
దాడి కేసులో విష్ణుకు నోటీసులు
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 37మంది ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాన్ని మాదాపూర్ పోలీసులు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు... విష్ణు సహా కొంతమంది దాడి చేసినట్లు గుర్తించారు. దాంతో విష్ణుకు నోటీసులు ఇచ్చారు. కాగా ఈనెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.