానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డిని ఎంపిక చేశారు. ఇక కొడంగల్ నియోజకవర్గానికి నాగూరావ్ నామాజీ, దేవరకద్ర నుంచి ఓబీసీ సెల్ కన్వీనర్ ఎగ్గ ని నర్సింహులును ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆమోదముద్ర వేశాక పేర్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలువెల్లడించాయి.
గెలిచి తీరాల్సిందే...
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం గా నిలబడేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న భావనతో రానున్న ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఉమ్మ డి జిల్లాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కల్వకుర్తి నుంచి తన్నోజు ఆచారి, అచ్చంపేట నుంచి మల్లేశ్వర్, గద్వాల నుంచి వెంకటాద్రిరెడ్డి, మక్తల్ నుంచి కొండయ్య, నారాయణపేట నుం చి రతంగ్‌పాండురెడ్డితో పాటు షాద్‌నగర్ నుంచి శ్రీవర్ధన్‌రెడ్డి పేర్లను కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు.
దీంతో వారంతా కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ముగ్గురుఅభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకు గాను తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇక మిగిలిపోయిన అయిదు నియోజకవర్గాల విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానం కోసం దిలీప్ ఆచారి, కొల్లాపూర్ స్థానం కోసం ధారాసింగ్, వనపర్తి నుంచి ప్రభాకర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా అలంపూర్ నుంచి రజనీరెడ్డి పోటీ కోసం ప్రయత్నిస్తున్నారు. మూడో జాబితాలో భాగంగా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment