Yuva bheri
-
లక్ష్యసాధనలో వెనకడుగు వేయని వైఎస్ జగన్
-
యువభేరికి ఓసీ సంఘం మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రుల హక్కుల సాధన కోసం ఈ నెల 10న అనంతపురం పట్టణంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించే యువభేరి విజయవంతం చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పించే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యం లో పెట్టుబడులు అత్యధిక శాతం వచ్చి లక్షలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వైఎస్ జగన్ నిర్వహించే ప్రత్యేక ఉద్యమానికి పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు మద్దతు ఇవ్వాలని యువభేరికి ఓసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. అత్యధిక శాతం ఓసీ విద్యార్థులు, యువత ఇందులో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రం నష్టపోతున్నా కొన్ని రాజకీయ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సమంజసం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని గగ్గోలుపెట్టిన చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశంలో ప్రత్యేక హోదాపై ఇతర రాష్ట్రాల ఎంపీలను కలుపుకొని సాధించే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
యువభేరికి చకచకా ఏర్పాట్లు
* నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన వేదిక * స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు * విద్యార్థులు, మేధావులు భారీగా తరలిరావాలని పిలుపు సాక్షి, అమరావతి బ్యూరో/ పట్నంబజారు: గుంటూరులో ఈనెల 16వ తేదీన జరిగే యువభేరి కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు. విద్యార్థులు, మేధావులు,యువకులను చైతన్యపరిచి పెద్ద ఎత్తున యువభేరికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అనంతరం యువభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అ«ధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు ఆధ్వర్యంలో పోస్టర్‌ను విడుదల చేశారు. పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ప్రత్యేకహోదా సాధనకు ఆమరణ దీక్ష చేసిన నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కనున్న స్థలాన్నే యువభేరికి వేదికగా ఎంపిక చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని వారు వివరించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షతో పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏర్పాట్లను పరిశీలించిన నేతలు... యువభేరి వేదిక వద్ద ఏర్పాట్లను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, , సలాంబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎండీ నసీర్ అహ్మద్, గుంటూరురూరల్ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరిఽ కొటే«శ్వరరావు పరిశీలించారు. పలు విభాగాల నేతలు కొత్తా చిన్నపరెడ్డి, డైమండ్ బాబు, మొట్టు వెంకట అప్పారెడ్డి, ఉప్పుటూరి నర్శిరెడ్డి, దాసరి కిరణ్, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, దుగ్గంపూడి యోగేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య, జగన్‌కోటి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు యువభేరి నేపథ్యంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్ కృషి చేస్తున్నారన్నారు. దానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తలశిల రఘురామ్ మాట్లాడుతూ యువభేరికి అంతా సన్నద్ధమైందని, 16న జగన్ గుంటూరులో జరిగే యువభేరిలో పాల్గొంటారని తెలిపారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను బలంగా వినిపించడానికి యువతను దీనిలో భాగస్వాములను చేయడానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఉపాధి కల్పన ఉంటుందని చెప్పారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ వివిధ రకాల ఒత్తిళ్ల ద్వారా తమను ఆటంకపరచడానికి ప్రయత్నించడం సరైన చర్య కాదన్నారు. జిల్లాలో ఉపాధి ఊసేలేదు.. జిల్లాలో ఉపాధి కల్పన సమస్యాత్మకంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి ఇప్పటి వరకు 51,959 మంది పట్టభద్రులు ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకోగా, వారిలో వెయ్యి మందికి మాత్రమే ప్రైవేటు ఉద్యోగాలు అందిన పరిస్థితి. ప్రతిఏటా జిల్లాలో 20వేలమంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 15వేల మంది డిగ్రీ విగ్యార్థులు, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులు మరో 80వేల మంది చదువు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి. ఇతర ప్రాంతాలకు వెళుతున్నా ఉపాధి లభించని పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తే రాయితీ ఉండటంతో పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది. -
‘యువభేరి పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు’
కర్నూలు : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 22సార్లు ప్రయత్నం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రాజ్యసభలో ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీతో చంద్రబాబు ప్రయత్నలు చేశారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అదేవిధంగా ఆర్థికసాయం చేస్తామంటేనే చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగడానికి ఇంకా అధికంగా నిధులు కావాలంటే ప్రతిపక్షం సూచనలు ఇవ్వాలి కానీ... యువభేరి పేరుతో యువతను వైఎస్ జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యువభేరికి వెళ్లకుండా అడ్డుకోవాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. -
అది చంద్రబాబు అత్తగారి సొత్తా!
-
అది చంద్రబాబు అత్తగారి సొత్తా!
‘హోదా’పై ఏలూరు యువభేరిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం - బీజేపీ, టీడీపీ ప్రజలను వంచించాయి - రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు ఎక్కడిది? - హోదా ఇవ్వకపోయినా బాబు ఢిల్లీ పెద్దల కాళ్లు వదలడం లేదు - ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయినా అరెస్టు కాని ఏకైక సీఎం చంద్రబాబే - పోరాడి హోదాను సాధించుకుందాం సాక్షి ప్రత్యేక ప్రతినిధి, ఏలూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను దారుణంగా వంచించాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెబితే.. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించడం ఏమిటని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఏమైనా చంద్రబాబు నాన్నగారి సొత్తా? అత్తగారి సొత్తా? అని నిప్పులు చెరిగారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన యువతను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రత్యేక హోదా మన హక్కు అంటూ విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించారు. ప్యాకేజీ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ప్రత్యేక హోదాపై ఎన్నికల ముందు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటలు, ఎన్నికల తర్వాత వారు మాట మార్చిన తీరును దృశ్య సహితంగా ప్రదర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు, గద్దెనెక్కా వాటిని విస్మరించిన వైనాన్ని వీడియో సహితంగా ప్రదర్శించారు. యువభేరిలో వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.... ‘‘ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా యువభేరి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ప్రత్యేక హోదా వల్ల మనకు దక్కే లాభాలేంటి, హోదా రాకపోతే జరిగే నష్టాలేంటి అనే దానిపై యువతను చైతన్యవంతులను చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికే నిరాహార దీక్షలు చేశాం. ఎంపీలు, ఎమ్మెల్యేలం అంతా ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లి, అక్కడ ధర్నా చేశాం. ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నాం. మన ప్రమేయం లేకుండా, మనకు ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ, చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. విభజనకు సహకరించారు. విభజన వల్ల నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అధికార కాంగ్రెస్ నేతలు అంటే.. అది సరిపోదు పదేళ్లు కావాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చే తామేనని, ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. ఇప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు అప్పుడు రాజ్యసభలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అన్నారు. పదేళ్లు ఏమాత్రం సరిపోదు పదిహేనేళ్లు కావాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టోలను విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. తాము పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పెద్దలు, చంద్రబాబు కలిసి ఎన్నికల ప్రచార వేదికలపై హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అనేది కచ్చితంగా సంజీవని అని ఆ రోజు పేర్కొన్నారు. హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. ఎన్నికలైపోయాక, ప్రజలతో అవసరం తీరాక ప్లేట్లు మార్చేస్తున్నారు. చంద్రబాబుకు ఇంగ్లిష్ వచ్చా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తోంది. అప్పుడు ప్రత్యేక హోదాపై కబుర్లు చెప్పిన బీజేపీ, టీడీపీ పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. వారు గద్దెనెక్కి రెండున్నరేళ్లయి పోయింది. ఇప్పటిదాకా చేసిందేమీ లేదు. సెప్టెంబరు 7వ తేదీని అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశం పెట్టారు. చంద్రబాబు కు సంబంధించిన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఎంపీలు, మంత్రులు.. జైట్లీతోపాటు ఆ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంపై 7వ తేదీ ఉదయం నుంచే విపరీతమైన డ్రామా నడిపించారు. అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నారు, బ్రహ్మాండమై ప్యాకేజీ అందజేస్తున్నారని ఉదయం నుంచి టీవీ చానళ్లన్నీ ఊదరగొట్టాయి. రాష్ట్రానికి ఇక హోదా వచ్చేస్తోందని వెయ్యి కళ్లతో ఎదురుచూశాం. చివరకు అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి ఏం చేశారంటే.. దమ్మిడీ కూడా ఇస్తామని చెప్పలేదు. పైగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. అదేరోజు అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తెరపైకి వచ్చారు. అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాను అని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టంగా చెబుతూ ఉంటే.. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, మన తరఫున పోరాటం చేయాల్సిన వ్యక్తి దాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు. అసలు ఆయనకు కాస్తోకూస్తో అయిన ఇంగ్లిష్ వస్తుందా? అని అనుమానం కలిగింది. కేంద్రం చేసిన ప్రకటనను ఎందుకు స్వాగతించారో అర్థం కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీశాం. ప్రత్యేక హోదా అనేది ఏమైనా మీ నాన్నగారి సొత్తా? అత్తగారి సొత్తా? ప్రత్యేక హోదా ఇవ్వం అని కేంద్రం చెబితే, దాన్ని స్వాగతించడానికి మీరెవరు? అని ప్రశ్నించాం. మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తుండడంతో సమాధానం చెప్పే ధైర్యం లేక చంద్రబాబు శాసన మండలికి వెళ్లారు. అక్కడ ఇంకా ఆశ్చర్యకరంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తాయి? అని వ్యంగ్యంగా మాట్లాడారు. హోదా ఉన్న ఉత్తరాఖండ్‌కు, హిమాచల్‌ప్రదేశ్‌కు ఏం మేలు జరిగింది? అని అన్నారు. ఇదే మనిషి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పదేళ్లు కాదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. ఇదే మనిషి ఎన్నికల సభల్లోనూ పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. ఇదే మనిషి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి, కేంద్రానికి పంపించారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదా వెంటనే కావాలని చెప్పారు. ఇదే మనిషి రెండున్నరేళ్ల తర్వాత మాట మార్చారు. పట్టపగలే అబద్ధాలాడారు. అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రికి ఫోన్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పారట. నిజంగా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సమంజసమేనా? హోదా వద్దట.. ప్యాకేజీ చాలట! కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మొన్నటిదాకా ప్రత్యేక హోదా అనేది సంజీవని అన్నారు. తన వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాబోతోందని ప్రకటించారు. ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా ఇస్తామని చెప్పారు. అలాంటి వెంకయ్యనాయుడు ప్లేటు మార్చారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని అరుణ్ జైట్లీ చెప్పిన తర్వాత కూడా.. చంద్రబాబు నాయుడు తన మంత్రులతో వెంకయ్య నాయుడుకి విజయవాడలో సన్మానం చేయించారు. హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదు, ప్యాకేజీ ఇచ్చారు చాలు.. థాంక్యూ అని చెప్పించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి, అరుణ్ జైట్లీకి శాలువా కప్పి, కృతజ్ఞతలు తెలిపిరావడం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఆ రోజే వేడిమీద ప్రత్యేక హోదా గురించి అడిగానని వెంకయ్య అంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత ఆ మాట చెబుతుండడం ఆశ్చర్యకరం. హోదాను మేనిఫెస్టోల్లో ఎందుకు పెట్టారు? పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నీరుగార్చేస్తున్నారు. చివరకు గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారు. ప్రత్యేక హోదా చాలా గొప్పదని మొన్నటిదాకా చెప్పిన వ్యక్తులు.. దానివల్ల ఏమైనా మేలు జరుగుతుందా? అని ఇప్పుడు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అడ్డగోలుగా మాట మారుస్తున్న ఇలాంటి నాయకులు తమవారు అని చెప్పుకోవడానికి భావితరాలు ఇష్టపడతాయా? రాజకీయాల్లో ఉన్నవారికి వ్యక్తిత్వం ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక్కమాట గుర్తుంచుకోవాలి. ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం. నిజంగా వీళ్లకు విలువలు లేవు. విశ్వసనీయతకు అర్థం అంతకన్నా తెలియదు. ఆ రోజు వేడి మీద మాట్లాడామని చెబుతున్నవారు ప్రత్యేక హోదాను ఎందుకు వారి మేనిఫెస్టోల్లో పెట్టారు? ఏపీకి హోదా ఇస్తామని ఎన్నికల సభల్లో ఎందుకు చెప్పారు? బాబు ఢిల్లీ పెద్దల కాళ్లు వదలరు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అదేమిటని ప్రశ్నించలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఏ స్థాయిలో రాజీపడిపోయారంటే.. ఢిల్లీ పెద్దలు ఏపీకి ఏమిచ్చినా, ఏమీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు, తాను మాత్రం వారి కాళ్లు వదలననే స్థితికి దిగజారారు. చంద్రబాబు తన వ్యక్తిత్వాన్ని అమ్మేసుకొని దిగజారిపోవడానికి కారణం ఏమిటంటే... ఆయన ‘ఓటుకు కోట్లు’ కేసులో భాగస్వామి కావడమే. ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సూటుకేసుల్లో నల్లధనాన్ని ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపుల్లో దొరికిపోయినా కూడా అతడు అరెస్టు కాకపోవడం, రాజీనామా చేయకపోవడం కేవలం మనదేశంలో మాత్రమే జరుగుతుందేమో! లేకపోతే కేవలం చంద్రబాబు ఒక్కరి విషయంలోనే అలా జరుగుతుందేమో నాకైతే తెలియదు. ఆయన అంత గొప్పగా వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతున్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీ రామారావుకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఓ లెక్కా! రాష్ట్ర ప్రజల జీవితాలు, భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించడం లేదు. అది ఆర్థిక సంఘం పరిధిలోని అంశం కాదు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు, బీజేపీ నాయకులు రకరకాలుగా తప్పుడు ప్రచారం ప్రారంభించారు. హోదాపై వాస్తవాలను వివరిస్తూ మేము ఒక కరపత్రం రూపొందించాం. దీన్ని చదివితే చంద్రబాబు, బీజేపీ కలిసి అడుతున్న అబద్ధాలేంటో తెలిసిపోతాయి. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, హోదా లేని రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపించడం ఆర్థిక సంఘం మానేసిందని అంటున్నారు. నిజానికి ఏ రాష్ట్రానికైనా హోదా ఇవ్వాలా? వద్దా? అనేది తేల్చడం ఆర్థిక సంఘం పరిధిలోని అంశం కాదు. కేంద్రం వసూలు చేసిన పన్నులకు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనే అంశాన్ని ఆర్థిక సంఘం పర్యవేక్షిస్తుంది. హోదా ఇవ్వకూడదని, దాన్ని రద్దు చేయాలని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు. కేబినెట్ ఆదేశాల అమలేది? ప్రత్యేక హోదాను రద్దు చేయాలంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాతపూర్వకంగా లేఖ కూడా ఇచ్చారు. అయినా బీజేపీ, టీడీపీ అబద్ధాలాడుతున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటున్నారు.. మరి ఆ ఆర్థిక సంఘం ఉండగానే 11 రాష్ట్రాలకు హోదాను ఎలా కొనసాగిస్తున్నారు? ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని మరో సాకు చెబుతున్నారు. హోదా ఇచ్చే అధికారం జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డీసీ)కే ఉంది. దానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. నీతి ఆయోగ్‌కు, కేంద్ర మంత్రి మండలికి అధ్యక్షుడు కూడా ప్రధానే. ప్రధానమంత్రి ఒక సంతకంతో చేసేది నిర్ణయం కాదా? ఇప్పటిదాకా 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారు. అవి కేబినెట్ నిర్ణయాలు కావా? 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఒక్క సంతకంతో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత 2014 మార్చి 2న కేబినెట్ సమావేశమైంది. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్లానింగ్ కమిషన్ 2014 డిసెంబర్ 31 దాకా అమల్లో ఉంది. అంటే 2014 మార్చి నుంచి డిసెంబర్ దాకా.. దాదాపు 9 నెలలు ప్లానింగ్ కమిషన్ ఉంది. కేంద్ర కేబినెట్ ఇచ్చిన ఆదేశాలు అమలు కాకుండా 9 నెలలు ప్లానింగ్ కమిషన్‌లోనే మూలుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. ఏపీకి హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయని వాదిస్తున్నారు. ఆ రోజు మన రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మిగిలిన రాష్ట్రాలు లేవా? హోదాకు మిగిలిన రాష్ట్రాలు అడ్డుతగులుతున్నాయని ఆ రోజు మీకు గుర్తుకురాలేదా? ఆ రోజు అడ్డుపడని రాష్ట్రాలు ఇప్పుడు అడ్డుపడుతున్నాయనడం సరైందేనా? అభివృద్ధి చంద్రబాబుకు కనిపించదా? ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగింది? అక్కడేం ఉద్యోగాలు వచ్చాయి? అని చంద్రబాబు శాసన మండలిలో అన్నారు. చంద్రబాబుకు ఒక్కటే చెప్పదలచుకున్నా... ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఎలాంటి అభివృద్ధి సాధించాయో, ఎన్ని రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో, అక్కడి యువతకు ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయో ఇంటర్నెట్లో శోధిస్తే పూర్తిగా తెలుస్తుంది. ఉత్తరాఖండ్‌లో ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో 30,244 పరిశ్రమలు వచ్చాయి. రూ.35 వేల కోట్ల పెట్టుబడులతో ఒకేసారి 130 శాతం అధికంగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.ఉపాధి అవకాశాలు ఏకంగా 490 శాతం పెరిగాయి. బుల్లి రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో యువతకు 2.45 లక్షల ఉద్యోగాలు లభించాయి. హోదా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో 10,864 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.15,324 కోట్ల పెట్టుడులు, 1.29 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఈ సమాచారమంతా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గతంలో పార్లమెంట్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోనే ఉంది. ఇది చంద్రబాబుకు కనిపించడం లేదా? ఆయన నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు, అంతా మోసమే. హద్దుపద్దూ లేకుండా మోసాలు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఎన్నో రకాల పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి. ఇలాంటి రాయితీలు ఉన్నప్పుడు ఎవరైనా పరుగెత్తుకొచ్చి మరీ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తారు. హోదా వల్ల లభించే ప్రయోజనాల గురించి చంద్రబాబుకు ఎందుకు తెలియడం లేదో అర్థం కావట్లేదు. కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చినన్ని పారిశ్రామిక రాయితీలను ఇతర రాష్ట్రాలకు ఇవ్వలేదని చంద్రబాబు బొంకుతున్నారు. అవేమిటో ఒక్కసారి చూస్తే.. శనక్కాయలకు, బెల్లాలకు కూడా సరిపోని పరిస్థితి. వాళ్లిచ్చింది ఏమిటంటే.. ఒకటి యాక్సిలరేటెడ్ డిఫ్రిసియేషన్ బెనిఫిట్, రెండోది మన లాభాల్లోంచి పెట్టే పెట్టుబడిని ఖర్చు కింద పరిగణిస్తామన్నారు. ఇవి చాలా గొప్పవని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రంతో కలిపి ఈ పారిశ్రామిక రాయితీలను ఇచ్చారు. ఇలా రాయితీలను చూసి ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తారా? లేక ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలకు చూసి వస్తారా? చంద్రబాబు ఒక హద్దుపద్దూ లేకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కేంద్రం చాలా గొప్ప ప్యాకేజీ ఇచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఫలానా పనులు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. పార్లమెంట్లో ఆమోదించిన చట్టం ద్వారా అవన్నీ మనకు హక్కుగా సక్రమించాయి. ఆ హక్కు కంటే ఏ కొంచెం ఎక్కువైనా ఇచ్చి, దాన్ని ప్యాకేజీ అంటే అర్థం ఉంటుంది. ఆ హక్కు ప్రకారమే ఇస్తున్నప్పుడు, అన్ని రాష్ట్రాలకు జరిగే మేళ్లే మనకూ జరుగుతున్నప్పుడు... ప్రత్యేక ప్యాకేజీ ఎలా అవుతుందో చంద్రబాబే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుకు చేసిందేమిటి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని వెంకయ్య, చంద్రబాబు అంటున్నారు. ప్యాకేజీలో ఇది బ్రహ్మాండమైన అంశమని అంటున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 90, 91లలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. దాన్ని కేంద్రమే నిర్మిస్తుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, తమ పలుకుబడి వల్లే కేంద్రం ఈ ప్రాజెక్టును చేపడుతోందని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. 2010-11 లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లతో సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. అయితే, రాష్ట్రం విడిపోక ముందు.. అంటే 2014 మార్చి 31 దాకా పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,135 కోట్లు ఇచ్చేది లేదని అరుణ్ జైట్లీ చెప్పారు. రూ.16 వేల కోట్లలో రూ.5,135 కోట్లు ఇవ్వబోము అని కేంద్రం చెబితే అది బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు అంటున్నారు. కరెంటు, డ్రింకింగ్ వాటర్ కాంపొనెంట్ కింద ఇవ్వాల్సిన రూ.2,800 కోట్లు కూడా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ లెక్కన పోలవరానికి కేంద్రం ఇచ్చేది కేవలం రూ.8 వేల కోట్లే. ఇది గొప్ప ప్యాకేజీ అని చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారు. పెట్రోలియం ప్రాజెక్టు ఎక్కడా? ఏపీకి ఐఐటీ, ఎన్ఐటీ, ఎయిమ్స్ ఇస్తున్నామని అరుణ్ జైట్లీ చెబితే చంద్రబాబు ఆహా ఓహో అంటూ పొగిడారు. నేషనల్ పాలసీ ప్రకారం కోటి జనాభా కలిగిన ప్రతి రాష్ట్రానికి అనేక జాతీయ ప్రోజెక్టులు ఉన్నాయి. కోటి జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఐఐటీ, ఎయిమ్స్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలు ఉన్నాయి. ఇవి కేంద్రం మనకు కొత్తగా ఇస్తున్నట్లు వెంకయ్య ఎల్లో మీడియాల ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. రాష్ట్రానికి రూ.2.29 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని, ఇప్పటికే రూ.1.60 లక్షల కోట్లతో పనులు జరుగుతున్నాయని వెంకయ్య అంటున్నారు. రూ.52,120 కోట్లతో పెట్రోలియం ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. వాస్తవానికి దానికి గ్రీన్ ఫీల్డ్ రిపోర్టు రాలేదు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా పెట్రోలియం ప్రాజెక్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయా? రూ.65 వేల కోట్లతో రహదారులు నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలు మాదిరిగానే మనకూ రహదారుల అభివృద్ధికి నిధులు ఇస్తారు. ఇదే ప్రత్యేక ప్యాకేజీ అంటే ఎలా? ‘హోదా’ సాధించేదాకా పోరాడుదాం... రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు గద్దెనెక్కాక మోసం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని యువతను మోసం చేశారు. ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేసే చంద్రబాబు వంటి నాయకులను నిలదీయాలి. రాష్ట్రానికి వారు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఈ రోజు కాకపోతే రేపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందాం. మనం అడగడం మానేస్తే.. పోరాటం ఆపేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. హోదా సాధించుకునే వరకూ పోరాటం కొనసాగిద్దాం. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీల అమలు కోసం ఉద్యమిద్దాం. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రమే వచ్చినప్పుడు మన హక్కు అయిన ప్రత్యేక హోదాను సాధించుకోలేమా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వారికే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇద్దాం. -
ఏలూరులో జగన్ యువభేరి
-
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా?
-
పరుగెత్తికొచ్చి పరిశ్రమలు పెడతారు
-
పరుగెత్తికొచ్చి పరిశ్రమలు పెడతారు: వైఎస్ జగన్
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుంటిసాకులు చెబుతున్నాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై గురువారం ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాలులో జరిగిన యువభేరిలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మార్చారని దుయ్యబట్టారు. హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటిస్తే స్వాగతిస్తున్నామని చంద్రబాబు చెప్పడం దారుణమని అన్నారు. నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో ఒనగూరే ప్రయోనాలను వైఎస్ జగన్ సవివరంగా వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. యువభేరి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, కింద ఫ్లోర్లో కూడా విద్యార్థులు టీవీలలో చూస్తున్నారు.. అక్కడున్న విద్యార్థులందరికీ పేరుపేరునా ఇక్కడికి వచ్చినందుకు, తోడుగా నిలుస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఆదరణ చూసిన తర్వాత.. ఇంతకన్నా పెద్ద కళ్యాణమండపం ఏలూరులో లేదా అని నానిని అడిగాను.. ఇదే పెద్దదని ఆయన చెప్పారు ఏలూరులో పోరాటం కొనసాగిస్తూ ముందడుగు వేద్దాం ప్రతిచోటా యువభేరి ద్వారా ప్రత్యేక హోదా వల్ల వచ్చే మేలేంటో చెబుతున్నాం ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం బీజేపీ, టీడీపీలు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం, పోరాడుతున్నాం ఢిల్లీ వరకు అందరం వెళ్లి ధర్నాలు చేశాం, నిరాహార దీక్షలు, ధర్నాలు, బంద్‌లు అన్నీ చేస్తున్నాం ప్రత్యేక హోదా మనకు ఎందుకింత అవసరం.. దానివల్ల జరిగే మేలేంటో పలుదఫాలుగా చెబుతున్నాం ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు మన ప్రమేయం ఏమీ లేకపోయినా ఇష్టారాజ్యంగా విడగొట్టారు అప్పుడు మనం ఒప్పుకోకపోయినా మన ఎంపీలందరినీ లోక్‌సభ నుంచి బయటకు పంపి, సస్పెండ్ చేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు ఆరోజు లోక్‌సభ నుంచి రాజ్యసభకు బిల్లును తీసుకెళ్లారు అక్కడ... రాష్ట్రాన్ని విడగొడుతున్నందుకు అన్యాయం జరుగుతోందని, హైదరాబాద్ లేకపోవడం వల్ల చదువుకున్న పిల్లలు హైదరాబాద్‌కే వెళ్తారని తెలుసని చెప్పారు. హైదరాబాద్‌లోనే 95 శాతం ఐటీ పరిశ్రమలున్నాయి, హైదరాబాద్, దాని చుట్టుపక్కలే ఉత్పాదక పరిశ్రమల్లో 70 శాతం ఉన్నాయని తెలుసని అన్నారు అందుకే దానికి బదులు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు అధికార, ప్రతిపక్షాలు ఏకమై.. రాష్ట్రాన్ని విడగొడుతూ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికలు అయిపోయాయి.. పార్లమెంటులో ఆరోజు ఓటు వేశామన్న సంగతి మర్చిపోయారు కాంగ్రెస్ వాళ్లు ఐదేళ్లు హోదా ఇస్తామంటే, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీలు ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని అన్నారు ఇదే బీజేపీ.. ఇదే అరుణ్ జైట్లీ ఆరోజు రాజ్యసభలో ప్రతిపక్ష నేత. ఇదే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలన్నారు ఇదే చంద్రబాబు ఎన్నికల సభలో పదేళ్లు కాదు, పదిహేనేళ్లు కావాలని ఊదరగొట్టారు ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఎన్నికల్లో చెప్పారు ఓట్లు వేయించుకున్న తర్వాత నాయకులు ప్లేట్లు మారుస్తున్నారు జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధ అనిపిస్తుంది అప్పుడు హోదా వల్లనే ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టిన వీళ్లే ప్లేట్లు మారుస్తున్న తీరుచూసి బాధనిపిస్తుంది రెండున్నరేళ్ల తర్వాత.. మొన్న జైట్లీ సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టారు చంద్రబాబుకు సంబంధించిన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఎంపీలు, మంత్రులు కూడా ఆయనతో ఉన్నారు ప్రెస్‌మీట్ జరుగుతోందని ఏడోతేదీ పొద్దున్న నుంచి తెగ హడావుడి, డ్రామా చేశారు చివరకు జైట్లీ మాత్రం దమ్మిడీ ఇస్తామని చెప్పలేదు గానీ, హోదా ఇవ్వబోమని చెప్పారు.. జరిగింది అది! అదేరోజు అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారు వెంటనే పిక్చర్ లోకి వచ్చారు.. నేను స్వాగతిస్తున్నాను అంటాడు నాకైతే ఆశ్చర్యం అనిపించింది. వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబితే.. ఈ మనిషికి కాస్తో కూస్తో ఇంగ్లీషు వస్తుందా అని కూడా అనిపిస్తుంది అంతటితో చంద్రబాబు ఆగలేదు.. తర్వాత అసెంబ్లీలో మేం నిలదీశం.. స్వాగతించడానికి నువ్వెవడివని అడిగాం ప్రత్యేక హోదా మీ నాయనగారి సొత్తా, మీ అత్తగారి సొత్తా అని ప్రశ్నించాం ఐదున్నర కోట్ల మంది జీవితాలు దానిమీద ఆధారపడ్డాయి మాకెవరికీ ఇష్టం లేకపోయినా నువ్వెవడివయ్యా స్వాగతించడానికని నిలదీశాం అందుకని ఇక్కడ మాట్లాడే ధైర్యం లేక శాసనమండలికి వెళ్లాడు అక్కడ ఇంకా ఆశ్చర్యంగా మాట్లాడాడు ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తాయని అడుగుతున్నాడు.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు ఏం మేలు జరిగిందన్నాడు ఇదే మనిషి రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు 15 ఏళ్లు కావాలంటాడు.. ఈయనే అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం కూడా చేసి పంపాడు తర్వాత ఇదే మనిషి రెండున్నరేళ్ల తర్వాత ప్లేటు మార్చి.. ఏం ఒరుగుతుందని పట్టపగలు అబద్ధాలు ఆడతాడు ప్రధానమంత్రికి ఫోన్ చేసి థాంక్యూ చెప్పాడు చంద్రబాబు చేస్తున్న మోసం ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఇలాంటి వ్యక్తి సీఎంగా కొనసాగడం సమంజసమా వెంకయ్య నాయుడు.. మొన్నటివరకు తనవల్లే ప్రత్యేక హోదా వస్తోందని ఊదరగొట్టాడు.. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామని చెప్పాడు అలాంటి వెంకయ్య నాయుడు.. ప్లేటు మార్చాడు. ఈయనే బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఫేస్ అని తెలిసి, ఆయనకు చంద్రబాబు నాయుడు తన మంత్రులతో విజయవాడలో సన్మానం చేయించాడు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, బ్రహ్మాండమైన ప్యాకేజి ఇచ్చారంటాడు ఇదే చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లి, జైట్లీకి శాలువా కప్పి, థాంక్యూ అని చెప్పి వచ్చాడు ఎన్నికలకు ముందు సంజీవనిగా కనిపించిన హోదా.. వీళ్లు ఇప్పుడు దానివల్ల ఏం మేలు జరుగుతుందని అంటారు వెంకయ్య నాయుడైతే.. ఆరోజు ఏదో వేడిమీద అడిగానంటారు. ఆరోజు సాయంత్రానికే మిగిలిన రాష్ట్రాల ఎంపీలు తన వద్దకు వచ్చారని, నీకేమైనా బుద్ధుందా అని అడిగారని చెబుతున్నారు వెంకయ్య వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని చాలా బాధపడ్డారట ఆ మాట రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు చెబుతున్నారు ఆరోజు హోదా సంజీవని అని చెప్పిన వెంకయ్య.. మేకకు వేలాడేవే హోదా అని అంటారు. ఎన్నికల తర్వాత ప్రజలతో పని అయిపోయిందని.. పార్లమెంటులో ఇచ్చిన హామీలను నీరుగారుస్తూ గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఏమైనా మేలు జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు.. ఇలాంటివాళ్లు నాయకులని చెప్పుకోడానికి ఎవరైనా ఇష్టపడతారా రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట మీద నిలబడే వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి ప్రత్యేక హోదాను ఢిల్లీ వాళ్లు ఇవ్వరు.. చంద్రబాబు అడగలేని, అడగని పరిస్థితి ఉంది చంద్రబాబు ఏ స్థాయిలో రాజీ పడిపోయారంటే.. ఢిల్లీ వాళ్లు ఏమిచ్చినా, ఏం ఇవ్వకపోయినా తాను మాత్రం వాళ్ల కాళ్లు వదలనంటారు వ్యక్తిత్వాన్ని అమ్మేసి.. ఈ స్థాయిలో దిగజారిపోడానికి చంద్రబాబు ఈరెండున్నరేళ్లలో ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కోవడమే కారణం ముఖ్యమంత్రి నల్లధనాన్ని సూట్ కేసుల్లో ఇస్తూ ఆడియోటేపుల్లో అడ్డంగా దొరికిపోయినా ఆయన అరెస్టు కాలేదంటే, ఆయన రాజీనామా చేయలేదంటే.. మన దేశంలో, అదికూడా చంద్రబాబు విషయంలో మాత్రమే జరుగుతుందేమో ఆయన అంత గొప్పగా వ్యవస్థలను మేనేజ్ చేయడలడు, తన స్వార్థం కోసం రాష్ట్రానికి కూడా వెన్నుపోటు పొడుస్తాడు అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచినట్లు, ప్రజలంటే చంద్రబాబుకు లెక్కలేదు ఇదే చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కావడంలేదని టీడీపీ, బీజేపీ వాళ్లు చెప్పారు 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు వ్యత్యాసం చూపించడం మానేసిందని, వాళ్లు ఇవ్వద్దన్నారని చెబుతున్నారు అసలు ఆ సంఘం పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచడంపైనే నిర్ణయం తీసుకుంటుంది ఫైనాన్స్ కమిషన్‌కు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే అధికారం లేదు రాష్ట్రాలు రుణాలు, నాన్ ప్లాన్ గ్రాంటు తీసుకోవాలంటే దానికి సంబంధించిన సూత్రాలు మాత్రమే చూస్తారు ఇంతకుముందు 32.5 శాతం పన్నులు రాష్ట్రాలకు ఇచ్చేవారు.. అందులో మన రాష్ట్రానికి 4.31 శాతం వస్తుంది పన్నుల ఆదాయంలో 42 శాతాన్ని రాష్ట్రానికి ఇవ్వాలని.. తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలకు రెవెన్యూ లోటు ఉంటే, దాన్ని పూడ్చాలని.. హోదా ఉన్నా, లేకపోయినా తాము పూడుస్తామని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. వాళ్లు చెప్పింది ఇంతే తప్ప, ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికీ ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదు ఆంధ్రరాష్ట్రంతో పాటు మరో 11 రాష్ట్రాలు దీనిద్వారా లబ్ధిపొందుతాయి. కేరళ, పశ్చిమబెంగాల్‌లకు కూడా రెవెన్యూలోటు పూడుస్తున్నారు ప్రత్యేక హోదాను రద్దుచేయాలని తాము చెప్పలేదని అభిజిత్ సేన్ కూడా చెప్పారు మరి ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతున్నా అనవసరంగా 14వ ఆర్థిక సంఘం మీద అబద్ధాలు చెప్పడం న్యాయమేనా ప్రణాళికా సంఘం రద్దయింది, నీతి ఆయోగ్ రావడం వల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని మరో అబద్ధం చెబుతున్నారు ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఉన్నది కేవలం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కే. దాని అధ్యక్షుడు ప్రధాని. ప్లానింగ్ కమిషన్‌కు, నీతి ఆయోగ్‌కు, ఎన్డీసీకి కూడా అధ్యక్షుడు ప్రధానమంత్రే అన్నింటికీ ఆయనే అయినప్పుడు.. ఆయన ఒక సంతకంతో చేసే నిర్ణయాన్ని కేబినెట్ నిర్ణయం అంటారా.. వేరే ఏమైనా అంటారా ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారు. ఉత్తరాఖండ్‌కు కేవలం వాజ్‌పేయి సంతకంతో ప్రత్యేక హోదా ఇచ్చారు అదే మాదిరిగా మన్మోహన్ సింగ్ కేబినెట్లో నిర్ణయం తీసుకుని ప్రణాళికా సంఘానికి ఆదేశాలిచ్చారు 2014 మార్చి 2న కేబినెట్ సమావేశమైంది.. అప్పుడే ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలిచ్చింది ప్లానింగ్ కమిషన్‌లో మనకు హోదా ఇవ్వాలన్న ఆదేశాలు మూలుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు కేబినెట్ ఆమోదించినా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వరా? ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్ లో 490 శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయి ఉత్తరాఖండ్ లో 2 లక్షల 45 వేల మంది, హిమచలప్రదేశ్ లో లక్షా 30 వేల మందికి ఉపాధి లభించింది ప్రత్యేక హోదాతో పరిశ్రమలకు 100 శాతం ఆదాయ పన్ను మినహాయింపు వస్తుంది 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు కూడా వస్తుంది 50 శాతం రేటుకే పరిశ్రమలకు కరెంట్ ఇస్తారు ఇలా బెనిఫిట్స్ వస్తే వేలాదిగా పరిశ్రమలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి లభించదా? పారిశ్రామిక రాయితీలతో పరుగెత్తికొచ్చి పరిశ్రమలు పెట్టరా? వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు మనహక్కు ప్రకారమే నిధులిస్తామంటే స్పెషల్ ప్యాకేజీ ఎలా అవుంది? పోరాటంతో ప్రత్యేక హోదా సాధించుకుందాం ప్రతేక హోదా పోరాటానికి మీ అందరి మద్దతు కావాలి -
‘ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు’
-
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌కు ఘన స్వాగతం
-
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. వైఎస్ జగన్‌కు పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పలేటి కల్పన, రక్షణ నిధి, మేకా ప్రతాప అప్పారావుతోపాటు నేతలు కె పార్థసారధి, జోగి రమేష్, గౌతంరెడ్డి, సామినేని ఉదయభాను, డాక్టర్ దుట్టా రామచంద్రరావు స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ జంక్షన్ వరకు వైఎస్ జగన్ భారీ ర్యాలీగా వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నేడు జరగనున్న యువ భేరిలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు. -
ఏలూరులో యువభేరికి అన్ని ఏర్పాట్లు పూర్తి
-
యువభేరి ప్రాంగణానికి చేరుకున్న వైఎస్ జగన్
-
'జగనన్నకు అండగా నిలుద్దాం'
-
'జగనన్నకు అండగా నిలుద్దాం'
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మనకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని జగ్గంపేటకు చెందిన విద్యార్థిని సాయిలక్ష్మీ స్పష్టం చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదాపై యువభేరీ పేరిట విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మీ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా తప్పకుండా రావాలని ఆమె ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా కోసం మన తరఫున పోరాడుతున్న జగనన్నకు అండగా నిలుద్దామని ఈ సందర్భంగా ప్రజలకు సాయిలక్ష్మీ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా దక్కే వరకు వెనకడుగు వేయొద్దు అంటూ ప్రజలకు సాయిలక్ష్మీ సూచించారు. -
’ప్రత్యేక హోదా ఏపీ హక్కు’
-
వైఎస్ జగన్ యువభేరీ 27కు వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న కాకినాడలో చేపట్టిన యువభేరీ కార్యక్రమంలో స్వల్ప మార్పు జరిగింది. ఈ కార్యక్రమాన్ని 27న నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. యువభేరీ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ కోరింది. -
ఈనెల 21న కాకినాడలో యువభేరి
-
కాకినాడలో వైఎస్ జగన్ యువభేరి
హైదరాబాద్: ఈ నెల చివరి వారంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం కాకినాడలో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నేతలతో సోమవారం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లా సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించినట్టు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. లక్షలాది ఎకరాల్లో పండిన పంటకు మద్దతు ధర లేదన్నారు. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, నిధుల లేమితో స్థానిక సంస్థలు సతమతమవుతున్నాయని చెప్పారు. పార్టీని మరింత పటిష్ఠపరిచేందుకు కృషి చేయాలని జిల్లా నేతలకు వైఎస్ జగన్ సూచించారన్నారు. -
కాకినాడలో వైఎస్ జగన్ యువభేరి
-
'యువభేరి' ప్రొఫెసర్లపై కక్ష సాధింపు
విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విద్యార్థులతో కలసి నినదించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లపై ప్రభుత్వం కక్షసాధింపునకు దిగుతోంది. విశ్వవిద్యాలయం విద్యార్థులు విశాఖపట్నంలో నిర్వహించిన యువభేరీ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్లుగానే ఏయూ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. యువభేరీ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి(కంప్యూటర్ సైన్స్), అబ్బులు(సివిల్ ఇంజినీరింగ్)లకు ఏయూ రిజిస్ట్రార్ సోమవారం విశ్వవిద్యాలయ నిబంధనలు 3(బి) చాప్టర్ 4లోని సెక్షన్ 6 కింద షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యువభేరీ సదస్సులో ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సాయంత్రం పని వేళలు ముగిసిన తర్వాత ఆఫీసు సిబ్బంది నోటీసులతో ఆయా విభాగాలకు వెళ్లారు. అయితే ప్రసాదరెడ్డి సెలవులో ఉండగా, పనివేళలు ముగియడంతో అబ్బులు వెళ్లిపోయారు. దాంతో ఆయా విభాగాధిపతులకు ఇవ్వాల్సిన నోటీసుల కాపీలను అందించారు. విభజించి సాధిస్తున్న ప్రభుత్వం విభజించు పాలించు అన్న సూత్రం ప్రకారం ప్రభుత్వం ప్రొఫెసర్లను సాధిస్తోంది. ఏయూ విద్యార్థులు ఆహ్వానించడంతో ఐదుగురు ప్రొఫెసర్లు యువభేరీ సదస్సుకు హాజరయ్యారు. కానీ వారిలో పాండురంగారావు, శ్రీనివాసరావు, నారాయణ లను ఏయూ అధికారులు పిలిపించి బెదిరించినట్లు సమాచారం. వారికి ఎలాంటి నోటీసులు అందకుండానే స్వచ్ఛందంగా వివరణ ఇచ్చినట్లు అధికారులు కథ నడిపించారు. మిగిలిన ఇద్దరు ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులులపై కక్ష సాధింపునకు దిగారు. సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నం రానున్నారు. ఆయన మెప్పు పొందేందుకే అంత హడావుడిగా పనివేళలు ముగిసిన తర్వాత నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చినట్లే: రిజిస్ట్రార్ ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులులకు నోటీసులు జారీ చేశాం. వారిద్దరూ అందుబాటులో లేకపోవడంతో విభాగాధిపతులకు ఇవ్వాల్సిన నోటీసుల కాపీలు ఇచ్చాం. వారు ఇచ్చే వివరణను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. -
బూమ‘రాంగ్’ అవుతుందేమో..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్టు ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తే అది భవిష్యత్‌లో మరిన్ని చిక్కులకు దారి తీస్తుందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నారు. విశాఖలో ఏయూ విద్యార్థులు నిర్వహించిన ‘యువభేరి’ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై మంత్రి అభీష్టం మేరకు చర్యలు తీసుకోవడం నిబంధనల ప్రకారం కుదరదని అంటున్నారు. యూజీసీ నిబంధనలను ఏమాత్రం అతిక్రమించని ప్రసాదరెడ్డిపై చర్య తీసుకుంటే అది బూమ‘రాంగ్’ అయి తమకే ఎదురుతిరుగుతుందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఏయూ అధికారవర్గాల్లో విస్మయం... ఢిల్లీలో ఉన్న ఏయూ వీసీ జీఎస్ఎన్ రాజుకు మంత్రి గంటా బుధవారం ఫోన్ చేసి ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వీసీ జీఎస్ఎన్ రాజు ఇరకాటంలో పడ్డారు. దాన్నుంచి తప్పించుకోవడానికి రిజిస్ట్రార్ రామ్మోహన్‌రావుకు వీసీ గురువారం ఫోన్ చేసి ప్రసాదరెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వీసీ జోక్యం చేసుకోకుండా తన ద్వారా మంత్రి ఆదేశాలను అమలు చేయిద్దామని చూస్తున్నారని రిజిస్ట్రార్ రామ్మోహన్రావు భావిస్తున్నారు. అందుకే వీసీ శుక్రవారం విశాఖపట్నం వచ్చేవరకూ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మంత్రిది అవగాహనరాహిత్యం... ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి యూజీసీ నిబంధనలను ఉల్లఘించినట్లు కాదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాసంబంధమైన సదస్సుల్లో పాల్గొనే వెసులుబాటు ప్రొఫెసర్లకు ఉందని వారు స్పష్టం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై చర్యలకు ఆదేశించిన మంత్రి గంటాది అవగాహనరాహిత్యమని వారు అన్నారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీమనోహర్ జోషి అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉంటూనే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యేవారని, అప్పటి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రసంగించేవారని ఉదాహరించారు. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి ప్రాణప్రదం అయిన ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి చర్చించడానికి విద్యార్థులు నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించడంలో ప్రసాదరెడ్డి నిబంధనలు ఉల్లంఘించినట్లుకాదనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యాశాఖ మంత్రికి విశ్వవిద్యాలయాలపై నేరుగా ఎలాంటి అధికారం ఉండదు. ఆయన వీసీలకు ఆదేశాలు జారీ చేయలేరని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యూజీసీ నిబంధనలను ఉల్లంఘించ లేదు: ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి ‘‘నేను 27ఏళ్లుగా ఏయూలో పనిచేస్తున్నాను. రిజిస్ట్రార్‌గా, రెక్టార్‌గా కీలక అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో పనిచేసిన నాకు యూజీసీ నిబంధనలపై పూర్తి అవగాహన ఉంది. ప్రొఫెసర్‌గా ప్రజోపయోగ అంశాలు, ‘పాలిటీ’పై ప్రభుత్వానికి, సమాజానికి సూచనలు చేసే బాధ్యత, హక్కులు నాకు ఉన్నాయి. యువభేరి సదస్సులో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. ప్రత్యేక హోదా సాధిస్తే విద్యార్థులకు, యువతకు ఎంత ప్రయోజనం కలుగుతుందో వివరించాను. నేను చేసిన సూచనలు పాటిస్తే, హోదా వస్తే ఈ ప్రభుత్వానికే మంచిపేరు వస్తుంది...’’ -
మీ వెంటే మేముంటాం
‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’... అది సాధించుకునేంత వరకూ మీ వెంటే ఉంటాం... ఈ ఉద్యమంలో ఏ పిలుపు ఇచ్చినా సైన్యంలా ఉరుకుతాం... ఉప్పెనలా కదులుతాం.. మడమ తిప్పని పోరాటం చేస్తాం’ అంటూ విద్యార్థిలోకం నినదించింది. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో మంగళవారం జరిగిన యువభేరిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్‌తో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పలువురు విద్యార్థులు తమ మనోభావాలను పంచుకున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానాలిస్తూ దిశానిర్దేశం చేశారు. ఆ ముఖాముఖి ఇలా జరిగింది... - సాక్షి, విశాఖపట్నం ⇒ హోదా కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధం ⇒ పోరాటంలో మీకు అండగా ఉంటాం ⇒ ఉద్యోగాలొస్తాయని బాబుకు ఓటేశాం ⇒ ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతీ లేదు ⇒ జగన్‌తో ముఖాముఖిలో విద్యార్థులు ⇒ హోదా ఆవశ్యకత వివరించిన విపక్ష నేత మా తరఫున మీరు ప్రశ్నించండి... రాజేష్: వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా నేను డిప్లొమా ఇన్ మెకానికల్ పూర్తి చేసి మూడు సంవత్సరాలవుతోంది.టెన్త్‌లో 92 శాతం, డిప్లొ మాలో 86 శాతం మార్కులొచ్చాయి. ఇప్పటి వరకూ జాబ్ లేదు సార్. రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెబితే గుడ్డిగా నమ్మి తెలుగుదేశానికి ఓటేశాను. ఈ రోజుకూ రూపాయి కూడా ఇవ్వలేదు సార్. మా నాన్న చనిపోయారు. మా అమ్మ ఇంట్లో టిఫిన్ బడ్డీ నడిపిస్తున్నారు. నా సోదరుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తన చదువుకూ చేస్తున్న పనికీ సంబంధం లేదు. వైఎస్ జగన్: ఎన్నికల సమయంలో ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అంటూ తెలుగుదేశం వారు టీవీల్లో పదేపదే చెప్పించారు. ఆ మోసపూరిత మాటలతో ఓట్లేయించుకుని ఉద్యోగాలపై ఆశలను పెట్టుకున్నవారిని బాబు గాలికి వదిలేశాడు. రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తాననే హామీ కూడా ఇచ్చాడు. ఉద్యోగమూ ఇవ్వడు, భృతి కూడా ఇవ్వడు. రాజేష్: రూ.రెండు వేలు అక్కర్లేదు. నెలకు రెండొందలు ఇచ్చినా మాకు ఆనందమే. మా తరఫున ప్రశ్నించండి సార్... జగన్: ప్రత్యేక హోదా నిజంగానే సంజీవని రాజేష్. ప్రత్యేక హోదా వస్తే నో వేకెన్సీ బోర్డు మనకు కన్పించదు. లెక్కలేనన్ని అవకాశాలు మన ముంగిట ఉంటాయి. కాబట్టీ ప్రత్యేక హోదా కోసం అందరం పోరాడదాం. మేం రాజకీయాల్లోకి రావొచ్చంటారా? ప్రశాంత్: నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది. అయితే అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా వంటివారి మాటలు వింటుంటే...కౌరవసభే గుర్తొస్తోంది సార్. ఇలాంటప్పుడు రాజకీయాల్లోకి రావొచ్చంటారా? జగన్: మనం ఈ తరం వాళ్లం. రాజకీయాల్లోని కుళ్లూకుతంత్రాలను పూర్తిగా కడిగేసే శక్తి ఉన్నవాళ్లం. రాజకీయాల్లోకి మంచివాళ్లు రావాలి. నీలాంటి వాళ్లకు మంచి జరుగుతుంది. సిగ్గుమాలిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి సామిరెడ్డి లక్ష్మణనాయుడు: వైన్‌షాపులో గుమాస్తాగా పనిచేస్తూ డిగ్రీ చదువుతున్నా. ఆ పని కూడా లేకుండా చేశారు. వైన్‌షాపులు కూడా మేమే నడుపుతాం, రోడ్డు మీద చెత్త కూడా మా ఎమ్మెల్యేలు, ఎంపీలే ఊడ్చేసుకొంటారన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. హోదా కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు మా ముందు ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. కేంద్రంలో కొనసాగుతున్న సిగ్గుమాలిన మంత్రులు రాజీనామా చేయాలి. జగన్: మనం ఒత్తిడి తీసుకొస్తే కచ్చితంగా బాబు దిగిరాక తప్పదు. తన కేంద్రమంత్రులను ఉపసంహరించక తప్పదు. అదే జరిగితే బీజేపీ కూడా దిగివచ్చి ప్రత్యేక హోదా ఇస్తుంది. మీరు సీఎం అయ్యి మరింత మంచి చేయాలి... అమ్నాఖాన్, ఏక్యూజే కాలేజ్ విద్యార్థిని: ప్రత్యేక హోదా వల్ల మహిళా సాధికారతకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ వైఎస్సార్ వల్ల వచ్చింది. దాని వల్ల వారి జీవనగతులు మారాయి. భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి అయ్యి పేద, వెనుకబడిన వారికి మంచి కార్యక్రమాలను చేపడతారని ఆశిస్తున్నాం. జగన్: ఒక వర్గం అని కాదు... ప్రత్యేక హోదా వస్తే రాష్ర్టమంతా బాగుపడుతుంది. ఓసీలకు లబ్ధి చేకూరుస్తుందా? వరలక్ష్మి: ఓసీల్లో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు. ప్రత్యేకహోదా వల్ల వారికి ఏమైనా లబ్ధికలుగుతుందా? జగన్: ప్రత్యేక హోదాతో రాష్ట్రంలో అందరికీ మేలు జరుగుతుంది. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. పోరాటానికి సిద్ధం కరుణాంజలి: ఇంతగా పోరాడుతున్నా హోదా వస్తుందంటారా? హోదా కోసం మమ్మల్ని ఏం చేయమంటారు? జగన్: చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు.. దేశంలోని అధికార, ప్రతిపక్షాలు ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజనతో మనకు అన్యాయం చేస్తున్నామని తెలిసి ప్రత్యేక హోదా ఇస్తామని మాట చెప్పిన తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇప్పుడు ఆ విషయంలో మోసం చేస్తున్నారు. దీనిపై కేంద్రాన్ని అడగాల్సిన మన ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకురావడం లేదు. మనమంతా ఆయనపై ఒత్తిడి పెంచాలి.. అప్పుడు ఆయన కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటే బీజేపీపై కూడా ఒత్తిడి పెరిగి ప్రత్యేక హోదా వస్తుంది. అందుకోసం పోరాడదాం. ఇక్కడి సివిల్ ఇంజనీర్లపై బాబుకు చిన్నచూపు ఎందుకు? సుబ్బారెడ్డి: నేను సివిల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. రాజధాని అమరావతి నిర్మాణంలో మన స్టేట్ సివిల్ ఇంజనీర్లను కాదని.. జపాన్, సింగపూర్, మలేిసియా సివిల్ ఇంజనీర్ల వెంటపడుతున్నారు. అంటే స్టేట్ సివిల్ ఇంజనీర్లు ఎందుకూ పనికిరారా? ఇక్కడ చదవద్దని చెబుతున్నారా? జగన్: చంద్రబాబు ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తే గట్టిగా అడగండి. అదే మాట గట్టిగా నిలదీయండి. బాబుకు మా మేలు పట్టదా? తేజ: హుద్‌హుద్ తుపాన్ బాధితులకు అన్నీ చేశారని బాబు చెబుతున్నాడు.. ఏం చేశాడో మాకు తెలియదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి దయ వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో మా తమ్ముడు కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఈ రోజు విప్రోలో పనిచేస్తున్నాడు. మా అమ్మకు రెండుసార్లు ఒక్క రూపాయి కూడా లేకుండా కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఇలా ప్రతీ ఒక్క కుటుంబానికి మేలు జరగాలంటే నువ్వు సీఎం కావాలన్నా. జగన్: మోసపూరిత మాటలు చెప్పడంలో చంద్రబాబు నేర్పరి. సాఫ్ట్వేర్ నేనే తీసుకొచ్చా. సెల్ఫోన్లు నేనే తీసుకొచ్చా.. హైదరాబాద్ నేనే కట్టా... అంటూ చెబుతుంటాడు. అసెంబ్లీలో కూర్చోబెట్టి మరీ ఈ సోదేస్తాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు సాఫ్ట్వేర్ రంగంలో మన రాష్ర్టం ఐదో స్థానంలో ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన 2003-04 నాటికి ఆ స్థానం మెరుగయ్యింది లేదు.. అదే స్థానంలో ఉంది. సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం... రాజశేఖర రెడ్డి గారు మరణించిన 2009-10 సంవత్సరానికి ఐటీలో మూడో స్థానానికి ఎగబాకాం. చంద్రబాబు హయాంలో భారతదేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఏపీ వాటా 8.66 శాతం ఉంటే, రాజశేఖరరెడ్డి హయాంలో అది 14.93 శాతానికి ఎగబాకింది. చంద్రబాబు దిగే నాటికి 909 కంపెనీలుంటే.. రాజశేఖరరెడ్డి చనిపోయే ముందు 1,584 కంపెనీలున్నాయి. ఐటీ ఉద్యోగుల విషయానికి వస్తే చంద్రబాబు దిగే నాటికి 85,945 మంది, రాజశేఖరరెడ్డి హయాంలో 2,64,375 మంది ఏపీ యువతీయువకులకు ఉద్యోగాలొచ్చినట్టుగా సర్వే చెబుతోంది. ఈ వాస్తవాలను పక్కనపెట్టి, చంద్రబాబు మాత్రం ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ అనే భ్రమలో గోబెల్స్ ప్రచారం చేస్తాడు. -
హోదా.. సంజీవనే
* హోదా వస్తే నంబర్-1 * విశాఖ యువభేరిలో వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా... విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలన్నా ప్రత్యేక హోదా సాధించి తీరాలని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి... విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, యువతపాలిట ప్రత్యేక హోదా సంజీవనిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ‘‘ప్రత్యేక హోదా మన హక్కు... అది ఎవరో వేసే భిక్షం కాదు. హోదా వస్తే రాష్ట్రం ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పనిలేదు, దేశంలోనే నెంబర్ 1గా నిలుస్తాం. అందుకే అందరం సమష్టిగా పోరాడి ప్రత్యేక హోదా సాధిద్దాం’’అని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు భయపడి ప్రత్యేక హోదాను ఫణంగా పెడుతున్నారని... విద్యార్థులు, యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన యువభేరి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ‘నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్య, ఉపాధి అవకాశాలు - రాష్ట్ర భవిష్యత్తు’ అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ముందుగా ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ పీవీజీడీ ప్రసాదరెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. ప్రొఫెసర్లు జేమ్స్ స్టీఫెన్, చందూలాల్, అబ్బులు, శ్రీనివాసరావు, మన్మథరావు, రీసెర్చ్‌స్కాలర్ మోహన్‌బాబు, విద్యార్థి నేతలు తదితరులు ప్రసంగించారు. అనంతరం మాట్లాడిన వై.ఎస్.జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే ... హోదాపై మోసం చేసిన బీజేపీ, టీడీపీ... ప్రత్యేకహోదాకోసం మేం చేసిన ధర్నాల వల్ల దానిగురించి అందరికీ కాస్తో కూస్తో అవగాహన వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులకు ఇప్పటికీ ప్రత్యేకహోదా అంటే ఏమిటో తెలియని దౌర్భాగ్యపరిస్థితి. ఇక ముఖ్యమంత్రికి ప్రత్యేకహోదా అంటే ఏంటో తెలిసినా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకహోదా ఏ పరిస్థితుల్లో ఇచ్చారన్నది ఒక్కసారి మనం పరిశీలిస్తే.... 2014 మార్చిలో మన అభీష్టానికి వ్యతిరేకంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. ఐటీ రంగంలో 95శాతం ఉద్యోగాలు, ఉత్పత్తి రంగంలో 70శాతం పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అటువంటి హైదరాబాద్ నగరం పక్కకు వెళ్లిపోతే మన ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మనకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామని బీజేపీ, తెస్తామని చంద్రబాబు ఎన్నికల్లో ప్రతి చోటా మాట్లాడారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగమంటూ ఊరూరా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారు. బాబు ఇచ్చిన డబ్బు వడ్డీలకు సరిపోక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రెండు రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. విద్యార్థులకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు చంద్రబాబు ఏ రోజూ విద్యార్థుల గురించి, వారికి ఉద్యోగాల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఆయన 2002-03లో ‘ప్రైవేటైజేషన్ ఆఫ్ సక్సెస్ స్టోరీ ఇన్ఆంధ్ర ప్రదేశ్’ అని పుస్తకం వేశారు. దాదాపు 42 ప్రభుత్వ సంస్థలను మూసేశామని అందులో గొప్పగా చెప్పుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే రూ.రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ఘనంగా చెప్పారు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లున్నాయి, 1,48,822 ఉద్యోగాలు ఉన్నాయని విభజన సమయంలో లెక్కగట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. కొత్త ఉద్యోగాలు ఇచ్చేమాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతున్నారు. ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు ఐదువేలమంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జాబులు పోగొట్టుకున్నారు. గత సంవత్సరం అక్టోబరులో డీఎస్సీ పరీక్షలు నిర్వహించినా 10వేలమందిలో ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ఉన్న స్కూళ్లను, హాస్టళ్లను తగ్గించి... ఏడువేల మిగులు ఉద్యోగాలు ఉన్నాయని రోజుకొక పేపర్ లీకు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న విశాఖపట్నంలోనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టళ్ల సమస్యలపై ధర్నా చేస్తున్న విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా ఈడ్చేసి, వ్యాన్లలో తీసుకెళ్లారు. రాష్ట్రంలో లక్షా 48వేల ఖాళీలున్నాయి. వాటికోసం గ్రామాల నుంచి వచ్చి పిల్లలు హాస్టళ్లలో ఉండి ఫీజులు కట్టుకుంటూ కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. యూనివర్సిటీల్లో టీచింగ్ స్టాఫ్ లేరు. ఐదువేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోరు. కారణం ఆ యూనివర్సిటీలు దివాళా తీయాలి... అక్కడ ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకురావాలి. ప్రైవేటు యూనివర్సిటీలు వస్తే అక్కడ కన్వీనర్ కోటా ఉండదు. కన్వీనర్ కోటా ఉండకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే ఉండదు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే లేకపోతే గవర్నమెంట్‌కు చాలా డబ్బులు మిగులుతాయన్న దిక్కుమాలిన ఆలోచన. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు కనిపిస్తే గట్టిగా అడగండి. అయ్యా... ప్రైవేటు యూనివర్సిటీకి భూములు ఫ్రీగా ఇస్తారు, అవకాశం ఉంటే డబ్బులూ ఇస్తారు. కానీ వాటిల్లో లోకల్ కోటా కింద ఇంతమంది పిల్లలను తీసుకోండి అని అడుగుతున్నారా? అని నిలదీయండి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చదువుకున్న ప్రతి పిల్లాడికి సంజీవనిగా కనిపించేది ప్రత్యేక హోదా. కేసులకు భయపడి హోదా తాకట్టు: ప్రత్యేక హోదావల్ల ప్రధానంగా రెండు లాభాలున్నాయి. ఒకటి రాష్ట్రానికి కేంద్రం 90శాతం నిధులు గ్రాంటుగా ఇస్తుంది. కేవలం 10శాతం లోన్‌గా ఉంటుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రమైతే 30శాతం మాత్రమే గ్రాంటు, 70శాతం లోన్‌గా ఇస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం 100శాతం ఎక్సైజ్ సుంకం, ఆదాయపన్నులో రాయితీలు ఇస్తుంది. ఇటువంటి రాయితీలిస్తే పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారు, పరిశ్రమలు పెడతారు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు పట్టించుకోరు, ప్రత్యేకహోదాకోసం పోరాటం చేయరు. ఎందుకంటే... ఓటుకు కోట్లు కుంభకోణం. ఏపీలో తీసుకున్న లంచాల సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ వీడియో ఆడియో టేపుల్లో పట్టుబడటం మనమంతా చూశాం. తెలంగాణలో ఎమ్మెల్సీలను గెలవాలన్న తపనతో 18మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5కోట్లు నుంచి రూ. 20కోట్లు ఎర చూపించి అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసులనుంచి బయటపడేందుకు బీజేపీకి సాగిలపడుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రంలోని తన మంత్రులను ఉపసంహరించుకుంటానని హెచ్చరించలేకపోతున్నారు. కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చేట్లుగా లేదని, అదేమీ సంజీవని కాదని ప్లేటు మారుస్తున్నారు. ప్రత్యేకహోదాకంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని కొత్తపాట పాడుతున్నారు. విభజన చట్టంలో మనకు ఇస్తామని చెప్పిన పోలవరం ప్రాజెక్టు, యూనివర్సిటీలు, కాలేజీలు, రోడ్లు, కారిడార్లు... అన్నింటినీ కలిపి కేంద్రం కొత్తగా ప్యాక్ చేసి ప్రత్యేకప్యాకేజీగా ఇస్తామంటోంది. ఇవన్నీ మనకు హక్కుగా వచ్చేవే కదా... ఇక మీరు కొత్తగా తెచ్చేదేమిటని చంద్రబాబును ప్రశ్నించండి. అప్పట్లో ఇదే చంద్రబాబు సోనియాగాంధీతో కలిసి నామీద కేసులు పెట్టారు. అయినా నేను భయపడలేదు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని గట్టిగా పోరాడాను. కానీ చంద్రబాబు కేసులకు భయపడి ప్రత్యేకహోదాను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు. అయ్యా చంద్రబాబూ... ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న, ఉద్యోగాల కోసం చూస్తున్న పిల్లలందరూ మనవైపు చూస్తున్నారు. కేసులకు భయపడి రాష్ట్రాన్ని పణంగా పెడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. వరల్డ్‌బ్యాంకు ర్యాంకింగ్ పేరిట దగా ప్రపంచబ్యాంకు మనకు నెంబర్ 2 రేటింగ్ ఇచ్చారని చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్, కేపీఎన్జీ అనే సంస్థ, సీఐఐ, వరల్డ్‌బ్యాంకు వాళ్లు కలిసి తయారు చేసిన ఆ రిపోర్టులో రెండో స్థానం ఎలా వచ్చిందో తెలుసుకుంటే చంద్రబాబు ఎంత చక్కగా మోసం చేస్తారో తెలుస్తుంది. ఉత్పత్తి రంగంలో చైనా 43శాతం, తైవాన్ 35శాతం, ఇండోనేషియా 26శాతం, మలేషియా 25శాతం ఉండగా మనదేశం 16శాతం మాత్రమే ఉంది. అందుకే ఉత్పత్తిరంగంలో మిగతా దేశాలతో పోటీ పడాలని ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను పిలిచి 98 పాయింట్లు ఇచ్చారు. వాటిని ఏ రాష్ట్రం ఎంత త్వరగా అమలు చేస్తుందో చెప్పమన్నారు. ఆ 98 పాయింట్లు చూసి చాలామంది ముఖ్యమంత్రులు భయపడ్డారు. ఎందుకంటే అందులో ఉన్నవి ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్. పనిచేసే వాళ్లను నిర్దాక్షిణ్యంగా తీసే అధికారం కంపెనీలకు ఇచ్చేశారు. యూనియన్లు ఉండకూడదంటూ అన్యాయమైన షరతులు పెట్టారు. అందుకే వాటిపై సంతకాలు చేస్తే ప్రజలు ఆగ్రహిస్తారని ముఖ్యమంత్రులు భయపడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ సంతకాలు పెట్టేశారు. అందుకే వరల్డ్‌బ్యాంకు ఆయనకు రెండోస్థానం ఇచ్చింది. సంతకాలు పెట్టని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలను పదో స్థానంలోనో, పన్నెండో స్థానంలోనో పెట్టింది. ఈ విషయాలన్నీ దాచి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. పత్యేకహోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రే! ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల గురించి చంద్రబాబు, ఆయన మంత్రులు, కేంద్రమంత్రులు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు, అబద్ధాలు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రకటించాక అప్పటి యూపీఏ కేబినెట్ సమావేశమై ప్లానింగ్ కమిషన్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయినా ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు ఒప్పుకోవడం లేదని, 14వ ఆర్థికసంఘం ఒప్పుకోవడం లేదని సాకులు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించిన రోజున ఈ రాష్ట్రాలు లేవా? అని చంద్రబాబును నిలదీయండి. మేం చదువుకున్నవాళ్లం... ప్రత్యేకహోదా ఇచ్చేది ఆర్థిక సంఘం కాదనే విషయం మాకు తెలుసునని గట్టిగా చెప్పండి. ప్రత్యేక హోదా అన్న అంశం పూర్తిగా కేబినెట్ నిర్ణయం. జాతీయ అభివృద్ధి మండలికి, నీతి అయోగ్‌కు, కేంద్ర మంత్రివర్గానికి అధ్యక్షుడు ప్రధానమంత్రే. ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది కూడా ప్రధానమంత్రే. ప్రత్యేక హోదా వస్తే మనమే నెంబర్-1 ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలకు ఉత్తరాఖండ్ ప్రత్యక్ష ఉదాహరణ. ప్రత్యేక హోదా ఇవ్వడంవల్ల ఆ రాష్ట్రంలో రెండువేల పరిశ్రమలు వచ్చాయి. రూ. 33వేల కోట్ల పెట్టుబడులు వచ్చి ఒకేసారి 110శాతం పరిశ్రమలు ఏర్పాటు కావడంవల్ల ఉపాధి అవకాశాలు 490శాతం పెరిగాయి. ప్రత్యేక హోదావల్ల హిమాచల్‌ప్రదేశ్‌లో ఏకంగా 10వేల పరిశ్రమలు వచ్చాయి. మన రాష్ట్రంలో 972 కి.మీ. సముద్ర తీరం ఉంది. మనకు ప్రత్యేక హోదా ఇస్తే ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కం ట్యాక్స్, ఫ్రైట్ చార్జీల బెనిఫిట్ వల్ల మనకు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి లక్షల ఉద్యోగాలు వచ్చి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. రాష్ట్రం ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పని లేదు, నెంబర్ 1గా నిలుస్తుంది. అందుకే అందరం కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాడాలి. ప్రత్యేక హోదా గురించి మంగళగిరిలో రెండురోజులు నిరాహారదీక్ష చేశాం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేశాం. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశాం. చివరకు ఈనెల 26 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు కూడా కూర్చోబోతున్నాం. కానీ ప్రత్యేక హోదా ఒక్క జగన్‌వల్ల అయ్యేది కాదు. జగన్‌కు తోడుగా మీరందరూ కలసి నిలబడితేనే అది సాధ్యమవుతుంది. విశాఖపట్నంలో యువభేరీ సదస్సును అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులతో బెదిరించినా మీరంతా బేఖాతరు చేస్తూ పెద్ద సంఖ్యలో వచ్చారు. అదే స్ఫూర్తితో అందరం కలసి కట్టుగా పోరాడదాం. ప్రత్యేక హోదా సాధిద్దాం. -
మేం రాజకీయాల్లోకి రావాలా.. వద్దా?
-
ప్రత్యేకహోదాపై విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి
-
ప్రత్యేక హోదాయే సంజీవని: వైఎస్ జగన్
-
హోదా వస్తుందన్న నమ్మకం ఉందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కరుణాంజలి: మనం ఎంత పోరాటం చేసినా రాష్ట్రం సమైక్యంగా ఉండలేదు. ఇది వస్తుందన్న నమ్మకం ఉందా? వైఎస్ జగన్: పొట్టి శ్రీరాములు దీక్ష చేశారు కాబట్టే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ తర్వాత నాయకులంతా కలిసి నాశనం చేసి రాష్ట్రాన్ని విడగొట్టారు. మనం పోరాడేది వాళ్ల నుంచి భిక్షం అడుక్కోడానికి కాదు, ఇది మన హక్కు. అడగాల్సిన మన సీఎం ఒత్తిడి తేవడం లేదు. ఆయన ఒత్తిడి తేవాలంటే.. మనమంతా కలిసి ఆయనమీద ఒత్తిడి తేవాలి. కచ్చితంగా ఇది వస్తుందన్న నమ్మకం నాకుంది. -
రాష్ట్రంలో ఉన్న పిల్లలు బాగుపడొద్దా?
-
ఓసీలలో పేదల గురించి ఆలోచిస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వరలక్ష్మి: ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అందరికీ అన్నీ చేస్తామంటున్నారు. నేను ఓసీ. మా నాన్నగారు లేరు. ఓసీలలో కూడా చాలా పేదవాళ్లున్నారు. వాళ్ల గురించి ఆలోచించండి వైఎస్ జగన్: ప్రత్యేక హోదా వల్ల కులాలవారీ ప్రయోజనం ఉండదు.. అయితే ఒక్కటి చెబుతున్నా. ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత లక్షల కోట్లతో వాళ్లు వస్తే.. లక్షల ఉద్యోగాలు వస్తే ఆప్షన్ మనకే ఉంటుంది. చదువుల్లో పర్సంటేజి బాగుంటే కచ్చితంగా మంచి జరుగుతుంది. -
మేము ఎందుకూ పనికిరామా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సుబ్బారెడ్డి: అమరావతి నిర్మాణం జరుగుతోంది.. అక్కడ మన రాష్ట్ర సివిల్ ఇంజనీర్లను కాదని విదేశాలకు వెళ్తున్నారు. అంటే మేం ఎందుకూ పనికిరామా, మేం ఈ రాష్ట్రంలో చదవడం తప్పా.. గాంధీగారు చెడు వినద్దు, చెడు మాట్లాడొద్దు అంటే చంద్రబాబు ప్రత్యేక హోదా అనద్దు, వినొద్దు అంటున్నారు. వైఎస్ జగన్: చంద్రబాబు ఈసారి కనపడినప్పుడు ఇదే మాట గట్టిగా అడుగు. -
మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆమ్నా ఖాన్: ప్రత్యేక హోదా వస్తే మహిళలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? వైఎస్ఆర్ పుణ్యం వల్ల ముస్లింలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఇవి మరింతకాలం కొనసాగితే మేం కూడా ముందుకు రాగలం. వైఎస్ జగన్: ప్రత్యేక హోదా వల్ల కులాలవారీ ప్రయోజనం ఉండదు గానీ, రాష్ట్రమంతా బాగుపడుతుంది. -
హోదా వస్తుందన్న నమ్మకం ఉందా?
-
ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికీ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. లక్ష్మునాయుడు: నేను డిగ్రీ సెకండియర్ అయిపోయింది. చదువుకోడానికి కూడా డబ్బులేక వైన్ షాపుల్లో గుమాస్తాగా పనిచేస్తున్నాం. ఆ షాపులు కూడా మాకు లేకుండా.. ప్రభుత్వమే నడిపిస్తామంటోంది. ఎమ్మెల్యేలు, మంత్రులే తీసుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం మేం ప్రాణత్యాగానికి కూడా సిద్ధం. కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఈ హోదా కోసం ముందుకు రావాలి వైఎస్ జగన్: మనం ఒత్తిడి తెస్తే చంద్రబాబు కిందకు దిగిరాక తప్పదు, మంత్రులు రాజీనామా చేయక తప్పదు -
జాబు వస్తుందని గుడ్డిగా నమ్మి ఓటేశాను
-
మేము ఎందుకూ పనికిరామా?
-
రాష్ట్రంలో ఉన్న పిల్లలు బాగుపడొద్దా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తేజ: మాది చాలా పేద కుటుంబం. మా తమ్ముడు వైఎస్ఆర్ దయవల్ల ఇంజనీరింగ్ చదివి విప్రోలో 40 వేల జీతానికి ఉద్యోగం చేస్తున్నాడు. మా తమ్ముడి లాగే అందరూ చేయాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. మీ కొడుకు లాగా రాష్ట్రంలో ఉన్న పిల్లలు కూడా బాగుపడొద్దా అని చంద్రబాబును అడుగుతున్నాం. మా తల్లి రెండుసార్లు కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు... ఆరోగ్యశ్రీ పుణ్యం వల్ల ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం రాలేదు. వైఎస్ జగన్: చంద్రబాబు మోసాలు చేసేవి ఎంత గొప్పగా చేస్తాడంటే, సాఫ్ట్ వేర్ అంతా నేనే తెచ్చా, సెల్ ఫోన్లు నేనే తెచ్చా, హైదరాబాద్ నేనే కట్టా అంటాడు. ఎందుకు ఈయన మాటలు వింటున్నాం అనిపిస్తుంది. మాకు మరీ దారుణం. అసెంబ్లీలో కూర్చోబెట్టి మరీ సోది వేస్తాడు. ఒక్కోసారి ఆయన చెప్పేది ఏమీ అర్థం కాదు. మా చెవిలో పూలున్నట్లు అనుకుంటాడు, మేం తల ఊపుతాం. సాఫ్ట్‌వేర్‌లో చంద్రబాబు సీఎం కాకముందు ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉండేది. ఆయన పదవి నుంచి దిగిపోయేసరికీ అంతే ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత 2009-10 నాటికి సాఫ్ట్‌వేర్‌లో మనం మూడో స్థానానికి వెళ్లాం. చంద్రబాబు హయాంలో సాఫ్ట్వేర్ ఎగుమతులలో 8.66 శాతం మన వాటా ఉంటే, వైఎస్ హయాంలో అది 14.93 శాతానికి పెరిగింది. చంద్రబాబు దిగిపోయే సరికి 909 కంపెనీలుంటే, వైఎస్ దిగేనాటికి అది 1584 కంపెనీలు అయ్యాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య కూడా అంతే. ఇన్నీ వాస్తవాలు అయినా చంద్రబాబు మాత్రం ప్రజల జ్ఞాపక శక్తి తక్కువన్న నమ్మకంతో గోబెల్స్ ప్రచారం చేస్తాడు. పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. -
మేం రాజకీయాల్లోకి రావాలా.. వద్దా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రశాంత్: నేను ఏయూలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది. కానీ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, ఉమాలను చూస్తే కౌరవ సభే గుర్తుకొస్తోంది. రాజకీయాల్లోకి రావాలా.. వద్దా? వైఎస్ జగన్: మనం ఈవాళ జనరేషన్. ఈ కుళ్లును, కుతంత్రాలను కడిగేద్దాం. రాజకీయాల్లోకి మంచివాళ్లు రావాలి. -
ఓసీలలో పేదల గురించి ఆలోచిస్తారా?
-
మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
-
జాబు వస్తుందని గుడ్డిగా నమ్మి ఓటేశాను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాజేష్: నేను మెకానికల్ డిప్లొమా చేశాను. టెంత్‌లో నాకు 98 శాతం వచ్చింది. కానీ ఈరోజుకూ జాబ్ లేదు. గుడ్డిగా నమ్మి ఓటేశాను. నిరుద్యోగ భృతి అన్నారు.. ఒక్క రూపాయి కూడా లేదు. మా నాన్న చనిపోయారు. మా అమ్మ టిఫిన్ బండి వేసి కుటుంబాన్ని నడిపిస్తోంది. వైఎస్ఆర్ గారు మాకు ఉచితంగా చదువు చెప్పించారు. తమ్ముడు ఇంజనీరింగ్ చదివినా తగిన ఉద్యోగం లేదు. 2 వేలు కాదు.. కనీసం 200 ఇచ్చినా చాలు. మా కోసం పోరాడండి వైఎస్ జగన్: రాజేష్ అడిగిన ప్రశ్నలన్నీ టీవీలలో ఇంతకుముందు మనకు కనిపించినవే. బాబు ఓట్లేయించుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ జాబులను గాలికి వదిలేశాడు. 2వేల నిరుద్యోగ భృతిని అసలు పట్టించుకోవడం లేదు. దీనంతటికీ ఏకైక సమాధానం ప్రత్యేక హోదా. అది వస్తే మనకు నో వేకెన్సీ బోర్డు కనిపించదు. మనమే కంపెనీలను ఎంచుకోవచ్చు. -వైఎస్ జగన్ -
ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికీ సిద్ధం
-
ప్రత్యేక హోదాయే సంజీవని: వైఎస్ జగన్
విశాఖపట్నం: ప్రత్యేక హోదా మన హక్కు అని, దాన్ని కలిసి కట్టుగా సాధిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ నంబర్ వన్ అవుతుందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న యువభేరిలో ఆయన ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 'యువత కదిలితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. ఆ స్ఫూర్తిని చూపిస్తూ, ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినా, కట్టడి చేసినా అవన్నీ బేఖాతరు చేస్తూ మీ అందరూ ఇక్కడికొచ్చి పోరాటంలో తోడుగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. ఆత్మీయతను పంచిపెడుతున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరసు వంచి కృతజ్ఞత చెప్పుకొంటున్నాను. ప్రొఫెసర్లు అందరికీ నమస్సులు. ప్రత్యేకహోదా కోసం నేను మాట్లాడిన ప్రతిసారీ, చేసిన ధర్నాల వల్ల ప్రత్యేక హోదా అంటే ఏంటనే అవగాహన కొంత వచ్చి ఉండాలి. కానీ మన ఖర్మ ఏమిటంటే రాష్ట్రాన్ని నడపాల్సిన ముఖ్యమంత్రిగారికి కూడా ప్రత్యేక హోదా గురించి తెలిసినా మభ్యపెడుతున్నారు. మంత్రులకు కూడా చాలామందికి ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలియదు. అంత దారుణమైన పరిస్థితులున్నాయి. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు 2014 మార్చి సమయంలో మన రాష్ట్రాన్ని మనం ఒప్పుకోకపోయినా అడ్డగోలుగా విభజించారు. ఆ సమయంలో రాష్ట్రంలో నుంచి హైదరాబాద్ పక్కకు వెళ్లిపోతోంది, దీనివల్ల తీవ్రమైన నష్టం మన ప్రాంతానికి జరుగుతుందని అందరికీ తెలుసు. అయినా వాళ్లు రాష్ట్రాన్ని విభజించారు. కంప్యూటర్ చదివిన ప్రతి ఒక్కరూ 95 శాతం ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే వస్తున్నాయని అందరికీ తెలుసు. అలాంటి హైదరాబాద్ నగరాన్ని మన నుంచి తీసేశారు. ఏ పరిశ్రమ ఎక్కడ రావాలన్నా.. 70 శాతం హైదరాబాద్‌లోనే. ఉద్యోగం కోసం ఎవరు వెతకాలన్నా చూసే ప్రాంతం హైదరాబాదే. అలాంటి నగరాన్ని మన నుంచి వేరు చేశారు. దానివల్ల అన్యాయం జరుగుతోందని తెలిసి, దీని బదులు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. అప్పుడు అదే సభలో ఉన్న ప్రతిపక్ష సభ్యులంతా దానికి మద్దతు తెలిపారు. ఒకడుగు ముందుకేసి, తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. అప్పుడు చంద్రబాబు పార్టీ కూడా రాజ్యసభలో ఉంది. ఆయన కూడా ఓటేసి దగ్గరుండి రాష్ట్రాన్ని విడగొట్టించారు. అన్ని పార్టీలూ కలిసి ఓటేసి రాష్ట్రాన్ని విడగొట్టారు. అప్పుడే ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ప్రజలతో పని అయిపోయిందన్నట్లు పాలకులు వ్యవహరిస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట ఉంది. ఎన్నికల్లో ఏ టీవీ ఆన్ చేసినా, ఏ గోడ మీద రాతలు చూసినా, చంద్రబాబు మైకు పట్టుకుని ఒకటే మాట చెప్పారు. రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలనేవారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు కావాలనేవారు. ఉద్యోగాలు ఊడగొడుతున్నారు మూడో మాట.. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలనేవారు. ఈవాళ బాబు సీఎం అయ్యారు. రైతులకు సంబంధించి రుణాలు ఏ ఒక్కరికీ మాఫీకాకపోగా.. గతంలో వడ్డీలేని రుణాలు ఇప్పుడు అపరాధ వడ్డీ 14 శాతం కట్టాల్సి వస్తోంది. బాబు ఇచ్చే డబ్బు వడ్డీలకు కూడా చాలక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్వాక్రా పొదుపు డబ్బులను కూడా బ్యాంకులు జమచేసుకుంటున్నాయి. 0 శాతం వడ్డీ పోయి రెండు రూపాయల వడ్డీ కడుతున్నారు. బాబు సీఎం అయ్యాక, ఉన్న జాబులను ఊడగొడుతున్నారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎప్పుడు తమ ఉద్యోగాలు పోతాయో తెలియక ఆవేదన చెందుతున్నారు. విశాఖలో 5వేల మందికి ఉద్యోగాలు పోయాయి. పోనీ జాబ్ ఇవ్వకపోతే ఇంటికి 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీఎం అయ్యాక.. 1.75 కోట్ల ఇళ్లున్నాయి. ప్రతి ఇల్లూ భృతి కోసం ఎదురుచూస్తోంది. ఆ మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలే ఊడబెరుకుతున్నారు. 1,42,822 లక్షల ఉద్యోగాలున్నాయని రాష్ట్రం విడగొట్టే సమయంలో చెప్పారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కొత్త రాష్ట్రం వచ్చాక ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. గత అక్టోబర్‌లో డీఎస్సీ పరీక్షలు పెట్టారు, ఫలితాలు వచ్చాయి కానీ వాళ్లకు ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వలేదు. ఉన్న స్కూళ్లను, హాస్టళ్లను తగ్గిస్తున్నారు. ఇక్కడే ఉద్యోగాలు మిగులుగా ఉన్నాయని చెప్పి రోజుకో పేపర్ లీక్ ఇస్తున్నారు. అంటే, డీఎస్సీ రాసిన పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఎప్పుడు పెడతారో తెలియవు. పిల్లలు గ్రామాల నుంచి వచ్చి హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఏళ్ల తరబడి చదువుకుంటున్నారు. అయినా చంద్రబాబుకు దయలేదు. కనీసం పీఎస్సీ పరీక్షల క్యాలెండర్ కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితిలో చదువుకున్న ప్రతి పిల్లాడికీ సంజీవనిలా కనిపించేది ప్రత్యేకహోదా. యూనివర్సిటీలలో 5 వేల ఉద్యోగాలు ఖాళీ చంద్రబాబు గత చరిత్ర చూసినా ఆయన ఏనాడూ పిల్లల గురించి, వాళ్ల ఉద్యోగాల గురించి ఆలోచించలేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ వల్లే రాష్ట్రం విజయం సాధించిందంటూ పుస్తకం విడుదల చేశారు. 42 ప్రభుత్వ సంస్థలను మూసేశామని గొప్పగా చెప్పుకొన్నారు. ఏరోజూ వీళ్లకు ఉద్యోగాలివ్వాలి, ప్రభుత్వ రంగ సంస్థలు బాగోకపోతే బలపరచాలన్న ఆలోచన లేదు. అవకాశం వస్తే ఆ సంస్థలను ఇంకా అధ్వానంగా చేసి, వాటిని అమ్మేసే కార్యక్రమానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. యూనివర్సిటీలలో 5 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టీచింగ్ స్టాఫ్ లేరు. అయినా 18 నెలల నుంచి సీఎంగారు పట్టించుకోరు. యూనివర్సిటీలు దివాలా తీయాలి, పిల్లలకు చదువు రాకుండా పోవాలి, ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకొస్తే మంచిదనే దిక్కుమాలిన ఆలోచన. అక్కడ కన్వీనర్ కోటా ఉండదు, అప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకమే ఉండదు, ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తారు. ప్రైవేటు వర్సిటీలకు ఉచితంగా భూములు, డబ్బులు కూడా ఇస్తారు. కనీసం లోకల్ కోటా కింద ఇంతమంది పిల్లలను ఇక్కడినుంచి తీసుకోవాలని కూడా చెప్పరు. రీజనల్ రిజర్వేషన్స్ కథ దేవుడెరుగు, లోకల్ రిజర్వేషన్లు కూడా ఉండవు. అయినా చంద్రబాబు ఈ ప్రైవేటు యూనివర్సిటీలనే తెస్తారు. తప్పుదోవ పట్టించడంలో దిట్ట గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈ సంవత్సరం కడతామంటారు. విద్యార్థులు వెళ్లి గొడవ చేస్తే, ధర్నాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా వ్యాన్లలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు ప్రపంచబ్యాంకు నెంబర్ 2 ర్యాంకు ఇచ్చిందని ఘనకార్యంలా చెప్పుకొంటున్నారు. ఈయనెలా మిస్ లీడ్ చేస్తారంటే, ఆయనెలా మోసం చేస్తారంటే.. ఆ స్టేట్మెంట్ చూద్దాం. ప్రపంచబ్యాంకు ఈమధ్య ఓ రిపోర్టు ఇచ్చింది. డిపెప్, కేపీఎంజీ అనేసంస్థ, సీఐఐ, ప్రపంచబ్యాంకు కలిసి ఈ రిపోర్టు తయారుచేశారు. మోదీ మేకిన్ ఇండియా అనే కార్యక్రమం కింద ఉత్పత్తి రంగాన్ని దేశంలో మెరుగు పరచాలని అన్నారు. అందులో అందరు సీఎస్ లను పిలిచి, 98 పాయింట్లు ఇచ్చారు. వీటిని ఏ రాష్ట్రమైనా ఎంత త్వరగా చేస్తారో చెప్పండి అన్నారు. చాలామంది అవి చూసి భయపడ్డారు. అందులో ఉన్నవి కార్మిక సంస్కరణలు. పనిచేసేవాళ్లను తీసేసే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది. యూనియన్లు ఉండవట. అలాంటి సంస్కరణలు ఉంటే చాలామంది సీఎంలు, సీఎస్‌లు భయపడ్డారు. మన చంద్రబాబు మాత్రం కుడి, ఎడమ చూడకుండా సంతకాలు పెట్టేశారు. ఆయనకు పోయేదేమీ లేదు. భోగాపురంలో భూములు తీసుకుని ప్రైవేటువాళ్లకు ఎక్కువ రేటుకు అమ్మేస్తారు. ఇలా చంద్రబబు సంతకాలు పెడితే.. ఆయనకు రెండోస్థానం ఇచ్చారు. కానీ ఆమాట చంద్రబాబు ఎప్పుడూ చెప్పరు. పక్కనున్న కర్ణాటక, తమిళనాడు వాళ్లంతా భయపడ్డారు. సంతకాలు పెడితే ఏమవుతుందని ఆలోచించారు. హోదా వస్తే నెంబర్ 1గా ఏపీ ప్రత్యేక హోదా రాగానే రాష్ట్రం నెంబర్ 1గా ఉంటుంది. కారణం, ఈ హోదా వస్తే రెండు ప్రధానమైన మేళ్లు జరుగుతాయి. కేంద్రం మనకిచ్చే నిధులు గ్రాంటుగా.. అంటే తిరిగి ఇవ్వక్కర్లేకుండా 90 శాతం వస్తాయి. పది శాతమే రుణంగా ఉంటుంది. అదే ప్రత్యేక హోదా లేకపోతే 70 శాతం రుణంగా ఉంటుంది, 30 శాతమే గ్రాంటుగా ఉంటుంది. హోదావస్తే రాష్ట్రానికి అప్పులు తగ్గుతాయి. రెండోది.. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం వందశాతం ఎక్సైజ్ డ్యూటీ, ఆదాయపన్ను మినహాయింపులు ఇస్తుంది. రవాణా ఛార్జీలు కూడా వెనక్కి ఇచ్చే సదుపాయం ఉంటుంది. ఇవి ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకు మాత్రమే వస్తాయి. ఈ విషయాలు పరిశ్రమలకు తెలిస్తే.. మన రాష్ట్రం నుంచి చాలామంది పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తారు. లక్షల కోట్లు పెట్టుబడిగా తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు ఇది తెలిసినా చంద్రబాబు పట్టించుకోరు. ఆయన ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యోగాలు తెప్పించే ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయరు. అసలు ఆయన మనిషేనా అనిపిస్తుంది. ఆయనను ఈమధ్య చూస్తే బాగా తెలుస్తోంది. ఆయన ఈ రాష్ట్రానికి సీఎంగా ఉంటూ లంచాలుగా తీసుకున్న డబ్బు.. పట్టిసీమ నుంచి అన్నీ లంచాలే. మట్టి, ఇసుక, మద్యం లైసెన్సులు, కరెంటు కోసం బొగ్గు కొనుగోలు చేయాలన్నా అన్నీ లంచాలే. ఈ డబ్బుతో చంద్రబాబు నాయుడు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా పంచుతూ అక్కడ ఎమ్మెల్సీని గెలవాలన్న తపనతో ఒక్కొక్కరికి 5 నుంచి 20 కోట్ల వరకు 18 మంది ఎమ్మెల్యేలకు ఎర చూపించారు. ఆడియో, వీడియో టేపుల్లో నేరుగా దొరికిపోవడాన్ని కూడా మనం చూశాం. కేంద్రంలో ఉన్న మంత్రులను ఉపసంహరించుకుంటానని ఈయన చెప్పరు. కారణం అక్కడి వాళ్లు కీ ఇస్తారు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే చంద్రబాబు బీజేపీ ప్రభుత్వం ముందు సాగిలపడాలి. ఇలాంటివాళ్లను చూస్తే మన ఖర్మ అనిపిస్తుంది. కేసులు అందరికీ ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవాళ్లకు ప్రత్యర్థులు ఎక్కువ. ఆరోజుల్లో నామీద కేసులు పెట్టినవాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, చంద్రబాబు కలిసి పెట్టారు. రాజశేఖరరెడ్డి ఉన్నంతవరకు జగన్ మంచోడే. ఎప్పుడైతే జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారో జగన్ చెడ్డోడు అయిపోయాడు. చంద్రబాబు సోనియాగాంధీకి తందానా అన్నారు, నామీద కేసులు పెట్టారు. అయినా నేను భయపడలేదు. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని నిజాయితీగా పోరాడింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. కేసులు వస్తాయనే భయంతోనే చంద్రబాబు ముందుకు రావట్లేదు. కేసులు వస్తాయని రాష్ట్రాన్ని పణంగా పెడితే పిల్లలు మనవైపు చూస్తున్నారు. వాళ్లకు మనం రోల్ మోడల్స్‌గా ఉండాలి. కానీ కేసులున్నాయని రాష్ట్రాన్ని అమ్మేసే, పణంగాపెట్టే కార్యక్రమం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతామని చెబుతున్నా. ప్లేటు ఫిరాయిస్తున్న చంద్రబాబు కేంద్రం ఎటూ ప్రత్యేక హోదా ఇవ్వదని చంద్రబాబు ప్లేటు మారుస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదు, దానికంటే ప్యాకేజి మేలని ఆయన చెబుతున్నారు. అదేంటని ఆయనను నిలదీయండి. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మన రాష్ట్రానికి పోలవరం కడతామని, కారిడార్ ఇస్తామని, రోడ్లు, భవనాలు కడతామని, యూనివర్సిటీలు తెస్తామని.. రకరకాల హామీలిచ్చారు. ఆ హామీలన్నీ కూడా వాళ్లు ఇంత డబ్బులవుతాయని లెక్కకట్టి, దాన్నే ఒక ప్యాకేజిగా ఇస్తామంటున్నారు. ఇవన్నీ అప్పుడు చెప్పినవే కదా, అంటే మన హక్కే కదా.. ఇప్పుడు మరి ప్రత్యేకంగా తెచ్చేదేంటని నిలదీయండి. అదేదో తాను కొత్తగా తెస్తున్నట్లు ఈయన మభ్యపెట్టి, ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తున్నారు. చంద్రబాబు వస్తే గట్టిగా నిలదీయండి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల గురించి చంద్రబాబు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి ఆయన మంత్రులు అంటారు.. ఒడిసా, తమిళనాడు, మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదని అంటున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ రాష్ట్రాలు లేవా, వాళ్లు ఉన్నప్పుడే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కాదనడం ఏంటి? ప్రజల చెవిలో పూలు పెట్టొద్దు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు కాబట్టి హోదా ఇవ్వడంలేదని మరో అబద్ధం చెబుతున్నారు. మేమంతా చదువుకున్నవాళ్లమే. మాకూ తెలుసు. ఆర్థిక సంఘం పరిధి, ప్రణాళికా సంఘం పరిధి, ప్రత్యేక హోదా ఇచ్చేదెవరో మాకు తెలుసు, మా చెవిలో పూలు పెట్టొద్దని బాబుకు చెప్పండి. దేశంలో పన్నుల రూపేణా వసూలు చేసిన డబ్బులను ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనే నిష్పత్తిని చూసేది ఆర్థిక సంఘం. నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాలు చూస్తుంది. ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా కేబినెట్ నిర్ణయం. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్.. దానికి అధ్యక్షుడు ప్రధాని. నీతి ఆయోగ్‌కు అధ్యక్షుడు కూడా ప్రధానమంత్రి. ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి అవునా కాదా అని నిలదీయండి. మార్చి 3న ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇప్పటికి 18 నెలలైనా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని అడగండి. ఇంత పచ్చిగా అబద్దాలు చెబుతున్నారు. దీన్ని గట్టిగా నిలదీయాల్సింది మనం. ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్‌లో జరిగిన అభివృద్ధి చూద్దాం. అక్కడ 2వేల పరిశ్రమలు వచ్చాయి 30వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఏకంగా 10వేల పరిశ్రమలు వచ్చాయి. ఇది ప్రత్యేక హోదా వల్ల మనకు జరిగే మేలు. మనకు 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే, కలిగే ప్రయోజనాల వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ప్రత్యేక హోదా గురించి తెలుసుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, స్పెషల్ స్టేటస్ అని గూగుల్‌లో కొడితే బోలెడు వెబ్సైట్లు వస్తాయి. వాటిని చూసి చంద్రబాబు ప్రభుత్వానికి మీరే అవగాహన కల్పించవచ్చు. -
కాంగ్రెస్,టీడీపీ కుమ్మక్కై కేసులు పెట్టారు
-
ఆడియో,వీడియో టేపులతో ఆడ్డంగా దొరికాడు
-
’దగ్గరుండి ఓటేసి రాష్ట్రాన్ని విడగొట్టారు’
-
పరీక్షల కేలండర్ ఇప్పటివరకు ప్రకటించలేదు
-
'నాయకులకు విద్యార్థులు చేయూతనివ్వాలి'
-
'ఉద్యోగాలివ్వాలని వేడుకుంటున్నాం'
-
'నాయకులకు విద్యార్థులు చేయూతనివ్వాలి'
విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న యువభేరిలో ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం సాగిందిలా... 'ఉత్తరాంధ్ర విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వాలు బొబ్బిలి, శ్రీకాకుళం, పైడిభీమవరం, పరవాడలను పెట్రోకెమికల్ జోన్ అని చెప్పారు. కానీ ఇక్కడ తిరిగి చూస్తే ఎక్కువగా పరిశ్రమలు రాలేదు. పరిశ్రమ పెట్టిన మొదటి మూడునాలుగేళ్లు నష్టాలే తప్ప లాభాలు రావు. అదే ప్రత్యేక హోదా ఉంటే మొదట్లో రాయితీలు వస్తాయి కాబట్టి పరిశ్రమలు నెలకొల్పుతారు, ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది. చదువు అయిపోయిన తర్వాత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివాను కదా, ఏదైనా పరిశ్రమ పెడతానని అడిగితే.. లాభదాయకమైన పరిశ్రమ ఇదీ అని చెప్పలేకపోతున్నాం. కెమికల్, ఫార్మా పరిశ్రమలు అన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. అక్కడివాళ్లకే ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప ఇక్కడివాళ్లకు రావడం లేదు. ప్రత్యేక హోదా వస్తే.. ఇక్కడే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనికోసం పోరాడుతున్న నాయకులకు విద్యార్థులు చేయూతనివ్వాలి' అన్నారు. -
'ఉద్యోగాలివ్వాలని వేడుకుంటున్నాం'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు విద్యార్థులు కలిసి రావాలని ఏయూ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అబ్బులు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న యువభేరిలో ఆయన ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 'ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి. టీడీపీ ప్రభుత్వం, తర్వాత వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. వీటన్నింటిలో ఓ ప్రత్యేకత గల నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన అమలు చేసిన విధానాల వల్ల స్కూలు టీచర్ల దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజి వరకు అన్నిచోట్లా నియామకాలు జరిగాయి. విద్యార్థులు కూడా మేలు పొందారు. ఎన్నో రాజకీయ క్రీడల తర్వాత మన రాష్ట్రాన్ని విభజించారు. ఆ సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. వాటిలో ఒకటి ప్రత్యేక హోదా. అది వస్తే, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సింగపూర్, థాయ్‌లాండ్, జర్మనీ వెళ్లి వాళ్లను బతిమాలుతున్నాం. పరిశ్రమలు పెట్టి మా నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలని వేడుకుంటున్నాం. ప్రత్యేక హోదా వస్తే, వాళ్లంతట వాళ్లే వచ్చి దాని సౌలభ్యాలతో పరిశ్రమలు నెలకొల్పుతారు, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తారు. ఈ ఉద్యమం ఏ ఒక్కరి సంక్షేమం కోసమో చేస్తున్నది కాదు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. రాష్ట్ర సంక్షేమం కోసం చేస్తున్న పోరాటం కాబట్టి ఈ పోరాటంలో విద్యార్థులు అందరూ సహకరించాలి' అని కోరారు. -
మరి ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారు?
-
ప్రత్యేక హోదాపై క్లారిటీ లేదు
-
మరి ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారు?
విశాఖపట్నం: పార్లమెంటు పవిత్రతే పాడైపోతే, అసెంబ్లీ అపవిత్రం అయిపోతే ఇక దేశానికి, ఈ రాష్ట్రానికి విలువ ఏముంటుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని ఏయూ ఇంజనీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న యువభేరిలో ఆయన ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 'ఈ కార్యక్రమాన్ని జరపనివ్వరు, అడ్డుకుంటారని పొద్దుట నుంచి ఫోన్లు వచ్చాయి. తీరా వస్తే వందలాది, వేలాది మంది విద్యార్థులు ఇక్కడున్నారు. ప్రత్యేక హోదా కోసం మేం రాజకీయాలు చేయం. ఒకే కారణంతో ఇక్కడున్నాం. భావితరానికి ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలు ఎంత గొప్పగా ఉంటాయో మాకు తెలుసు. విశాఖ, విజయనగరం విద్యార్థుల కోరిక మేరకు వైఎస్ జగన్ ఇక్కడకు వచ్చారు. 2014 మే 7వ తేదీన అప్పుడే ఆంధ్రలో ఎన్నికలు ముగిశాయి. అప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ప్రత్యేక హోదా ఇస్తామనే పేరుతో రాష్ట్ర ఆదాయంలో 60 శాతం వాటా ఉన్న హైదరాబాద్‌ను మనకు దూరం చేశారని అప్పట్లో ఆయన చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ఏమైనా ఉన్నాయా.. లేవు. అంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన రాలేదు. ప్రత్యేక హోదా వస్తే వైఎస్ జగన్‌కు పేరు రాదు, అధికారంలో ఉన్న పార్టీకే వస్తుంది. అయినా కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన ముందుకొచ్చారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానాలు ఉండటం లేదు. పార్లమెంటు పవిత్రతే పాడైపోతే, అసెంబ్లీ అపవిత్రం అయిపోతే ఇక దేశానికి, ఈ రాష్ట్రానికి విలువ ఏముంటుంది? పార్లమెంటు సాక్షిగా ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని చెబితే, అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం పదేళ్లు ఇస్తామని చెప్పింది. మరి ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారు? కేవలం అబద్ధాల మీద ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఒకటా.. రెండా.. చాలా చాలా అబద్ధాలు చెబుతున్నారు. విద్యార్థులు వాట్సప్‌లో దీని గురించి మెసేజిలు పంపుతున్నారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులందరూ కూడా అబద్ధాలతోనే కాలం గడుపుతున్నారేమని విద్యార్థులు అడుగుతున్నారు. చంద్రబాబు ప్రతిసారీ సింగపూర్, జపాన్ ఎందుకు వెళ్లిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటోందని వాళ్లు అడుగుతుంటే ఏం చెప్పాలో మాకు తెలియట్లేదు. చైనా, సింగపూర్ కాదు.. ఉత్తరాఖండ్‌కు వెళ్లి చూడండి. అక్కడ 3 వేల పరిశ్రమలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ ప్రత్యేక హోదా ఉంద'ని పేర్కొన్నారు. -
యువభేరీ సభా వేదిక వద్దకు వైఎస్ జగన్
-
యువభేరికి పోటెత్తిన విద్యార్థులు
విశాఖపట్నం: ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన యువభేరికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం ఆంక్షలతో అడ్డుకట్ట వేయాలని చూసినా లెక్క చేయకుండా యువభేరికి పోటెత్తారు. విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సమావేశం అనుకున్నదాని కంటే విజయవంతం అవుతుందని విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రత్యేక హోదా సాధన దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. -
యువభేరికి పోటెత్తిన విద్యార్థులు
-
హోదా కోసం.. నేడు విశాఖలో ‘యువభేరి’
♦ ప్రత్యేక సదస్సును నిర్వహిస్తున్న ఆంధ్రా వర్సిటీ విద్యార్థులు ♦ వేదిక విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియం.. ♦ ‘నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్య, ఉపాధి అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి’పై చర్చ ♦ ముఖ్య అతిథిగా హాజరవుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ♦ ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతపై మార్గనిర్దేశం చేయనున్న విపక్ష నేత సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువత సమరభేరి మోగిస్తోంది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తాయని, తద్వారా తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించిన విద్యార్థి, నిరుద్యోగ యువత రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఇది ఆగ్రహంగా మారి విద్యార్థి, నిరుద్యోగ యువత ఉద్యమ దిశగా కదులుతోంది. ఈ క్రమంలో ఈ నెల 15న తిరుపతిలో విద్యార్థులు ‘యువభేరి’ పేరిట సమరభేరి మోగించారు. ఇదే క్రమంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు సాగుతున్నారు. ‘నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్య, ఉపాధి అవకాశాలు-రాష్ట్ర భవిష్యత్తు’ అనే అంశంపై విశాఖపట్నంలో మంగళవారం ‘యువభేరి’ పేరిట భారీ సదస్సును నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 10 గంటల కు నిర్వహించే ఈ యువభేరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ర్టంలో అభివృద్ధి జరుగుతుందని, యువతకు ఉద్యోగాలొస్తాయని తొలినుంచీ పోరాడుతున్న జగన్ ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధనపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు. పోరు ఆవశ్యకతను వివరించనున్న జగన్ అడ్డగోలు విభజన వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టం, విద్యార్థులు-యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన తీరును జగన్ ఈ సదస్సులో వివరించనున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రభుత్వం మోసగిస్తున్న తీరును తేటతెల్లం చేస్తారు. రాష్ట్రం ప్రగతిపథంలో సాగి ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ప్రత్యేక హోదా సాధించాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులు, యువతకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను ఆయన ప్రస్తావిస్తారు. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యలు, హాస్టళ్ల కుదింపు, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, విద్యార్థులపై లాఠీచార్జి తదితర అంశాలను లేవనెత్తనున్నారు. అలాగే యువత సందేహాలను నివృత్తి చేస్తారు. హోదా సాధన దిశగా విద్యార్థులు, యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు పోరుబాట పట్టాల్సిన అవసరాన్నీ వివరిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు విభజనవల్ల కలిగిన నష్టం, ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతపై కళావాణి ఆడిటోరియం ప్రాంగణంలో ప్రత్యేకంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇతర నేతలు సదస్సు నిర్వహించనున్న పోర్టు కళావాణి ఆడిటోరియంలో సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
యువభేరికి పోలీసులు అడ్డంకులు
-
ప్రత్యేక హోదా అంటే కూడా తెలీదు...
-
యువభేరి వేదిక వద్దకు చేరుకున్న జగన్
-
'ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి'