పెళ్లిలో విష్ణు-వంశీచంద్ రెడ్డి మధ్య ఘర్షణ | clash between vishnuvardhan reddy and vamsichand reddy | Sakshi
Sakshi News home page

పెళ్లిలో విష్ణు-వంశీచంద్ రెడ్డి మధ్య ఘర్షణ

Published Fri, Dec 12 2014 2:36 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పెళ్లిలో విష్ణు-వంశీచంద్ రెడ్డి మధ్య ఘర్షణ - Sakshi

పెళ్లిలో విష్ణు-వంశీచంద్ రెడ్డి మధ్య ఘర్షణ

హైదరాబాద్ : ఓ పెళ్లి వేడుక ... తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణకు వేదిక అయ్యింది. కాంగ్రెస్ మాజీ, తాజా ఎమ్మెల్యేలు శుక్రవారం బాహాబాహీకి దిగారు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్  హాల్లో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి బావమరిది పెళ్లిలో ..విష్ణువర్థన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిల మధ్య వివాదం కాస్త ముదిరి చివరకు కొట్టుకునే వరకూ వెళ్లింది.

వివరాల్లోకి వెళితే విష్ణు బావమరిది పెళ్లికి వంశీచంద్ రెడ్డి  శుక్రవారం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని ...వంశీచంద్ రెడ్డి గన్ మెన్ పక్కకు తప్పుకోవాలని సూచించాడు.  ఆగ్రహించిన విష్ణు... గన్ మెన్ పై చేయి చేసుకున్నారు. దాంతో వంశీచంద్ రెడ్డి.. విష్ణుతో వాగ్వివాదానికి దిగారు. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటనలో  వంశీచంద్రెడ్డి గాయపడగా, అతడిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై విష్ణువర్థన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

వంశీ ఎందుకు చెయ్యి చేసుకున్నారా అని తాను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ యూత్ కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోలేదని, అలాంటిది తానంటే ఆయనకు ఎందుకు అంత కోపమో తెలియలేదని చెప్పారు. మరోవైపు.. అసలే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను ఇప్పుడు ఈ వివాదం మరింత ఆందోళన కలిగిస్తోందని విష్ణు తల్లి శోభ వాపోయారు. తన బిడ్డను చంపాలని కొంతమంది చూస్తున్నట్లు ఆమె ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement