కర్నూలు : ప్రత్యేక హోదా కోసం ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు 22సార్లు ప్రయత్నం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రాజ్యసభలో ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీతో చంద్రబాబు ప్రయత్నలు చేశారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అదేవిధంగా ఆర్థికసాయం చేస్తామంటేనే చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు.
రాష్ట‍్ర అభివృద్ధి జరగడానికి ఇంకా అధికంగా నిధులు కావాలంటే ప్రతిపక్షం సూచనలు ఇవ్వాలి కానీ... యువభేరి పేరుతో యువతను వైఎస్ జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యువభేరికి వెళ్లకుండా అడ్డుకోవాలని అచ‍్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.