
సంబేపల్లె : జగనన్న నవరత్నాల పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారని ఎంపీపీ ఆవుల నాగశ్రీలక్ష్మి చెప్పారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ సొంత నిధులు రూ.4.75 లక్షలను వలంటీర్లకు గ్రామ కార్యదర్శుల ద్వారా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలంటీర్లు చేస్తున్న సేవలకు కొంతైనా వారి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మండలంలోని 190 మంది వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నగదును పంపిణీ చేశారు.