Acham naidu
-
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
-
బాబుకు కోపమొచ్చింది.. అచ్చెన్న పదవి ఊస్టింగేనా?
టీడీపీ సీనియర్ నేతల తీరుపై చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయినట్లు సమాచారం. 52 రోజుల పాటు తాను జైల్లో ఉంటే పార్టీ సీనియర్లంతా తమ ఇళ్లకే పరిమితమై పార్టీని వదిలేశారని చంద్రబాబు మండిపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యంతర బెయిల్‌పై విడుదల అయిన తర్వాత తనను స్వాగతించడానికి వచ్చిన సీనియర్లను చంద్రబాబు చూసీ చూడనట్లు వ్యవహరించారు. ఆ తర్వాత తనను కలిసి నేతలతో ఏంటి పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారా? నేను అరెస్ట్ అయినా మీలో స్పందన రాదా? అని గుడ్లురిమినట్లు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు ప్రతిపక్షంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారని ఆయన దుయ్యబట్టారట. ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని టీడీపీకి పేరు. కార్యకర్తలే పార్టీకి అసలు సిసలు బలమని అంటారు. అటువంటి పార్టీ అధినేత ఓ అవినీతికేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ పకడ్బందీగాచేపట్టకపోవడంపై రాజకీయ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పార్టీ పీకల్లోతు సంక్షోభంలో కూరకుపోయిన తరుణంలోనూ పార్టీలో సీనియర్లు జూనియర్లూ కూడా తమకేమీ పట్టనట్లు ఉండిపోవడంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు లూటీ జరిగిన స్కిల్ స్కాం కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనపై మోపిన అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించడం వల్లనే ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తనను అరెస్ట్ చేస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటాయనుకున్నారు చంద్రబాబు. తనను జైలుకు పంపితే ఇక ఆందోళనలు మిన్నంటుతాయనుకున్నారు.1984లో ఎన్టీయార్ ను తప్పించి నాదెండ్ల ముఖ్యమంత్రి అయినపుడు ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఉద్యమించినట్లు తన విడుదల కోసం ప్రజలు నినదిస్తారని అనుకున్నారు.అయితే వీటిలో ఏ ఒక్కటీ జరగలేదు. ప్రజల మాట దేవుడెరుగు తమ సొంత పార్టీ శ్రేణుల నుంచే స్పందన లేకపోవడం చంద్రబాబుకు మింగుడు పడలేదు. అప్పట్లో ములాఖత్ లో తనని కలవడానికి వచ్చిన యనమల , పయ్యావుల కేశవ్ వంటి సీనియర్లపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు నేను జైలు కెళ్లినా మీరంతా మీ ఇళ్లల్లో కూర్చుని కాలక్షేపం చేస్తే ఎలాగ? అని సీరియస్ అయ్యారు. కనీసం ఇప్పట్నుంచి అయినా ఆందోళనలపై దృష్టి సారించండి అని వారికి దిశానిర్దేశనం చేశారు. అయితే ఆ తర్వాత కూడా నేతల తీరులో ఎలాంటి మార్పు లేకపోవడం.. తన గురించి పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత నుంచే ఆయన ఆరోగ్యం పై కుటుంబ సభ్యుల చేత రక రకాల ఫిర్యాదులు అసత్య ప్రచారం చేయించారు. అయినా సానుభూతీ రాలేదు..బెయిలూ రాలేదు. ఇక లాభం లేదని కంటి ఆపరేషన్ ను తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్ కోరడంతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఆధారంగా చంద్రబాబు నాయుడికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. నవంబరు 28న సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబు నాయుడు తన కంటికి ఆపరేషన్ చేయించుకుని తిరిగి జైలుకెళ్లి లొంగిపోవాలి. అయితే జైలు నుండి మధ్యంతర బెయిల్ పై విడుదల కాగానే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆయనకు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిలే తప్ప పూర్తి బెయిల్ కాదని నిపుణులు అంటున్నారు. ఇక దీన్ని పక్కన పెడితే బెయిల్ పై జైలు నుండి విడుదల అయిన తర్వాత చంద్రబాబు ను కలసి శుభాకాంక్షలు చెప్పడానికి పార్టీనేతలు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడితో పాటు మరికొందరిపై చంద్రబాబు నిర్లిప్తంగా వ్యవహరించారని అంటున్నారు. తన సన్నిహిత వర్గాలతో మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నేతలంతా వేస్ట్ ఫెలోసే అని చంద్రబాబు కారాలు మిరియాలు నూరారట. 52రోజుల పాటు నేను జైల్లో ఉన్నా వీళ్లకి పట్టదా? ప్రభుత్వంలో ఉంటే పదవులు కావాలని వస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు మాత్రం నిర్వర్తించరు..పార్టీని పూర్తిగా గాలికి వదిలేసి ఎవరి ఇళ్లల్లో వాళ్లు రెండు నెలల పాటు కాలక్షేపం చేశారు అని చంద్రబాబు తీవ్ర ఆవేశంతో ఏకి పారేశారట. త్వరలోనే పార్టీని సమూలంగా కింది నుంచి పైకి ప్రక్షాళన చేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. నాలుగువారాల మధ్యంతర బెయిల్ ముగిసే లోపే పార్టీలో అసలైన విధేయులకు పదవులు బాధ్యతలు అప్పగించి.. విధేయంగా ఉన్నట్లు నటిస్తూ పదవుల్లో కూర్చున్నవారిని పక్కన పెట్టాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాను జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండిపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్లు అంటున్నారు. మొత్తానికి జైలు కెళ్లడం కూడా ఒకందుకు తనకు మేలే చేసిందని.. తన వారెవరో నటించేదెవరో తేల్చుకోడానికి అది దోహద పడిందని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ లెక్కన అచ్చెంనాయుడికి పదవీ గండం ఉండచ్చని ఎన్టీయార్ ట్రస్ట్ కోళ్లు అదే పనిగా కూస్తున్నాయి. - కుర్చీ కింద కృష్ణయ్య -
అచ్చెన్నాయుడి మెడపై ఉద్వాసన కత్తి
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి త్వరలోనే పెద్ద షాక్ తప్పదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్ష పీఠంపై నుంచి అచ్చెన్నాయుడ్ని తప్పించడానికి నిర్ణయం జరిగిపోయిందని అంటున్నారు. త్వరలోనే అచ్చెన్నాయుడి స్థానంలో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్షుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఈ మార్పుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినా పార్టీ పరంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో హడావిడి చేయడంలో అచ్చెన్నాయుడు ఘోరంగా విఫలమయ్యారని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. పై పెచ్చు పార్టీ బలహీనంగా ఉందన్న సంకేతాలను అచ్చెన్నాయుడే లీక్ చేయిస్తున్నారని కూడా పార్టీ అధినేత అనుమానిస్తున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మార్పు జరగడం ఇంచుమించు ఖాయం అంటున్నారు టీడీపీ వర్గీయులు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెంన్నాయుడి వ్యవహార శైలిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోనూ అచ్చెన్నాయుడి వ్యతిరేక వర్గం ఆయన్ను తప్పించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆ వర్గానికి పార్టీలోని సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారని అంటున్నారు. 2020 అక్టోబరులో కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడికి పార్టీ పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత ఆయన ఇఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. ఆయనపై కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. అయినా చంద్రబాబు నాయుడి ఆశీస్సులు ఉండడంతో ఎవరూ అచ్చెన్నాయుడ్ని టచ్ చేయలేకపోయారని అంటారు. సెప్టెంబరు 9న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే జైలుకు వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబును జైలుకు పంపినా ఏపీలో ప్రజల నుండి స్పందన రాలేదు. ఎవరూ ఆందోళనలు చేయలేదు. బాబుతో నేను పేరుతో ఆందోళనలకు పార్టీ శ్రేణులు తరలి రావాలని పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పిలుపునిచ్చినా పార్టీ నేతల నుంచే స్పందన లేదు. అయితే పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడంలో అచ్చెన్నాయుడు విఫలం కావడం వల్లనే బాబుతో నేను కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పార్టీలో అచ్చెన్నాయుడి వైరి వర్గం ఆరోపిస్తోంది. అచ్చెన్నాయుడ్ని అధ్యక్ష పీఠం నుంచి తప్పిస్తే కానీ పార్టీకి మంచి రోజులు రావని కూడా ఆ వర్గం వాదిస్తోన్నట్లు చెబుతున్నారు. ఆ మధ్య ములాఖత్‌లో భాగంగా యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో భేటీ అయినపుడు పార్టీ భవిష్యత్ పైనే చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అచ్చెన్నాయుడు సరిగ్గా పట్టించుకోవడం లేదని యనమల కూడా చంద్రబాబుకు ఫిర్యాదుచేసినట్ల సమాచారం. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు అధ్యక్షుడయ్యాక పలు సందర్భాల్లో అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలు రాజకీయ ప్రత్యర్ధులకు లీక్ కావడంపై చర్చించినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెన్నాయుడు ఓ కార్యకర్తతో పార్టీలేదు బొక్కా లేదు అన్న కామెంట్‌ను అచ్చెన్నాయుడికి తెలీకుండా ఎవరు లీక్ చేస్తారని? యనమల చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు చెబుతున్నారు. అదే విధంగా లోకేష్ యువగళం యాత్రకు జనాన్ని తరలించకపోవడంపై పార్టీ నేతతో అచ్చెన్నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా లీక్ అయ్యింది. లోకేష్ యాత్రకి జనం రాకపోవడంతో పెద్దాయన బాధగా ఉన్నారంటూ అచ్చెంనాయుడు చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో పార్టీ బలహీనతలు వెలుగులోకి వచ్చినట్లయ్యింది. ఆ తర్వాత మాచర్లలోనూ టీడీపీ నేతలతో అచ్చెన్నాయుడి చిట్ చాట్ సంభాషణల ఆడియో క్లిపింగ్ కూడా లీక్ అయ్యింది. ప్రతీ సందర్భంలోనూ అచ్చెన్నాయుడు భాగస్వామిగా ఉన్న క్లిపింగ్సే లీక్ కావడం వెనుక కుట్ర ఉందని యనమల అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అనుమానాలనే చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు సమాచారం. అన్నింటినీ నిశితంగా పరిశీలించిన తర్వాత అచ్చెన్నాయుడు ఉద్దేశ పూర్వకంగానే పార్టీ పరువు బజారున పడేస్తున్నారని చంద్రబాబు కూడా భావిస్తోన్నట్లు చెబుతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన పార్టీ అధ్యక్షుడే అచేతనంగా వ్యవహరించడం వల్లనే పార్టీ ప్రతిష్ఠ రోజు రోజుకీ మసకబారిపోతోందని చంద్రబాబు ఆందోళన చెందుతోన్నట్లు చెబుతున్నారు. దీనిపై యనమలతో పాటు ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత అచ్చెన్నాయుణ్ని తప్పించడమే మేలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి అచ్చెంనాయుడ్ని తప్పిస్తే బీసీ వర్గానికి చెందిన నేతను అవమానించారన్న ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉండడంతో బీసీ వర్గానికే చెందిన యనమల రామకృష్ణుడికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని చంద్రబాబు భావిస్తోన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి యనమల రామకృష్ణుడు టీడీపీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆయనే సీనియర్ నాయకుడు పార్టీలో. అందుకు యనమలను అధ్యక్షుణ్ని చేస్తే అవసరమైన వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపిస్తారని చంద్రబాబు భావిస్తోన్నట్లు అంటున్నారు. అయితే తనను తప్పించి యనమలకు పదవిని ఇస్తే.. అచ్చెన్నాయుడు ఊరికే ఉండరని.. యనమలకు నిద్ర లేకుండా చేయడానికి ఏం చేయాలో అంతా చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు -
నీకు ఒక ఊరు సరిపోదు నాయనా...!
-
అచ్చెన్న ఆరోపణ.. బుగ్గన ఖండన
సాక్షి, అమరావతి: ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారం కట్టిస్తుందని ఉన్నా ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. కడప ఉక్కు కర్మాగారానికి 2019 డిసెంబర్లో శంకుస్థాపన చేశారని, త్వరలో మూడేళ్లు పూర్తికావస్తోందని.. అయినా ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. భూమి ఇచ్చిన రైతులకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ తీరుతో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోతున్నాయన్నారు. అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. 480 ఎకరాల భూములిచ్చిన రైతులకు రూ.37.18 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ కట్టిస్తుందని లేదన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నం చేయొచ్చని మాత్రమే ఉందని స్పష్టం చేశారు. -
విష నాలుకలు.. నీచ నాయకులు...
నవ్విపోదురు గాక.. అని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. ఎవరేమనుకోనీ గాక.. అని కూడా ముక్తాయిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు తమ అనుభవాన్ని, తాము అధిష్టించిన పదవుల గొప్పతనాన్ని గాలికొదిలేస్తున్నారు. వీళ్లకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిస్సిగ్గుగా నాయకత్వం వహిస్తున్నారు. వీళ్లంతా కలిసి నోటికొచ్చిన తీరులో మాటలు విసిరేస్తున్నారు. అవతలివారు ఎవరన్నది కూడా చూడకుండా.. తాము ఏమంటున్నదీ ఆలోచించకుండా బురద జల్లుతున్నారు. అయితే ఆ విధంగా వీరు ఉన్న కొద్దిపాటి పరువును తామే నడిబజారులో దిగజార్చుకుంటున్నారు. జనం ఛీత్కారాలను దండిగా పోగు చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై ట్విట్టర్ వేదికగా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి మరణంపై ఇంత దారుణమైన ట్వీట్ చేశారంటే అచ్చెన్న రాజకీయంగా ఎంత దిగజారిపోయారో, ఎంత సంస్కార హీనంగా మాట్లాడారో ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని జనం ఆక్షేపిస్తున్నారు. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంను ‘ఆమదాలవలస నడిరోడ్డుపై గుడ్డలూడదీస్తాను’ అంటూ.. పరిషత్ ఎన్నికల రోజున పెనుబుర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేసిన సందర్భంలో పోలీసు అధికారులను దుర్భాషలాడిన కేసులో గురువారం అరెస్టై బెయిల్‌పై వచ్చిన తర్వాత పరుషపదజాలంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ దూషించారు. ►ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అచ్చెన్న, రవికుమార్‌లను చూస్తుంటే రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా? అని ముక్కున వేలేసుకున్న పరిస్థితి ఏర్పడింది. నోరు పారేసుకోవడం, అరెస్టులవ్వడం, బెయిల్‌పై విడుదల కావడం, మళ్లీ నోటికొచ్చినట్టు దురుసుగా, అసభ్యకరంగా మాట్లాడం వీరిద్దరికి అలవాటైపోయింది. వీరా మన నాయకులు అంటూ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఇంత హీనంగా వ్యవహరిస్తున్న నాయకులు మన జిల్లాకు చెందిన వారు కావడం బాధాకరమని అసహ్యించుకుంటున్నారు. అచ్చెన్నకు, కూన రవికి ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో నోరు పారేసుకున్నారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిపై దాడి ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో ‘ఏయ్ ఎవర్నువ్. ఎలా అరెస్టు చేస్తావ్. ఏమనుకుంటున్నావ్. ఎవర్నీ వదల్ను. మళ్లీ అధికారంలోకి వచ్చాక నేనే హోం మంత్రినవుతా..సంగతి తేలుస్తా..’ అని పోలీసు అధికారులను అచ్చెన్నాయుడు బెదిరించారు. ►ఏయ్ ఎగ్స్ట్రాలు చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు? నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? యూజ్లెస్ ఫెలో..’అంటూ అమరామతిలో పోలీసు అధికారులపై తీవ్ర పదజాలంతో అచ్చెన్న దూషించారు. ►ఈఎస్ఐలో రూ.150 కోట్ల మేర కుంభకోణం చేసి విచారణలో బయటపడి అరెస్టయితే...ఇది కక్ష సాధింపు అంటూ పోలీసులపై నోరు పారేసుకున్నారు. ఇలా అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ పోటీ పడి నోటికొచ్చినట్టు మాట్లాడి సిక్కోలు జిల్లా గౌరవాన్ని మంట కలిపేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. జిల్లా వాసులు ఎక్కడున్నా మంచి ప్రవర్తన, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తారు. వినయంగా మాట్లాడతారు. కానీ జిల్లాకు మచ్చ తెచ్చేలా అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ మాట్లాడుతుండటంపై ప్రజలు ఛీకొడుతున్నారు. వీరికి మంచి బుద్ధి ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. తీరు మారని కూన.. అచ్చెన్నాయుడి కన్నా తానేమీ తక్కువ కాదన్నట్టుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ దురుసుగా మాట్లాడుతున్నారు. ‘ఏయ్ జాగ్రత్త.. శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. మీ స్థాయి ఎంత..మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి రవికుమార్ గతంలో తీవ్ర పదజాలంతో మాట్లాడారు. ►పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. ‘.. నువ్వు గనక బిల్డింగ్ దగ్గరకు వస్తే నీ సంగతి చూస్తా’ అని కూన బెదిరించారు. ►‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తాను..’ అంటూ పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చారు. ►‘నీకెంత ఒల్లు బలిసింది... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు ’ అంటూ మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న పొందూరు తహశీల్దార్‌ను పరుష పదజాలంతో బెదిరించారు. చదవండి: కూన తీరు మారదు.. పరుగు ఆగదు! ‘కూన’ గణం.. క్రూర గుణం -
టీడీపీపై కామెంట్లు.. అచ్చెన్నాయుడు వీడియో వైరల్
సాక్షి, అమరావతి : తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చెన్నాయుడు, మరో టీడీపీ నేతకు మధ్య జరిగిన సంభాషణ వీడియో అది. ఆ వీడియో టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది. పార్టీ క్యాడర్‌ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని సదరు టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రీకొడుకుల తీరును ఎండగట్టాడు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. లోకేష్‌ను ఉద్దేశించి ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని అన్నారు. అనంతరం ‘పార్టీ లేదు.. బొక్క లేదు’ అంటూ ఆ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. -
వైరల్‌గా అచ్చెన్నాయుడు వీడియో
-
ఆటవికం.. అరాచకం: ఇదీ అచ్చెన్నాయం!
తమ మాట కాదంటే కక్ష.. ఎదురుతిరిగినందుకు ఆంక్ష.. కట్టుబాట్లను ధిక్కరించారంటూ వెలి పేరుతో శిక్ష. ఏనాడో పెత్తందారీ రాజ్యంలో కొనసాగిన అకృత్యాలకు సాక్ష్యాలివి. అరాచకాలకు అద్దం పట్టే దారుణాలివి. ఆనాటి దురాగతాలకు తెరపడిందని లోకం భావిస్తూ ఉంటే.. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ ఈ పోకడలు కొనసాగుతున్న ఉదంతాలున్నాయి. మన మధ్యే ఉన్న కొందరు తమకెదురు నిలిచిన వారిపై సామాజిక బహిష్కరణ కొరడా ఝుళిపిస్తున్న పరిణామాలు నివ్వెరపరుస్తున్నాయి. కింజరాపు కుటుంబీకుల పిడికిల్లో ఉన్న నిమ్మాడలో ఇటువంటి సంఘటనలు గతంలో సమాజం దృష్టికి వచ్చాయి. తాజాగా.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎదురుతిరిగిన అప్పన్నకు ఇదే అనుభవాన్ని పెత్తందార్లు రుచి చూపిస్తూ ఉన్నట్లు వస్తున్న వార్తలు అచ్చంగా.. అకృత్యాలకు సాక్ష్యమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు స్వగ్రామంలో ఆటవిక పాలన అమలవుతోంది. తన కబంధ హస్తాల నుంచి గ్రామాలు చేజారిపోకుండా ఉండేందుకు నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారు. గ్రామంలో వారికి వ్యతిరేకంగా నిలిస్తే చాలు.. కనిపించకుండా చేయడం లేదంటే సామాజిక బహిష్కరణ చేయడం అలవాటుగా మారిపోయింది. అచ్చెన్న కుటుంబీకులను వ్యతిరేకించిన, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులెంతో మంది కనుమరుగయ్యారు. ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో కుటుంబాలు సామాజిక బహిష్కరణకు గురయ్యాయి. రెండేళ్ల క్రితం వరకు గ్రామ బహిష్కరణల పర్వం నడిచిన నిమ్మాడలో తాజాగా సర్పంచ్ ఎన్నికల తర్వాత కూడా అదే సీన్ పునరావృతమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారికి పోటీగా నిలిచిన కింజరాపు అప్పన్న ను కూడా సామాజిక బహిష్కరణ చేశారు. అప్పన్నతో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదు. కుల వృత్తుల వారిని వెళ్లనివ్వడం లేదు. దిక్కు లేని హక్కులు.. హక్కులకు ఇక్కడ దిక్కు లేకుండా పోతోంది. అచ్చెన్న కుటుంబానికి ఎదురు తిరిగి బహిష్కరణకు గురైన వారి ఇళ్లల్లో చావు పుట్టుకలకు ఎవరూ వెళ్లకూడదు. రజకులు, నాయిబ్రాహ్మణులు వారి పనులు చేయకూడదు. చివరకు వారి పంట పొలాల్లో పనులకు సైతం కూలీలు వెళ్లకుండా చేస్తున్నారు. గ్రామంలో ఉన్న బీడు భూములే అందుకు నిదర్శనం. పంట భూములు ఉన్నప్పటికీ బాధితులు మూడు పూటలా తిండి కోసం విలవిలలాడాల్సిన పరిస్థితులు ఉన్నా యి. సంవత్సరాల తరబడి సుమారు 26 కుటుంబాలపై ఇదే రకంగా కక్ష సాధింపుగా వ్యవహరించారు. తమపై ఎదురు తిరిగితే వారికి ఇదే గతి పడుతుందంటూ చేసి చూపిస్తున్నారు. భార్య మేనమామతో మొదలై... అచ్చెన్నాయుడు భార్య మేనమామ కింజరాపు గణపతి తొలుత సామాజిక బహిష్కరణ ఎదుర్కొన్నా రు. మొదటి నుంచి కాంగ్రెస్ వాది అయిన గణపతి తమకు వ్యతిరేకంగా నిలిచారని సామాజిక బహిష్క రణ చేసిన అచ్చెన్న కుటుంబం ఆ తర్వాత వరుసగా 26 కుటుంబాలపై తమ దుశ్చర్యను ప్రదర్శించింది. తాజాగా ఆ జాబితాలో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో అచ్చెన్న కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసిన కింజరాపు అప్పన్న చేరారు. ఇప్పటికే మెండ రామ్మూర్తి అనే రైతు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన 18 ఎకరాల భూములను అచ్చెన్నాయుడు అండతో సోదరుడు కింజరాపు హరిప్రసాద్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తాను చెప్పిన ధరలకు భూములు అమ్మకాలు చేయాలనే జారీ చేసిన హుకుంను తిరస్కరించాడనే కక్షతో సుమారు 12 ఏళ్లుగా రామ్మూర్తి కి చెందిన భూములను కొర్నుగా మార్చేశారు. రా మ్మూర్తి చిన్న కుమారుడు మెండ హరిని తన గుప్పె ట్లో పెట్టుకుని రామ్మూర్తిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. మరో కుమారుడు గ్రామాన్ని వదిలి పో యే విధంగా అతనిపై దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. తాజాగా కింజరాపు అప్పన్నకు అదే పరిస్థితిని తీసుకొచ్చారు. నాయీ బ్రాహ్మణులు, రజకులెవరూ వారికి ఇంటికి వెళ్లొద్దని, పొలం పనులు చేయవద్దని కూలీలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో రెండెకరాల మినప చేనును పొలంలో వదిలేసిన దుస్థితి చోటు చేసుకుంది. పొలంలోకి ట్రాక్టర్‌ను కూడా వెళ్లనివ్వకుండా తనకు ముందున్న పొలాల రైతులకు హకుం జారీ చేశారు. అప్పన్న పొలానికి ముందు కంచె వేసేయాలని రైతులను ఆదేశించారు. చదవండి: అచ్చెన్న ‘రాజ్యం’లో అరాచకం కుప్పం పర్యటన: చంద్రబాబుకు ఊహించని దెబ్బ.. -
అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో..
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని, ఇప్పటికే ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ కూడా రాశారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. పోస్కోతో కలిసినంత మాత్రాన లాలూచీ పడినట్లు కాదని, 2014 లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చర్చలు జరగలేదా..?. 2018లో పోస్కో ప్రతినిధులు చంద్రబాబును కలవలేదా అని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, సీఎం జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని మంత్రి అవంతి హెచ్చరించారు. రెండు సార్లు జైలుకెళ్లొచ్చినా అచ్చెన్నాయుడికి ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌పై తమ పార్టీ విధానం స్పష్టంగా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు ఆ బాధ్యత లేదా, ప్రధాని లేఖ రాసే ధైర్యం లేదా అని దుయ్యబట్టారు. దీక్షలు చేస్తున్న నేతలను ఎందుకు టీడీపీ నేతలు పరామర్శించలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలని అవంతి హితవు పలికారు. ఈ నెల 20న స్టీల్‌ప్లాంట్ కోసం మహా పాదయాత్ర చేస్తున్నామని.. ఆ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. (చదవండి: కలెక్టర్ వినూత్న శైలి: ఆ నోటీస్‌లో ఏముందంటే..) తిత్లీ పాపం.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. -
‘ఎవరెన్ని డ్రామాలు చేసినా.. గెలుపు మాదే’
సాక్షి, నెల్లూరు: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీనే అడ్డదారులు తొక్కుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, స్వయానా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లే అరాచకాలు చేస్తూ నిందలు తమపై వేయడం సిగ్గుచేటన్నారు. (చదవండి: ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి సర్కారు ‘నో’) మూన్నాళ్లు వుండే ఓ వ్యక్తి అండ చూసుకొని చంద్రబాబు రెచ్చిపోతున్నారని.. పల్లెలు ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదని మంత్రి అనిల్ ఆరోపించారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా.. పంచాయితీ ఎన్నికల్లో 90 శాతం పైగా గెలుపు వైస్సార్సీపీదేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.(చదవండి: కాపీల రాయుడు.. చంద్రబాబునాయుడు) -
‘అప్పుడు గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?’
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భయపడుతున్నారని వ్యాఖ్యానించడం అవివేకమన్నారు. ప్రజల ప్రాణ, రక్షణ దృష్ట్యా వేసవి కాలంలోనే ఎన్నికల నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. (చదవండి: ‘ఆయనొక గాలి నేతగా మిగిలిపోయారు’) టీడీపీ నేతలకు సవాల్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 90 శాతం పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. కార్మికుల సొమ్మును దోచుకుతినే అచ్చెన్నాయుడు, గాలి నాయుడు, ఫేక్ పార్టీ నాయకులు ఎవరైనా తన సవాల్ స్వీకరించాలని కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణలో మాదిరే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగు కాక తప్పదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి: 'కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారు') నిమ్మగడ్డకు ఆ హక్కు లేదు.. గవర్నర్‌కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై కూడా మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. చంద్రబాబు బూట్లు నాకే నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించే హక్కు లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని, ప్రజలను, గవర్నర్‌ను లెక్కచేయని నిమ్మగడ్డ రమేష్‌ను ఎన్నికల కమిషనర్‌గా తాము గుర్తించమని పేర్కొన్నారు. 2018 జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించాల్సిన నిమ్మగడ్డ.. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాల పాటు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నాడా అంటూ ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు తానా అంటే తందానా అనే నిమ్మగడ్డ రమేష్ చెప్తే, మేము ఎన్నికలు నిర్వహించాలా చంద్రబాబు బినామీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని’’ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. -
అచ్చెన్నాయుడు డూడూ బసవన్నేనా?
తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీలకు చెందిన అచ్చెన్నాయుడిని చేశామని టీడీపీ గొప్పలు చెప్పుకొంటోంది. మరి, తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నికలో, పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థిని ప్రకటించడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పేరు, ప్రమేయం ఎక్కడా కనబడకపోవడం విచిత్రం. బీసీ తదితర పీడిత కులాలకు చెందిన వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నా ఆధిపత్య కుల పార్టీల నాయకుల వ్యవహారశైలి ఎలా ఉంటుందో, బహుజన వర్గాల వ్యక్తుల పదవులు ఎంతటి డొల్ల పదవులో చంద్రబాబు తాజా ప్రకటన బహిర్గతం చేస్తోంది. ‘గులాంగిరీ’కి అలవాటు పడిపోయిన అచ్చెన్నాయుడు ఉలకడు, పలకడు. మరిప్పుడూ ‘డూడూ బసవన్న’లాగే తల ఊపుతాడా? అణచబడ్డ కులాల యెడల ఆధిపత్య కులాల పార్టీల నాయకులు ఒలకపోసే ప్రేమలూ, అభిమానాలూ, పొగడ్తలూ, లేదా, విదిలించే పదవులూ, రాయితీలూ–అన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో అంతర్భాగమే. కనుక బహుజనులు డొల్ల పదవులూ, తాత్కాలిక రాయి తీలతో సంతోషించకుండా, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన దిశగా సాగిపోవాలి. వై. కె., సామాజిక న్యాయ కేంద్రం, రాష్ట్ర కన్వీనర్, సెంటర్ ఫర్ సోషల్ జస్టీస్ మొబైల్ : 98498 56568 -
టీడీపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది..
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీది ముగిసిన అధ్యాయం అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ జాతీయ పార్టీయో... జాతి పార్టీయో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘టీడీపీలో కొత్త ఉద్యోగంలో చేరిన అచ్చెన్నాయుడు మాకు సలహాలిస్తున్నారు. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. టీడీపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది. బీజేపీకి ఉచిత సలహాలు, సూచనలు అవసరం లేదు. చంద్రబాబు హయాంలో 40 ఆలయాలు కూల్చేశారు. (‘అప్పుడు అంతు చూస్తా, తోక కోస్తా అన్నారు’) ఇక మా భుజాల మీద మిమ్మల్ని మోసే శక్తిలేదు. బీజేపీది రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర. పూటకోమాట మాట్లాడే తీరు టీడీపీ నాయకుది. మీ పార్టీ ఏపీ దాటిపోయి తెలంగాణ చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉంటూ హైదరాబాద్ వరదలపై నోరు మెదపని నాయకుడు చంద్రబాబు. దోచేసి రెస్ట్ తీసుకుని బయటకు వచ్చిన నాయకుడు ఆయన. బీజేపీకి ఉచితం సలహాలు సూచనలు అవసరం లేదు. 50 వేల ఖరీదు చీర కట్టుకుని ఉద్యమాలు చేసే నాయకురాలు కూడా మమ్మలి విమర్శిస్తున్నారు. స్క్రోలింగ్ వీరుడు మరొకరు ఉదయం అరున్నరకే లేచి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారు. మరొకరు తానే మేధావి అన్నట్లు మాట్లాడుతారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. (మొన్న గౌతు శిరీష.. నేడు ప్రతిభా భారతి) -
అచ్చెన్నాయుడి విషయంలో టీడీపీది దుష్ప్రచారం
-
జేసీ, అచ్చెన్నాయుడు నోరు విప్పితే..
సాక్షి, తిరుపతి: అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అవినీతి చేసి అడ్డంగా దొరికి పోయారని.. వీళ్లు నోరు విప్పితే చంద్రబాబు, లోకేశ్‌ల బండారం వెలుగు చూస్తుందని ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జేసీ, అచ్చెన్నాయుడు నోరు విప్పితే వారి బండారం అంతా బయట పడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేశ్ భయపడుతున్నారన్నారు. అందుకే వారు కుడితిలో పడ్డ ఎలుకల్లా గిల గిల కొట్టు కుంటున్నారని.. విజయవాడ, అనంతపురానికి పరుగులు తీసున్నారని ఎద్దేవా చేశారు. ( అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం ) అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిని బుజ్జగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము నిప్పు అని చెప్పుకునే టీడీపీ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. కరోనా వైరస్‌తో జనం అల్లాడుతుంటే చంద్రబాబు ఒక్కరోజు కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ నుంచి రావడానికి తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పుకున్న ఆయన మరి ఇప్పుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా నిస్తుంటే నిబంధనలు పాటించలేదని వైఎస్సార్సీపీ నాయకులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఎలా వచ్చారని నిలదీశారు. ఇది చంద్రబాబు నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమని రోజా విమర్శించారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ) -
‘వచ్చే ఏడాది మహానాడు జైలులోనే’
సాక్షి, విశాఖపట్నం: పేదల సొమ్మును టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, కొందరు అధికారులు పందికొక్కుల్లా తిన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ధ్వజమెత్తాడు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాక ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి టైం దొరకని చంద్రబాబుకు, ఒక దొంగను అరెస్ట్ చేస్తే పరామర్శించడానికి టైం దొరికిందా అని ప్రశ్నించారు. అచ్చెంనాయుడు అరెస్ట్‌ను కిడ్నాప్‌గా అభివర్ణిస్తూ, రాజకీయం చేసి కులాలకు ఆపాదించారని, అవినీతికి కులం, మతం ఉండదని చంద్రబాబుకు తెలుసన్నారు. చంద్రబాబు హయంలో హెచ్‌పీసీఎల్, ఒఎన్జీసీ ఘటనలు జరిగిన బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ) తన సొంత ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం గోదావరీ పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్నా టీడీపీ తరుపున ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్ బాధిత ప్రాంతంలో నివసిస్తున్న 20 వేల జనాభాను ఆదుకుందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఆరు లక్షల కోట్ల అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. తాను చేసిన అరాచకాలు, అన్యాయాలు మర్చిపోయి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజల మీద ఉన్నది సవతి ప్రేమ అని, ఆయన అక్రమాలను తెలుగు ప్రజలు మర్చిపోరు అని అన్నారు. మొన్న మహానాడునను జూమ్ యాప్‌లో చేసుకున్న చంద్రబాబు వచ్చే ఏడాది జైలులో చేసుకోవాల్సిందే అని అమర్నాధ్ ఎద్దేవా చేశారు. (అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం) -
‘ఎర్రన్నాయుడు బాబును ప్రాధేయపడ్డారు’
సాక్షి, అమరావతి : ‘కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత ఫీల్డ్ కొస్తా.. అంతు చూస్తా’. అని చిటికెలేసిన ఉత్తర కుమారుడు ముందే వచ్చాడు.. వెళ్లి పోయాడు. ఏదీ, ఏం జరగలేదే? కూసాలు కదులుతుంటే పొంతన లేకుండా మాట్లాడటం కామన్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. నారా లోకేష్ బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ అచ్చెన్న తమ గుట్లన్నీ బయటకు కక్కుతాడేమో అన్న భయంతో అబ్బా కొడుకులకు నిద్ర పట్టడం లేదంట. ( ‘ఆంధ్రజ్యోతి కిట్టు మారడు’) అచ్చెన్న అరెస్టును బీసీల అణచివేతగా రంగు పులుముతున్న చంద్రబాబు గారు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మర్చినట్టున్నారు. 2002లో బాలయోగి గారి దుర్మరణంతో, లోక్ సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు. ఎదిగి పోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు ‘విజనరీ’’ అంటూ ఎద్దేవా చేశారు. -
అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగానే ఉంది
-
స్కాం చేయలేదని చట్టప్రకారం నిరూపించుకోవాలి
-
రూ 150 కోట్ల మేర అవినీతి జరిగింది
-
బాబుకు రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేదు
సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వక్రభాష్యంతో రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. 2014 నుండి 2018 వరకు ఈఎస్ఐలో జరిగిన అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలతో ఏసీబీ అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుందన్నారు. అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేస్తే.. కిడ్నాప్ చేశారనటం దారుణమన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం బీసీ కార్డ్‌ను వాడుకుంటున్నారన్నారు. ఈఎస్ఐలో 150 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగిందని అన్నారు. గతంలో డిమ్స్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తిని, అతని కుమారున్ని, అచ్చెన్నాయుడిని ఉదయం అరెస్టు చేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చెయ్యదని, పక్కా ఆధారాలతో అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న దేవరపల్లి టు జీలుగుమిల్లు రహదారి మోక్షం కలిగిందన్నారు. హైవే నెంబర్ 516డి పునర్ నిర్మాణ పనులకు 160 కోట్లు రెండు విడతలుగా మంజూరు అయిందని తెలిపారు. మొదటి విడతగా 94 కోట్ల విలువ గల రోడ్ల నిర్మాణం పనులు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. -
బీసీల మీద బాబుది సవతి ప్రేమ
-
అవినీతి చేసి కులాలను పైకి తీసుకొస్తున్నారు
-
ఆ బురద మాకు కూడా అంటిస్తారా?
సాక్షి, విశాఖ : విజిలెన్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ మందుల కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..‘టెలీ మెడిసిన్ విషయంలో ప్రధానమంత్రి చెబితేనే చేశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం అభివృద్ధి పనులపై రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది కానీ అవినీతి చేయమని చెప్పదు. టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్డారు. మరో రాష్ట్రంలో తప్పు జరిగిందని అదే తప్పులు చేస్తాం అనడం సరికాదు. తినడానికి అలవాటు పడ్డారు అది మందులు కావచ్చు...మరేదైనా సరే అది దోచుకోవడమే. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) చంద్రబాబు నాయుడుకి దగ్గర అవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వార్డులో బీజేపీ నుంచి 300మంది నాయకులు టీడీపీలో చేరిపోయారని గంటా ప్రచారం విడ్డూరంగా ఉంది. టీడీపీ దూరం పెట్టిందని గంటా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గంటా కారు నంబర్ 1..అలాగే తప్పుడు ప్రచారం చేయడంలో కూడా ఆయన నంబర్ వన్. ఇలాంటి నాయకులను నమ్మడం వల్లే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు దక్కాయి. టీడీపీ చేరినవారంతా రూ.250 బ్యాచ్’ అని వ్యాఖ్యానించారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) చంద్రబాబు పాత్రపైనా విచారణ చేయాలి ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘అచ్చెన్నాయుడు అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టే మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అవినీతి బురద బీజేపీకి అంటించాలని చూస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలి. టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు...ఈఎస్ఐకి రాసిన లేఖకు పొంతన లేదు’ అని అన్నారు. ఈఎస్ఐ స్కాం: వారిని శిక్షించాలి.. విజయవాడ: మరోవైపు ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు చెందిన కోట్లది రూపాయల నిధులు దిగమింగిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలతో పాటు అధికారులను శిక్షించాలంటూ విజయవాడ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం శనివారం ఆందోళనకు దిగింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి ఈఎస్ఐ అభివృద్ధికి వెచ్చించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చందాదారులైన ఉద్యోగ,కార్మికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవినీతి నుంచి తప్పించుకునేందుకు కులం కార్డు వాడటం ఏంటని ప్రశ్నించారు.