జగన్‌కు ముస్లింల మొర
కాకినాడ :అకారణంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి వేధిస్తున్నారంటూ ముస్లింలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ సినిమా రోడ్డు మీదుగా ప్రచారంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి ఆదివారం సాయంత్రం పలువురు ముస్లింలు తమ ఆవేదన తెలియజేశారు. ముస్లిం యువకుడు యూనిస్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి వేధిస్తున్నారంటూ వాపోయారు. ఎలాంటి తప్పూ చేయకపోయినా చేతిలో ఓటర్ల లిస్టుతో వెళ్తున్న యూనిస్‌ను స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెడుతున్నారన్నారు.
డివిజన్‌లో వైఎస్సార్‌సీపీకి ముస్లింలు అనుకూలంగా ఉండడం, పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తుండడంతో జీర్ణించుకోలేక ఇలాంటి వేధింపులకు పాల్ప డుతున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అతనిని విడిపించేందుకు జోక్యం చేసుకోవాలని సుమారు 60 మంది ముస్లింలు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో జగన్ ప్రచార రథం వద్దకు వచ్చి వేడుకున్నారు. వెంటనే స్పందించిన జగన్ ఈ అంశాన్ని జిల్లాపార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు వచ్చి పరిష్కరిస్తారని, అధైర్యపడవద్దంటూ భరోసా ఇచ్చారు.
యూనిస్ తండ్రితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు.అంతకుముందు యూనిస్‌ను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ముస్లింలు, పలువురు స్థానికులు పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, కాకినాడనగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్బర్ అజామ్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పసుపులేటి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
పోలీసులు అన్యాయంగా వేధిస్తున్నారు
Published Mon, Aug 28 2017 3:30 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement