సాక్షి, అమరావతి : తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చెన్నాయుడు, మరో టీడీపీ నేతకు మధ్య జరిగిన సంభాషణ వీడియో అది. ఆ వీడియో టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది. పార్టీ క్యాడర్‌ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని సదరు టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రీకొడుకుల తీరును ఎండగట్టాడు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. లోకేష్‌ను ఉద్దేశించి ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని అన్నారు. అనంతరం ‘పార్టీ లేదు.. బొక్క లేదు’ అంటూ ఆ టీడీపీ నేతకు వత్తాసు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment