
సాక్షి, అమరావతి: ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారం కట్టిస్తుందని ఉన్నా ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. కడప ఉక్కు కర్మాగారానికి 2019 డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారని, త్వరలో మూడేళ్లు పూర్తికావస్తోందని.. అయినా ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. భూమి ఇచ్చిన రైతులకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.
ప్రభుత్వ తీరుతో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోతున్నాయన్నారు. అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. 480 ఎకరాల భూములిచ్చిన రైతులకు రూ.37.18 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ కట్టిస్తుందని లేదన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నం చేయొచ్చని మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment