విశాఖపట్నం: ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన యువభేరికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం ఆంక్షలతో అడ్డుకట్ట వేయాలని చూసినా లెక్క చేయకుండా యువభేరికి పోటెత్తారు. విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సమావేశం అనుకున్నదాని కంటే విజయవంతం అవుతుందని విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రత్యేక హోదా సాధన దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేయనున్నారు.
యువభేరికి పోటెత్తిన విద్యార్థులు
Published Tue, Sep 22 2015 10:57 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement