
జాబు వస్తుందని గుడ్డిగా నమ్మి ఓటేశాను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
రాజేష్: నేను మెకానికల్ డిప్లొమా చేశాను. టెంత్లో నాకు 98 శాతం వచ్చింది. కానీ ఈరోజుకూ జాబ్ లేదు. గుడ్డిగా నమ్మి ఓటేశాను. నిరుద్యోగ భృతి అన్నారు.. ఒక్క రూపాయి కూడా లేదు. మా నాన్న చనిపోయారు. మా అమ్మ టిఫిన్ బండి వేసి కుటుంబాన్ని నడిపిస్తోంది. వైఎస్ఆర్ గారు మాకు ఉచితంగా చదువు చెప్పించారు. తమ్ముడు ఇంజనీరింగ్ చదివినా తగిన ఉద్యోగం లేదు. 2 వేలు కాదు.. కనీసం 200 ఇచ్చినా చాలు. మా కోసం పోరాడండి
వైఎస్ జగన్: రాజేష్ అడిగిన ప్రశ్నలన్నీ టీవీలలో ఇంతకుముందు మనకు కనిపించినవే. బాబు ఓట్లేయించుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ జాబులను గాలికి వదిలేశాడు. 2వేల నిరుద్యోగ భృతిని అసలు పట్టించుకోవడం లేదు. దీనంతటికీ ఏకైక సమాధానం ప్రత్యేక హోదా. అది వస్తే మనకు నో వేకెన్సీ బోర్డు కనిపించదు. మనమే కంపెనీలను ఎంచుకోవచ్చు.
-వైఎస్ జగన్