కాకినాడలో వైఎస్ జగన్ యువభేరి
హైదరాబాద్: ఈ నెల చివరి వారంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం కాకినాడలో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నేతలతో సోమవారం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
జిల్లా సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించినట్టు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. లక్షలాది ఎకరాల్లో పండిన పంటకు మద్దతు ధర లేదన్నారు. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, నిధుల లేమితో స్థానిక సంస్థలు సతమతమవుతున్నాయని చెప్పారు. పార్టీని మరింత పటిష్ఠపరిచేందుకు కృషి చేయాలని జిల్లా నేతలకు వైఎస్ జగన్ సూచించారన్నారు.