అమరావతి : రాష్ట్రంలో బలహీనవర్గాల వారికి ప్రభుత్వం తరపున సాయం చేస్తానని, వారంతా పార్టీకి బలంగా ఉండాలని హక్కుతో అడుగుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడిని మంగళవారం కలిసి సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తే స్వాగతించాలని మంత్రి వెల్లడించారు.
గతేడాది బ్యాంకులు సహకరించకపోవడం వల్లే బీసీలకు తగినంతగా సబ్సీడీ రుణాలు అందించలేకపోయామన్నారు. ఈ ఏడాది ఆదరణ పథకం అమలులోకి తెచ్చి బీసీలకు అవసరమైన పరికరాలు అందిస్తామని చెప్పారు. కులవృత్తులు, చేతి వృత్తులకు ఉపకరించే అదునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు బీసీలకు ఇస్తామన్నారు. బీసీలకు 12 ఫెడరేషన్‌లు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఆయా కులాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వేసవి సెలవుల్లో బీసీ హాస్టళ్లు రిపేర్లు పూర్తి చేయిస్తామని, మెనూ చార్జీలు పెంచేందుకు సీఎం అంగీకరించారని మంత్రి చెప్పారు.
సాయం పొందిన బీసీలు అండగా ఉండాలి..
Published Tue, May 2 2017 8:08 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
Advertisement
Advertisement