
సాక్షి, అమరావతి : ‘కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత ఫీల్డ్ కొస్తా.. అంతు చూస్తా’. అని చిటికెలేసిన ఉత్తర కుమారుడు ముందే వచ్చాడు.. వెళ్లి పోయాడు. ఏదీ, ఏం జరగలేదే? కూసాలు కదులుతుంటే పొంతన లేకుండా మాట్లాడటం కామన్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. నారా లోకేష్ బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ అచ్చెన్న తమ గుట్లన్నీ బయటకు కక్కుతాడేమో అన్న భయంతో అబ్బా కొడుకులకు నిద్ర పట్టడం లేదంట. ( ‘ఆంధ్రజ్యోతి కిట్టు మారడు’)
అచ్చెన్న అరెస్టును బీసీల అణచివేతగా రంగు పులుముతున్న చంద్రబాబు గారు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మర్చినట్టున్నారు. 2002లో బాలయోగి గారి దుర్మరణంతో, లోక్ సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు. ఎదిగి పోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు ‘విజనరీ’’ అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment