యువభేరికి చకచకా ఏర్పాట్లు | Fast arrangements for Yuva bheri | Sakshi
Sakshi News home page

యువభేరికి చకచకా ఏర్పాట్లు

Published Wed, Feb 15 2017 1:12 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు - Sakshi

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

* నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన వేదిక
* స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు 
విద్యార్థులు, మేధావులు భారీగా తరలిరావాలని పిలుపు
 
సాక్షి, అమరావతి బ్యూరో/ పట్నంబజారు: గుంటూరులో ఈనెల 16వ తేదీన జరిగే యువభేరి కార్యక్రమానికి  ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చర్చించారు. విద్యార్థులు, మేధావులు,యువకులను చైతన్యపరిచి పెద్ద ఎత్తున యువభేరికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అనంతరం యువభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. పార్టీ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అ«ధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు ఆధ్వర్యంలో పోస్టర్‌ను విడుదల చేశారు.  పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ప్రత్యేకహోదా సాధనకు ఆమరణ దీక్ష చేసిన నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కనున్న స్థలాన్నే యువభేరికి వేదికగా ఎంపిక చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని వారు వివరించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షతో పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
 
ఏర్పాట్లను పరిశీలించిన నేతలు...  
యువభేరి వేదిక వద్ద ఏర్పాట్లను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, ,  సలాంబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎండీ నసీర్‌ అహ్మద్,  గుంటూరురూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరిఽ కొటే«శ్వరరావు పరిశీలించారు. పలు విభాగాల నేతలు కొత్తా చిన్నపరెడ్డి, డైమండ్‌ బాబు, మొట్టు వెంకట అప్పారెడ్డి, ఉప్పుటూరి నర్శిరెడ్డి, దాసరి కిరణ్‌, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, దుగ్గంపూడి యోగేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య, జగన్‌కోటి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు యువభేరి నేపథ్యంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. దానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తలశిల రఘురామ్‌ మాట్లాడుతూ యువభేరికి అంతా సన్నద్ధమైందని, 16న జగన్‌ గుంటూరులో జరిగే యువభేరిలో పాల్గొంటారని తెలిపారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను బలంగా వినిపించడానికి యువతను దీనిలో భాగస్వాములను చేయడానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఉపాధి కల్పన ఉంటుందని చెప్పారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ వివిధ రకాల ఒత్తిళ్ల ద్వారా తమను ఆటంకపరచడానికి ప్రయత్నించడం సరైన చర్య కాదన్నారు.  
 
జిల్లాలో ఉపాధి ఊసేలేదు..
జిల్లాలో ఉపాధి కల్పన సమస్యాత్మకంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి ఇప్పటి వరకు 51,959 మంది పట్టభద్రులు ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో నమోదు చేసుకోగా, వారిలో వెయ్యి మందికి మాత్రమే ప్రైవేటు  ఉద్యోగాలు అందిన పరిస్థితి. ప్రతిఏటా జిల్లాలో 20వేలమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు, 15వేల మంది డిగ్రీ విగ్యార్థులు, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులు మరో 80వేల మంది చదువు పూర్తి చేస్తున్నారు.  జిల్లాలో కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి. ఇతర ప్రాంతాలకు వెళుతున్నా ఉపాధి లభించని పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తే రాయితీ ఉండటంతో పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement