ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు ఎవరి దగ్గరికి వెళ్లినా వాళ్లందరికీ మిమ్మల్నే ప్రధాని చేస్తానని అంటున్నారు.. లాలూ ప్రసాద్ యాదవ్‌కి తప్ప దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులకి ప్రధానిని చేస్తానని మాట ఇచ్చారని ఎద్దేవా చేశారు. టీడీపీ చరిత్రలో బీజేపీ లేకుండా ఎప్పుడైనా గెలిచిందా అని విష్ణువర్దన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని రకాల సర్వే సంస్థలు చెప్పాయి.. ఇది ఓర్చుకోలేని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇంకా ప్రజల్ని మభ్యపెడుతున్నాయని వ్యాఖ్యానించారు.