
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీది ముగిసిన అధ్యాయం అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ జాతీయ పార్టీయో... జాతి పార్టీయో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘టీడీపీలో కొత్త ఉద్యోగంలో చేరిన అచ్చెన్నాయుడు మాకు సలహాలిస్తున్నారు. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. టీడీపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది. బీజేపీకి ఉచిత సలహాలు, సూచనలు అవసరం లేదు. చంద్రబాబు హయాంలో 40 ఆలయాలు కూల్చేశారు. (‘అప్పుడు అంతు చూస్తా, తోక కోస్తా అన్నారు’)
ఇక మా భుజాల మీద మిమ్మల్ని మోసే శక్తిలేదు. బీజేపీది రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర. పూటకోమాట మాట్లాడే తీరు టీడీపీ నాయకుది. మీ పార్టీ ఏపీ దాటిపోయి తెలంగాణ చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉంటూ హైదరాబాద్ వరదలపై నోరు మెదపని నాయకుడు చంద్రబాబు. దోచేసి రెస్ట్ తీసుకుని బయటకు వచ్చిన నాయకుడు ఆయన. బీజేపీకి ఉచితం సలహాలు సూచనలు అవసరం లేదు. 50 వేల ఖరీదు చీర కట్టుకుని ఉద్యమాలు చేసే నాయకురాలు కూడా మమ్మలి విమర్శిస్తున్నారు. స్క్రోలింగ్ వీరుడు మరొకరు ఉదయం అరున్నరకే లేచి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారు. మరొకరు తానే మేధావి అన్నట్లు మాట్లాడుతారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. (మొన్న గౌతు శిరీష.. నేడు ప్రతిభా భారతి)
Comments
Please login to add a commentAdd a comment