Anantaramu
-
వలంటీర్ల సేవలకు సలాం
సంబేపల్లె : జగనన్న నవరత్నాల పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారని ఎంపీపీ ఆవుల నాగశ్రీలక్ష్మి చెప్పారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ సొంత నిధులు రూ.4.75 లక్షలను వలంటీర్లకు గ్రామ కార్యదర్శుల ద్వారా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలంటీర్లు చేస్తున్న సేవలకు కొంతైనా వారి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మండలంలోని 190 మంది వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నగదును పంపిణీ చేశారు. -
ఆశ చూపాడు..టోకరా పెట్టాడు
బహుమతి పేరుతో మోసం ► రూ.28వేలు నష్టపోయిన బాధితుడు మైసూరు: బహుమానం వస్తుందని ఆశ పడిన వ్యక్తి చివరకు రూ.28వేలు నష్టపోయాడు. ఈ ఘటన మైసూరులో శనివారం వెలుగు చూసింది. అశోక పురం పోలీసుల కథనం మేరకు.. జయనగర ప్రాంతానికి చెందిన అనంతరాము భట్టకు గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల ఫోన్ చేశాడు. మీ సెల్ నంబర్‌కు లాటరీ తగిలిందని, దానిని తీసుకోవాలంటే రూ. 28 వేలు చెల్లించాలని సూచించాడు. అనంతరాము భట్ట సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాకు రూ. 28 వేలు జమ చేశాడు. రోజులు గడిచినా బహుమతి అందకపోవడంతో సదరు వ్యక్తి సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని సమాధానం వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు అశోక్ పురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.