ఓ పెళ్లి వేడుక ... తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వేదిక అయ్యింది. కాంగ్రెస్ మాజీ, తాజా ఎమ్మెల్యేలు శుక్రవారం బాహాబాహీకి దిగారు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి బావమరిది పెళ్లిలో ..విష్ణువర్థన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిల మధ్య వివాదం కాస్త ముదిరి చివరకు కొట్టుకునే వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే విష్ణు బావమరిది పెళ్లికి వంశీచంద్ రెడ్డి శుక్రవారం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని ...వంశీచంద్ రెడ్డి గన్ మెన్ పక్కకు తప్పుకోవాలని సూచించాడు. ఆగ్రహించిన విష్ణు... గన్ మెన్ పై చేయి చేసుకున్నారు. దాంతో వంశీచంద్ రెడ్డి.. విష్ణుతో వాగ్వివాదానికి దిగారు. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటనలో వంశీచంద్రెడ్డి గాయపడగా, అతడిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై విష్ణువర్థన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు