సాక్షి, అనంతపురం : పంచాయతీ ఎన్నికల యాప్‌పై ఎస్‌ఈసీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని, వాస్తవాలు ఏంటో బయటపెట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ పంచాయతీ ఎన్నికల యాప్ గురించి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ గారు వివాదానికి తెరదించండి. ఈ యాప్ విషయంలో వివరాలను రహస్యగా ఉంచాల్సిన అవసరం ఏంటి? యాప్ ఎన్నికల సెల్ పర్యవేక్షణలో ఉందా?.. తయారైందా లేదా అనే విషయం ప్రకటిస్తే ఇంకా మంచిది. ఒక వేళ ఈ యాప్ ఎన్నికల సెల్ పర్యవేక్షణలో ఉంటే.. ఈ ’యాప్’కు రికార్డింగ్ మెసేజ్‌లు, ఫొటోలు, ఫిర్యాదులు పంపవచ్చా? కేంద్ర ఏన్నికల సంఘం లాగా ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను మీరు పరిగణిస్తారా?. ( నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా )
సహజంగా ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐటీసీ)గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక యాప్‌ను ఎవరు తయారు చేశారు? 3,249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన పోలింగ్ జరగబోతుంది. కొందరు దీని మీద ఒక రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అని ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటో బహిరంగంగా ప్రజలకు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఉంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment